For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ అరచేతిలోని ఈ ప్రత్యేకమై రేఖలు కాబోయే భర్త లేదా భార్య గురించి తెలియజేస్తాయి

మీ అరచేతిలోని ఈ ప్రత్యేకమైన రేఖలు కాబోయే భర్త లేదా భార్య గురించి తెలియజేస్తాయి.

|

ఎన్నో వేల ఏళ్ల నాటి నుంచి హస్త సాముద్రికం (చేతి రేఖలను బట్టి జాతకం చెప్పడం) చలామణీలో ఉంది. అయితే కొన్ని ఏళ్ల పాటు అత్యంత కూలంకషంగా అధ్యయనం చేసిన నిపుణులైన కొందరు మాత్రమే దీన్ని సరిగ్గా చెప్పగలుగుతారు. ఇప్పటి రోజుల్లో మనలో అనేక మంది హస్తసాముద్రికాన్ని కూడా నమ్ముతున్నారు. చేతిలోని రేఖల తీరుతెన్నులను బట్టి మన జాతకాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని వారి విశ్వాసం. అయితే కొందరికి ఇది అంత ఆసక్తికరమైన విషయం అనిపించకపోవచ్చు. హస్తసాముద్రికమేంటి, నాన్‌సెన్స్ అని తీసిపారేస్తారు కూడా. ఇది పక్కన పెడితే అసలు ప్రేమ, వివాహం అనే కీలక అంశాలకు చెందిన రేఖలు మాత్రం చేతిలో ఎక్కడ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వ్యక్తి చేతిలో ఉన్న రేఖలను బట్టి

ఒక వ్యక్తి చేతిలో ఉన్న రేఖలను బట్టి

ఒక వ్యక్తి చేతిలో ఉన్న రేఖలను బట్టి ప్రేమతో కూడిన అతని వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవచ్చు. హస్తసాముద్రికం నైపుణ్యం కలిగిన వారు దీన్ని అత్యంత కచ్చితంగా చెప్పగలరు.

ఈ రేఖలు మీ చేతిలో ఉన్నాయా?? మీరు కోటీశ్వరులవుతారు | Do You Know What Is The Meaning Of Palm Lines?
చేతి రేఖలను బట్టి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందనే

చేతి రేఖలను బట్టి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందనే

చేతి రేఖలను బట్టి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పగలిగే సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. అదెలాగంటే ఒక వ్యక్తి చేతిలో ఉండే ఆయా రేఖలు అతని జీవితంలోని పలు అంశాల గురించి వివరంగా తెలుపుతాయని చెబుతోంది.

బొటనవేలు దగ్గర ప్రేమ, వాత్సల్యం,

బొటనవేలు దగ్గర ప్రేమ, వాత్సల్యం,

బొటనవేలు దగ్గర ప్రేమ, వాత్సల్యం, అభిమానానికి సంబంధించిన రేఖలు ఉంటాయట. ఒక వ్యక్తి ఏదైనా ఒక నిర్దిష్ట వయస్సుకు రాగానే ఆ రేఖలు కనిపిస్తాయట. అప్పుడు వారికి తగిన వ్యక్తులు జీవిత భాగస్వాములుగా దొరుకుతారట.

చిటికెన వేలు కింద వివాహానికి సంబంధించిన రేఖ

చిటికెన వేలు కింద వివాహానికి సంబంధించిన రేఖ

చిటికెన వేలు కింద వివాహానికి సంబంధించిన రేఖ ఉంటుందట. రెండు చేతుల్లోనూ ఉండే ఈ రేఖలను కలిపి పక్క పక్కనే ఉంచి చూస్తే అవి సమానంగా జత కలవాలట. అలా కలిస్తే వివాహం త్వరగా అవుతుందట.

అరచేతిలో రేఖలు రెండూ సమానంగా ఉంటే

అరచేతిలో రేఖలు రెండూ సమానంగా ఉంటే

రెండు చేతులు కలిసి పట్టుకుంటే హృదయ రేఖలు సమాంతరంగా కలిస్తే వారు అందరూ చూసిన సంబంధాన్ని ఒప్పుకుని పెళ్ళి చేసుకుంటారు. అంతే ఈ సమాంతర రేఖలున్న వ్యక్తి చాలా సున్నిత మనస్కులు, మంచి మర్యదలు ఉన్నవారు. మంచి తెలివిగలవారు, పనులు వేగంగా చేయడాన్ని ఇష్టపడరు.

కుడి అరచేతి రేఖ ఎడమ అరచేతి రేఖ కంటే పైన ఉంటే

కుడి అరచేతి రేఖ ఎడమ అరచేతి రేఖ కంటే పైన ఉంటే

మీరు వృద్ధులను ఇష్టపడే వ్యక్తి అని దీని అర్థం. మీరు అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం కూడా సాధ్యమే. అంటే వయస్సులో మీకంటే పెద్దవారిని వివాహం చేసుకునే అవకాశం ఉంది. మీరు చాలా చురుకైన వ్యక్తి, చుట్టూ ఉన్న ఇతరులను సులభంగా అర్థం చేసుకుంటారు మరియు మీ చుట్టూ నిజంగా ఏమి జరుగుతుందో సులభంగా గ్రహించేస్తారు. మీ చుట్టూ ఉన్న ఇతరుల అభిప్రాయాలను మీరు నిజంగా పట్టించుకోరు. వారి ఇష్టానికి అనుగుణంగా జీవించే సంప్రదాయవాదులు వీరు కాదు.

ఎడమ అరచేతి రేఖ కుడి అరచేతి రేఖ కంటే పైన ఉంటే

ఎడమ అరచేతి రేఖ కుడి అరచేతి రేఖ కంటే పైన ఉంటే

ఈ సందర్భంలో మీరు సవాళ్లను ఇష్టపడే వ్యక్తిగా ఉంటారు మరియు దూరమైన, ఉద్వేగభరితమైన ప్రేమ కోసం ఆరాటపడే దూకుడు వ్యక్తి. మీరు బాగా చదివిన వారిని లేదా అపరిచితులను వివాహం చేసుకునే అవకాశం ఉంది. ఈ వర్గంలో వ్యక్తులు మహిళలు మరియు పురుషులు ఆకర్షణీయంగా ఉంటారు.

English summary

How The Heart Line Explains Your Marriage And Love

How The Heart Line Explains Your Marriage And Love, Read more to know about,
Desktop Bottom Promotion