Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
Mercury Transit in Gemini on 26th May 2021:బుధుడు మిధునంలోకి ఎంట్రీ.. ఈ రాశులకు శుభ ఫలితాలు...!
బుధుడు మిధునంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలలో బుధ గ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. బుధుడిని గ్రహాలలో రారాజుగా భావిస్తారు. బుధుని అనుగ్రహం ఉంటే, ప్రతి ఒక్కరి తెలివితేటలు, వ్యాపారంతో పాటు మరిన్ని బాగా మెరుగవుతాయని పండితులు చెబుతుంటారు.

అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న బుధుడు 2021లో మే 26వ తేదీ ఉదయం 7:59 గంటల నుండి వృషభరాశి నుండి మిధునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక్కడే జూన్ 3 తేదీ వరకు నివాసం ఉండనున్నాడు.

అనంతరం కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ప్రస్తుతం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బుధుడి ప్రయాణం వల్ల ద్వాదశ రాశిచక్రాలలోని కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

మిధున రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, తొలి, నాలుగో పాదాలకు యజమానిగా బుధుడిని భావిస్తారు. ఈ బుధుడు వృషభరాశి నుండి మిధునరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు మానసికంగా బలంగా ఉంటారు. ఈ సమయంలో మీ ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. మీరు స్పష్టంగా మాట్లాడే విధానం మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగంలో ఉండే వారికి ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులకు ఊహించిన విధంగా ప్రయోజనాలు ఉంటాయి. బుధుడి సంచారం వల్ల మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం బుధవారం రోజున ఆవుకు గడ్డిని తినిపించాలి.

సింహ రాశి..
ఈ రాశి నుండి బుధుడిని 2, 11 స్థానాలకు యజమానిగా భావిస్తారు. ఈ సమయంలో బుధుడు ఆర్థిక పరంగా లాభం వచ్చే 11 స్థానంలో సంచరించనున్నాడు. ఈ నేపథ్యంలో సింహ రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ వచ్చేస్తాయి. మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమయంలో మీకు ఏవైనా సమస్యలకు పరిష్కారం కావాలంటే.. మీరు ప్రతి బుధవారం రోజున ఇంట్లో కర్పూరం వెలిగించి భగవంతుడిని ఆరాధించాలి.

కన్య రాశి..
ఈ రాశి నుండి బుధుడిని ఒకటి, పదో స్థానాలకు అధిపతిగా భావిస్తారు. ఈ సమయంలో కన్య రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అందుతాయి. ఈ రవాణా సమయంలో మీ అభిరుచులకు సంబంధించిన కార్యాలను చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు. మీ తండ్రితో మీ సంబంధం మెరుగుపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కాలంలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు విజయవంతంగా ఉంటుంది. జర్నలిస్టులు, రచయితలు, సాఫ్ట్ వేర్ డెవలపర్లకు ఈ సమయంలో సానుకూల ఫలితాలొస్తాయి. ఈ సమయంలో ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా డబ్బును ఆదా చేయగలుగుతారు. కెరీర్ పరంగా ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు.

తుల రాశి..
ఈ రాశి నుండి బుధుడు 9వ స్థానం నుండి సంచరించనున్నాడు. బుధుడి సంచారం వల్ల తుల రాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి. అంతేకాదు మీ వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించే వారికి ఈ సమయంలో విజయం లభిస్తుంది. భాగస్వామితో మీ వైవాహిక బంధం మరింత బలపడుతుంది. ఉద్యోగులు ఊహించిన ఫలితాలను పొందుతారు. అయితే ఆరోగ్య పరంగా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు మంచి ఆదాయం లభిస్తుంది. మీకు ఏవైనా సమస్యలుంటే.. ఈ కాలంలో గోపాలక్రిష్ణుడిని ఆరాధించాలి.

మకర రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఆరో పాదంలో సంచరించనున్నాడు. ఈ సమయంలో పని ప్రదేశంలో ఉండే వారు కొన్ని సంఘర్షణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు మీరు కోర్టు కేసుల తీర్పు గురించి ఎదురుచూస్తుంటే.. మీరు విజయవంతమవుతారు. మీరు ఉద్యోగ పరంగా కూడా విజయం సాధించగలరు. ఆస్తి విషయంలో మీరు పెట్టుబడులు పెడితే విజయం లభిస్తుంది.. మీరు ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం మరియు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకు వారికి ఈ కాలంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఇందుకోసం మీరు ప్రతిరోజూ ఆవుకు ఏదైనా ఆహారం తినిపించాలి.

మీన రాశి..
ఈ రాశి నుండి బుధుడు నాలుగో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా మీకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. మీరు సోమరితనం విస్మరించాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆస్తికి సంబంధించి ప్రయోజనాలు పొందుతారు. మీ దాంపత్య జీవితంలో మీకు ఘన విజయం లభిస్తుంది. ఉద్యోగులు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీకు అంతా మంచి జరగాలంటే.. మీరు తులసి దేవిని ఆరాధించాలి.



Click it and Unblock the Notifications
