Mercury Transit in Gemini on 26th May 2021: బుధుడు మిధునంలోకి సంచారం.. ఈ రాశుల వారు జాగ్రత్త...!

2021లో మే 26వ తేదీన బుధుడు మిధున రాశిలోకి ప్రవేశించే సమయంలో ఏ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏ పరిహారం పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలలో బుధ గ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. బుధుడిని గ్రహాలలో రారాజుగా భావిస్తారు. బుధుని అనుగ్రహం ఉంటే, ప్రతి ఒక్కరి తెలివితేటలు, వ్యాపారంతో పాటు మరిన్ని బాగా మెరుగవుతాయని పండితులు చెబుతుంటారు.

Mercury Transit in Gemini on 26th May 2021, Effects on Zodiac signs in Telugu

అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న బుధుడు 2021లో మే 26వ తేదీ ఉదయం 7:59 గంటల నుండి వృషభరాశి నుండి మిధునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక్కడే జూన్ 3 తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. అనంతరం కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు.

Mercury Transit in Gemini on 26th May 2021, Effects on Zodiac signs in Telugu

ప్రస్తుతం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బుధుడి ప్రయాణం వల్ల ద్వాదశ రాశిచక్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడనుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, తొలి, నాలుగు పాదాలకు యజమానిగా బుధుడిని భావిస్తారు. ఈ రాశి నుండి బుధుడు మూడో పాదం గుండా ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబంలో అందరితో సంబంధాలు మెరుపడతాయి. మీరు ధైర్యంగా ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి బుధుడు రెండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా మంచిగా ఉంటుంది. మీరు ఊహించిన ఫలితాలొస్తాయి.

మిధున రాశి..

మిధున రాశి..

బుధుడు వృషభరాశి నుండి మిధునరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు మానసికంగా బలంగా ఉంటారు. ఈ సమయంలో మీ ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. మీరు స్పష్టంగా మాట్లాడే విధానం మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగంలో ఉండే వారికి ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులకు ఊహించిన విధంగా ప్రయోజనాలు ఉంటాయి. బుధుడి సంచారం వల్ల మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం బుధవారం రోజున ఆవుకు గడ్డిని తినిపించాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి బుధుడు పన్నెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఎక్కువ అవ్వొచ్చు. మీరు ధనం నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి బుధుడిని 2, 11 స్థానాలకు యజమానిగా భావిస్తారు. ఈ సమయంలో బుధుడు ఆర్థిక పరంగా లాభం వచ్చే 11 స్థానంలో సంచరించనున్నాడు. ఈ నేపథ్యంలో సింహ రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ వచ్చేస్తాయి. మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమయంలో మీకు ఏవైనా సమస్యలకు పరిష్కారం కావాలంటే.. మీరు ప్రతి బుధవారం రోజున ఇంట్లో కర్పూరం వెలిగించి భగవంతుడిని ఆరాధించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి బుధుడిని ఒకటి, పదో స్థానాలకు అధిపతిగా భావిస్తారు. ఈ సమయంలో కన్య రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అందుతాయి. ఈ రవాణా సమయంలో మీ అభిరుచులకు సంబంధించిన కార్యాలను చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు. మీ తండ్రితో మీ సంబంధం మెరుగుపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కాలంలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు విజయవంతంగా ఉంటుంది. జర్నలిస్టులు, రచయితలు, సాఫ్ట్ వేర్ డెవలపర్లకు ఈ సమయంలో సానుకూల ఫలితాలొస్తాయి. ఈ సమయంలో ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా డబ్బును ఆదా చేయగలుగుతారు. కెరీర్ పరంగా ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి బుధుడు 9వ స్థానం నుండి సంచరించనున్నాడు. బుధుడి సంచారం వల్ల తుల రాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి. అంతేకాదు మీ వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించే వారికి ఈ సమయంలో విజయం లభిస్తుంది. భాగస్వామితో మీ వైవాహిక బంధం మరింత బలపడుతుంది. ఉద్యోగులు ఊహించిన ఫలితాలను పొందుతారు. అయితే ఆరోగ్య పరంగా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు మంచి ఆదాయం లభిస్తుంది. మీకు ఏవైనా సమస్యలుంటే.. ఈ కాలంలో గోపాలక్రిష్ణుడిని ఆరాధించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయితే మీరు వాటిని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు కొంత ధనం కూడా నష్టపోవచ్చు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందడం ద్వారా మిమ్మల్ని మీరు అద్రుష్టవంతులుగా భావిస్తారు. మీ వ్యాపారంలో లాభం ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఆరో పాదంలో సంచరించనున్నాడు. ఈ సమయంలో పని ప్రదేశంలో ఉండే వారు కొన్ని సంఘర్షణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు మీరు కోర్టు కేసుల తీర్పు గురించి ఎదురుచూస్తుంటే.. మీరు విజయవంతమవుతారు. మీరు ఉద్యోగ పరంగా కూడా విజయం సాధించగలరు. ఆస్తి విషయంలో మీరు పెట్టుబడులు పెడితే విజయం లభిస్తుంది.. మీరు ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం మరియు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకు వారికి ఈ కాలంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఇందుకోసం మీరు ప్రతిరోజూ ఆవుకు ఏదైనా ఆహారం తినిపించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఐదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబ పరంగా మంచిగా ఉంటుంది. మరోవైపు మీరు శత్రువులపై ఆధిపత్యం కూడా చెలాయించొచ్చు. ఇంకోవైపు విద్యార్థులు ఉన్నత విద్య గురించి కొంత ఆందోళన చెందుతారు. మీ ప్రేమ వ్యవహారాలలో మాత్రం విజయం లభిస్తుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి బుధుడు నాలుగో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా మీకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. మీరు సోమరితనం విస్మరించాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆస్తికి సంబంధించి ప్రయోజనాలు పొందుతారు. మీ దాంపత్య జీవితంలో మీకు ఘన విజయం లభిస్తుంది. ఉద్యోగులు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీకు అంతా మంచి జరగాలంటే.. మీరు తులసి దేవిని ఆరాధించాలి.

Story first published: Saturday, May 22, 2021, 19:47 [IST]
Desktop Bottom Promotion