Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
Lunar Eclipse on 26 May 2021: త్వరలో తొలి చంద్ర గ్రహణం.. ఈ 5 రాశుల వారు జర భద్రం...!
తొలి చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్ర గ్రహాణానికి ఎంతో విశిష్టత ఉంది. 2021లో తొలి చంద్ర గ్రహణం ఇదే నెలలో 26వ తేదీ, బుధవారం రోజున ఏర్పడబోతోంది. ఈ చంద్ర గ్రహణం అమెరికా, అస్ట్రేలియా, ఆసియా, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంతో పాటు భారతదేశంలోనూ కనిపించనుంది.

మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ గ్రహాణాన్ని చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే రోజున వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి కావడం విశేషం. దీని ఫలితంగా ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.

జ్యోతిష్యశాస్త్రం అంచనాల ప్రకారం ఈసారి చంద్ర గ్రహణం వృశ్చికరాశిలో జరగనుంది. దీంతో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అయితే ఐదు రాశుల వారికి చంద్ర గ్రహణం వల్ల ప్రతికూల ఫలితాలు కలగనున్నాయి. కాబట్టి ఆ రాశుల వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా ఆ రాశులేవి.. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ ఏడాదిలో జరిగే తొలి చంద్ర గ్రహణం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మేష రాశికి అంగారకుడు అధిపతి కాబట్టి ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో మీకు ఏదైనా హాని కలుగుతుంది. అందువల్ల అవసరమైతే తప్ప మీరు బయటకు రావొద్దు. ఈ సమయంలో భగవంతుడిని స్మరించండి. మీకు ప్రతికూల ప్రభావం తగ్గాలంటే ఈ సమయంలో మీరు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారిపై తొలి చంద్ర గ్రహణం తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. ఈ కారణంగా మీరు, మీ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలు కావొచ్చు. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ గ్రహణం ప్రభావాలను నివారించడానికి మీరు ఈశ్వరుడిని స్మరించాలి. చంద్ర గ్రహణం సమయంలో మీరు పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయా అని జపించాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం ప్రభావాలు తగ్గుతాయి.

సింహ రాశి..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వల్ల చెడు ప్రభావాలు ఎదురుకావొచ్చు. ఈ సమయంలో ఉద్యోగులకు పనిభారం పెరగొచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈ కాలంలో ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. మరోవైపు మీరు ఈ సమయంలో ఎవరితోనూ వాదనలు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సమయంలో మీరు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

తుల రాశి..
తొలి చంద్ర గ్రహణం సమయంలో తులరాశి వారికి దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి శుక్రుడి కంట్రోల్ ఉండటం వల్ల ఈ సమయంలో తుల రాశి వారికి కోపం పెరగొచ్చు. మీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా నియంత్రణ కలిగి ఉండాలి. లేదంటే వివాదాలు మరింత ఎక్కువగా పెరగొచ్చు. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. అంతేకాకుండా లక్ష్మీదేవి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఫలితం ఉంటుంది.

కుంభ రాశి..
తొలి చంద్ర గ్రహణం జరిగే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ బంధాలు కొన్ని చెడిపోవచ్చు. అనుకోకుండా కొన్ని సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. మీరు కొన్ని కారణాల వల్ల ఆందోళన చెందుతారు. మీ తల్లి ఆరోగ్యం కూడా క్షీణించొచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు మీతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎలాంటి అపార్థం లేకుండా వ్యవహరించాలి. మీ భాగస్వామితో రిలేషన్ షిప్ లో చేదు అనుభవం ఉంటుంది. చంద్ర గ్రహణం సమయంలో మీరు మీ మనసులోని శని దేవుడిని తలచుకోవాలి.



Click it and Unblock the Notifications
