Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...
వివాహం చేసుకున్న ప్రతి ఒక్క జంట తమ వైవాహిక జీవితంలో ఆనందంగా మరియు రొమాంటిక్ ఉండాలని కోరుకుంటారు.

కానీ ప్రతి ఒక్కరి వివాహ జీవితంలో పెళ్లి తర్వాత చిన్నవో.. పెద్దవో గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొందరు వాటిని అర్థం చేసుకుని సర్దుకుపోతుంటారు.

అయితే మరికొందరు మాత్రం అపార్థం చేసుకుని విడిపోతుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగాలంటే మీరు కొన్ని పద్ధతులను కచ్చితంగా పాటించాలి.

ముఖ్యంగా మీరు జన్మ రాశిని బట్టి, మీరు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. వీటిని మీరు పాటిస్తే, మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలున్నా, మీరు వాటిని అధిగమించొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు స్వభావ రీత్యా, కొంచెం కోపంగా ఉంటారు. కానీ వీరి వివాహ జీవితం బాగుంటుంది. వీరు జీవిత భాగస్వామి పట్ల నిజాయితీని కలిగి ఉంటారు. అంతేకాకుండా, వీరు ఎంతో సున్నిత మనస్కులు కలిగినవారు. వీరు మిథునం లేదా కన్య రాశి వారిని పెళ్లి చేసుకోకూడదు.

వృషభరాశి..
ఈ రాశి వారి వివాహ జీవితం చాలా చక్కగా సాగుతుంది. వీరు వీరి భాగస్వామితో చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే వీరు మంచి భాగస్వామి కోసం ఎదురుచూస్తుంటే, ధనస్సు, మీన రాశి వారిని మాత్రం వివాహం చేసుకోకూడదు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే, మీరు హనుమతుండిని నిత్యం ఆరాధిస్తే మంచి జరుగుతుంది.

మిధున రాశి..
ఈ రాశి వారు చంచలమైన మనసు కలిగినవారు. వీరి వైవాహిక జీవితం చాలా సాధారణంగా ఉంటుంది. వీరి వివాహ బంధంలో కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి. వీరు మేషం, వృశ్శిక రాశి వారిని పెళ్లి చేసుకోకూడదు. వీరు పెళ్లి తర్వాత ఆనందంగా ఉండాలంటే నీటిలో పసుపును కలిపి సూర్యుడికి సమర్పించాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ అభిప్రాయాలతో మీ భాగస్వామి విభేదించవచ్చు. వీరు కన్య లేదా వృషభరాశి వారిని వివాహం చేసుకోకూడదు. మీ వివాహ జీవితం ఆనందంగా ఉండాలంటే, మీరు శనిదేవుడిని ఆరాధించాలి. దీని వల్ల మీ జీవితంలో ఆనంతో పాటు అష్టఐశ్వర్యాలు కలిసి వస్తాయి.

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి అధిపతి అయినందున వీరి వైవాహిక జీవితంలో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే రోజులు గడిచేకొద్దీ సమస్యలు తగ్గి వారి జీవితం సంతోషంగా ఉంటుంది. మరో విచారకరమైన విషయమేమిటంటే.. వీరిద్దరూ ప్రారంభంలో కలిసి ఉండరు. అయితే, వీరిద్దరి మధ్య ఒక రకమైన అవగాహన కారణంగా వీరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వీరు మకర రాశి, కుంభ రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ప్రతి శనివారం వీరు ద్యానం చేస్తే మంచిగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి వివాహ జీవితంలో ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ రాశి వారు కర్కాటకం మరియు వృశ్చిక, మేష రాశి వారిని వివాహం చేసుకోకూడదు. వీరిని వదిలి, ఎవరిని వివాహం చేసుకున్నా.. వీరి మధ్య ప్రేమ బంధం బలంగా ఉంటుంది. వీరి వివాహ జీవితం ఆనందంగా ఉండాలంటే, సోమవారం పరమేశ్వరుడికి పూజలు చేయాలి.

తుల రాశి..
ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. కాబట్టి, వీరి వైవాహిక జీవితం అంత తేలికగా ఉండదు. అయితే, ఈ రాశి వారు ఒంటరిగా, స్వేచ్ఛగా గడిపేందుకు ఇష్టపడతారు. వీరు ధనస్సు రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ‘ఓం దుర్గే నమః' అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు వివాహ జీవితం సాధారణంగా ఉంటుంది. వీరి కళ్యాణ జీవితంలో ఎలాంటి ఘర్షణలు, మనస్పర్దలు అనేవే ఉండవు. అయితే రొమాంటిక్ గా కూడా ఉండదు. వీరు మిథునం లేదా కన్య రాశి వారిని వివాహం చేసుకోకూడదు. వీరి వివాహ జీవితం ఆనందంగా ఉండాలంటే వీరు వజ్రాన్ని ధరించాలి. ఈ కారణంగా వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు.

ధనస్సు రాశి..
ఈ రాశి వివాహ జీవితం అంతా బాగానే ఉంటుంది. అయితే వీరి వివాహ జీవితంలో అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ వీరి మధ్య ప్రేమ కారణంగా అవన్నీ తొలగిపోతాయి. వీరు వృషభ, తుల రాశి వారిని వివాహం చేసుకోకూడదు. వీరు ప్రతిరోజూ తులసి చెట్టు వద్ద దీపారాధన చేయడం వల్ల వీరికి ప్రయోజనం ఉంటుంది. దీని ఫలితంగా వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారి వివాహ జీవితం ఎంతో వెరైటీగా, ప్రత్యేకంగా ఉంటుంది. వీరు పెళ్లి చేసుకున్న వారితో తరచుగా గొడవ పడుతూ ఉంటారు. అయితే ఇదే సమయంలో వీరి మధ్య ప్రేమ కూడా పెరగడం విశేషం. వీరు సింహం, వృశ్చిక, ధనస్సు రాశి వారిని వివాహం చేసుకోకూడదు. వీరు ప్రతిరోజూ శివుడిని ఆరాధించాలి. దీని వల్ల వీరి వివాహ జీవితంలో మనస్పర్దలు, కలహాలు ఉంటే తగ్గిపోతాయి.

కుంభరాశి..
ఈ రాశి వారు వీరి వైవాహిక జీవితంలో ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. కానీ వీరు అర్థం చేసుకోకపోవడం వల్ల వీరి వివాహ జీవితం సంతోషంగా ఉండదు. వీరు కర్కాటక రాశి, సింహ రాశి వారికి దూరంగా ఉండటం మంచిది. వీరి వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే, వీరు సూర్యుడిని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి వారికి వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వీరి జీవిత భాగస్వామి కూడా ఎంతో తెలివైన వారు. వీరు ఎంతో సానుకూలంగా, భాగస్వామి మాటలు వినడమే కాకుండా, ఎంతో వివేకంతో ఆలోచిస్తారు. అయితే, వీరి జీవితంలో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరు వృషభ రాశి, కుంభ రాశి, తుల రాశి వారిని వివాహం చేసుకోకూడదు. వీరి వైవాహిక బంధం సంతోషంగా ఉండాలంటే, వీరు మొక్కలను నాటాలి.



Click it and Unblock the Notifications
