Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
Happy New Year 2023 Wishes in Telugu : కొత్త ఏడాది వేళ కొంచెం కొత్తగా విషెస్ చెప్పండి...!
కొత్త సంవత్సరం వేళలో మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇలా విషెస్ చెప్పండి.
మరికొన్ని గంటల్లో మనమందరం 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పనున్నాం.. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. చాలా దేశాల్లో లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఇంటికే పరిమితమయ్యారు. చాలా మంది ప్రజలు తమ బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను కూడా కలవలేకపోయారు. ఇప్పుడు ఒమిక్రాన్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది.

అయితే 2023 సంవత్సరంలో కరోనాకు వ్యాక్సిన్ రావడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే 100 కోట్ల మందికి పైగా టీకాలు వేసుకున్నారు. ఈ క్రమంలో గత సంవత్సరం కంటే.. కొత్త సంవత్సరం మెరుగ్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం.
ఈ నేపథ్యంలో మీ ప్రియమైన వారికి న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు చాలా మంది వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ను తమదైన శైలిలో పంపుతూ.. విషెస్ చెబుతూ.. వీడియోలు, మెసెజ్ లు రెడీ చేసుకుంటూ ఉంటారు.
ఈ సందర్భంగా కొత్త సంవత్సరానికి సంబంధించిన అద్భుతమైన సందేశాలు, కోట్స్ తో మీ ముందుకొచ్చాం. ఈ జాబితాలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి.. మీకు నచ్చిన వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపండి...

అంతా మంచే జరగాలని..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్మిక్రాన్ వంటి మహమ్మారి కొత్త సంవత్సరంలో కనుమరుగు కావాలని.. నూతన సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కొత్తగా ఆలోచిద్దాం..
ఇప్పటివరకూ లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. ఇక నుండి అలాంటివి ఎదురుకాకుండా కొత్తగా ఆలోచిద్దాం.. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కరోనా కనుమరుగు కావాలని..
కరోనా మహమ్మారి కొత్త సంవత్సరంలో కనుమరుగు కావాలని.. నూతన సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో..
ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు..

అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
గతంలోని జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు

సరికొత్త లక్ష్యాలతో..
కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది శుభాకాంక్షలు

కొత్త సంవత్సరంలో..
మధురమైన జ్ణాపకాలు నిలుస్తాయి జీవితాంతం.. రాబోతోంది నూతన సంవత్సరం.. వచ్చే కొత్త సంవత్సరంలో అలాంటి క్షణాలెన్నో మీరు ఆనందించాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ న్యూ ఇయర్..

కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ..
కొత్త సంవత్సరం వేళ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ..
మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్

ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని..
నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం.. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మీ కలలన్నీ సాకారం కావాలని..
కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం కలకాలం మీతోనే ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు..



Click it and Unblock the Notifications
