Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
ఈ విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని విగ్రహాలను ఉంచడం వల్ల అదృష్టం వస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండటానికి ఎలాంటి విగ్రహాలు ఉంచాలో, వాటిని ఎక్కడెక్కడ ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఉంచుకున్నా అది ఇంట్లో నివసించే కుటుంబసభ్యుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ వస్తువు ఉండే చోటు కూడా విధిని నిర్ణయిస్తుంది. ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ప్రత్యేక చోట మాత్రమే ఉంచాలి. ఎక్కడ పడితే అక్కడ ఉంచితే సమస్యలు వస్తాయి. వాటి వల్ల వాస్తు దోషాలు తలెత్తి ఇంట్లో ప్రతికూల శక్తులు వస్తాయి. దాని వల్ల కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. దంపతుల మధ్య సాన్నిహిత్యం దెబ్బతింటుంది. ప్రశాంతత ఉండదు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని విగ్రహాలను ఉంచడం వల్ల అదృష్టం వస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండటానికి ఎలాంటి విగ్రహాలు ఉంచాలో, వాటిని ఎక్కడెక్కడ ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చేప:
వాస్తు శాస్త్రం ప్రకారం చేప ఆరోగ్యానికి, ఆనందానికి, శ్రేయస్సుకు, సంపదకు చిహ్నంగా పరిగణించబడుతోంది. ఇంటికి ఈశాన్య లేదా తూర్పు దిశలో ఇత్తడితో చేసిన చేప విగ్రహాన్ని లేదా వెండితో చేసిన చేప విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో ఇంట్లో సుఖ సంతోషాలు, సంపదలు పెరుగుతాయి.

తాబేలు:
వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం తాబేలు విగ్రహం శుభం, సానుకూల శక్తిని చిహ్నంగా చూస్తారు. ఇంట్లో తాబేలు ఉంచడం వల్ల సంతోషం, శ్రేయస్సు, దీర్ఘాయువు లభిస్తకాయి. ఇంట్లో ఉత్తర దిశలో లోహపు తాబేలును ఉంచడం వల్ల అదృష్టాన్ని పెంపొందించడంతో పాటు ప్రతి విషయంలోనూ విజయం చేకూరుతుంది.

ఏనుగు:
ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏనుగును ఐశ్వర్య చిహ్నంగా చూస్తారు. ఇంట్లో వెండి లేదా ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది సంపద, శ్రేయస్సును పెంచుతుంది.

చిలుక:
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిలుక విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. అదృష్టం పెరుగుతుంది. స్టడీ రూములో చిలుక విగ్రహాన్ని ఉంచడం వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగులు ఉంటే పని పట్ల, కొత్త నైపుణ్యాల పట్ల ఏకాగ్రత పెడతారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇంట్లో చిలుక విగ్రహం పెట్టుకోవడం సానుకూల ఫలితాన్ని తీసుకువస్తుంది. ఇంట్లో విద్యార్థులు ఉంటే వారికి విజయం లభిస్తుంది.

గుర్రం:
ఇంట్లో గుర్రపు విగ్రహాన్ని ఉంచడం వల్ల అదృష్టం పెరుగుతుంది. ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. పరుగెత్తుతున్న భంగిమలో ఉండే గుర్రాలు విజయానికి చిహ్నంగా భావిస్తారు. పరిగెత్తుతున్న గుర్రాలు శక్తికి, వేగానికి ప్రతీకగా పరిగణిస్తారు. ఇంట్లో గుర్రం విగ్రహాన్ని ఉంచడం వల్ల వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరుస్తుంది.

ఎద్దు:
పోరాడే భంగిమలో ఉండే ఎద్దు విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే అంతా మంచి జరుగుతుంది. ఎద్దు విగ్రహాన్ని ఇంట్లో పెడితే సానుకూల శక్తి ప్రసారం అవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు కూడా ఎద్దు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఎద్దు విగ్రహాన్ని బలం, వేగం, శక్తికి ప్రతీకగా చూస్తారు.



Click it and Unblock the Notifications
