Latest Updates
-
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా?
World Heritage Day 2020 : భారతీయ వారసత్వ సంపద గురించి మనం నమ్మలేని నిజాలు...
ఈ విశ్వంలోని మనషులకు ఇళ్లు, ఆస్తులు, ఇతర వస్తువులు వారసత్వంగా దక్కుతాయి. వీటితో పాటు ఇంటి పేర్లు, వంశపారంపర్యం వంటి చరిత్రలు కూడా లభిస్తాయి.
మన విశ్వంలో ఎన్నో అద్భుత కట్టడాలు, చారిత్రక సంపదలు చాలానే ఉన్నాయి. అయితే అలాంటి వాటిపై ప్రపంచ మానవాళికి అవగాహన కల్పించడం,

వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి (UNO) అనుబంధ సంస్థ యునెస్కో(UNESCO)1983 సంవత్సరం ఏప్రిల్ 18వ ప్రపంచ వారసత్వ దినోత్సవంగా తీర్మానం చేసింది.

అప్పటి నుండి చాలా మంది ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చారిత్రక కట్టడాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

జాతికి దొరికే వారసత్వం..
ఈ విశ్వంలోని మనషులకు ఇళ్లు, ఆస్తులు, ఇతర వస్తువులు వారసత్వంగా దక్కుతాయి. వీటితో పాటు ఇంటి పేర్లు, వంశపారంపర్యం వంటి చరిత్రలు కూడా లభిస్తాయి. అయితే వాటన్నికంటే ముఖ్యమైనది సమాజ వారసత్వం. దీని కన్నా గొప్పది జాతి వారసత్వం. అది ఎల్లప్పుడూ మన కల్చర్ లో ఉంటుంది. అలాంటివన్నీ మన చారిత్రక కట్టడాల్లో ఉంటాయి.

గొప్ప చరిత్ర
అలాంటి కట్టడాలపై ప్రస్తుతం తరం వారికి ఏమైనా శ్రద్ధ ఉందా ప్రశ్నలు వేసుకుంటే, మనం తెల్లమొఖం వేయాల్సిందే.. అయితే మనం అలాంటి చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అవి మన గొప్ప చరిత్రను గుర్తు చేస్తాయి.

తాజ్ మహల్ తో పాటు..
చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించిన యునెస్కో, ప్రపంచంలోని చాలా చారిత్రక కట్టడాలను గుర్తించింది. అందుకు సంబంధించిన జాబితాను కూడా తయారు చేసింది. అలా ఈ విశ్వంలో ఇప్పటివరకు దాదాపు వెయ్యికి పైగా చారిత్రక కట్టడాలు గుర్తింపు పొందాయి. ఇందులో మన దేశం నుండి తాజ్ మహాల్ తో పాటు 37 చారిత్రక కట్టడాలు కూడా అందులో స్థానం సంపాదించాయి.

కల్చర్ గురించి చెప్పే కట్టడాలు..
ఇవి కేవలం చరిత్రకు సంబంధించే కాదు.. ప్రస్తుత కాలంలోనూ మరియు భవిష్యత్తులో రానున్న తరాలకు కూడా చారిత్రక వైభవాన్ని మరియు మన కల్చర్ ను చాటి చెప్పే గొప్ప కట్టడాలు. కాబట్టి వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

కొన్ని శిథిలావస్థకు..
ఇలాంటి చారిత్రక కట్టడాలు వివిధ సందర్భాలకు చిహ్నంగా నిర్మించారు. అయితే మన దేశంలో మానవ అజ్ఞానం కారణంగా హవా మహల్, హుమయూన్ సమాధి మరియు అనేక ఇతర స్మారక చిహ్నాలు నాశనం అవుతున్నాయి. అంతేకాదు వాతావరణ మార్పుల కారణంగా, ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

అజంతా & ఎల్లోరా..
ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన అజంతా మరియు ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరాంగాబాద్ లో ఉన్నాయి. అయితే ఇక్కడికి సందర్శకులు వచ్చి నిత్యం ఏదో ఒక చోట కొంత నష్టం కలిగిస్తుండటంతో ఈ స్థలంలో కొన్ని కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాబట్టి దీనికి తక్షణ రక్షణ అవసరం.

హవా మహాల్
మరో చారిత్రక కట్టడం హవా మహల్. ఇది ఒక బహిరంగ ప్రదేశంలో నిర్మించబడింది. దీని వెనుక ఒక గోడ ఉంది. ఇందులో కూడా కొందరు ఆకతాయిలు కిటికీలను పగులగొట్టారు. దీంతో అది చిందరవందరగా మారిపోయింది. కొందరు సందర్శకులు చేసిన పనికి ఇది డంపింగ్ జోన్ గా మారిపోయింది. దీనిపై కూడా మనం శ్రద్ధ వహించాలి.

సింధు లోయ నాగరికత..
పురావస్తు తవ్వకాల ద్వారా సింధు లోయ నాగరికత మరియు హరప్పన్ సంస్కృతి గురించి తెలిసింది. అలాగే ఎర్రటి రాళ్లతో నిర్మించిన భారీ సమాధిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ దానిపై మంచి శ్రద్ధ అవసరం. అలాగే భీంబెట్కా గుహలు కూడా రాక్ శిల్పాల చరిత్రకు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ శిల్పాలు పురాతన కాలం యొక్క అనేక ముఖ్యమైన విషయాలను వర్ణిస్తాయి.

మహాబోధి ఆలయం
మహాబోధి ఆలయం పాలరాయితో నిర్మించబడింది. ఈ ఆలయంలో నిశ్శబ్దం మరియు పచ్చదనంతో నిండి ఉన్నందున అన్ని మతాల ప్రజలు ఈ ప్రదేశానికి సందర్శించడానికి వస్తూ ఉంటారు. కాబట్టి దీనితో పాటు ముఖ్యమైన చారిత్రక కట్టడాలన్నింటిపై మనం శ్రద్ధ వహించాలి. మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.



Click it and Unblock the Notifications
