Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
Lunar Eclipse on 26 May 2021: తొలి చంద్ర గ్రహణం.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం..
చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశుల వారికి ప్రత్యేక ఫలితాలు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్ర గ్రహాణానికి ఎంతో విశిష్టత ఉంది. 2021లో తొలి చంద్ర గ్రహణం ఇదే నెలలో 26వ తేదీ, బుధవారం రోజున ఏర్పడబోతోంది. ఈ చంద్ర గ్రహణం అమెరికా, అస్ట్రేలియా, ఆసియా, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంతో పాటు భారతదేశంలోనూ కనిపించనుంది.

మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ గ్రహాణాన్ని చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే రోజున వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి కావడం విశేషం. దీని ఫలితంగా ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.

జ్యోతిష్యశాస్త్రం అంచనాల ప్రకారం ఈసారి చంద్ర గ్రహణం వృశ్చికరాశిలో జరగనుంది. దీంతో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అయితే ఐదు రాశుల వారికి చంద్ర గ్రహణం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రాశులేవి.. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

మిధున రాశి..
2021 సంవత్సరంలో తొలి చంద్ర గ్రహణం వల్ల మిధున రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. వైశాఖ పూర్ణిమ నాడు జరుగుతున్న ఈ చంద్ర గ్రహణం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన లాభం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చేపట్టే ఏ పనిలో అయినా విజయం సాధించొచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీపై కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు ఇతరులతో వాదనలు మానుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ద్యానం, యోగా చేయాలి.

సింహ రాశి..
2021లో మే 26వ తేదీన అంటే బుధవారం నాడు జరిగే తొలి చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కుటుంబ సభ్యుల పట్ల ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అయితే ఒత్తిడి మరియు ఆందోళనలు లేకుండా ఉండాలి. ఈ గ్రహణం యొక్క చెడు ప్రభావాలు మీపై పడకుండా ఆ పరమేశ్వరుడిని ఆరాధించాలి.

కన్య రాశి..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం సమయంలో ఆదాయ పరంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఈ కాలంలో పురోగతి ఉంటుంది. మీరు చేపట్టే ఏ పనిలో అయినా విజయం సాధిస్తారు. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలి.

మకర రాశి..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం సమయంలో ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అందరి నుండి ప్రోత్సాహం మరియు మద్దతు లభిస్తుంది. అదే సమయంలో వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు ఆరోగ్య పరంగా ఏవైనా లోపాలుంటే, ఈ సమయంలో అధిగమించే అవకాశం ఉంది.

మీన రాశి..
ఈ రాశి వారికి తొలి చంద్ర గ్రహణం సమయంలో అద్రుష్టం పెరుగుతుంది. మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. ఈ కాలంలో మీరు ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతారు. అయితే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. చంద్ర గ్రహణం యొక్క చెడు ప్రభావాల నివారణకు, ఈ సమయంలో మీరు చంద్రుని మంత్రాన్ని 108 సార్లు జపించాలి.



Click it and Unblock the Notifications
