Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Mercury Transit in Virgo on 26 August 2021:బుధుడు కన్యరాశిలోకి సంచారం.. ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనం..!
2021 సంవత్సరంలో ఆగస్టు 26వ తేదీన బుధుడు కన్యరాశిలోకి ఆగమనం చెందనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో బుధుడిని రారాజుగా భావిస్తారు. ఎవరి జాతకంలో అయినా బుధుడి అనుగ్రహం ఉంటే.. వారికి మేధస్సు, తెలివితేటలు, సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

అలాంటి బుధుడు ఆగస్టు 26వ తేదీన అంటే గురువారం ఉదయం 11:18 గంటలకు తన స్థానాన్ని మారనున్నాడు. సింహ రాశిలో నుంచి కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు సంచారం చేయనున్నాడు.

సెప్టెంబర్ 22 తర్వాత కన్యరాశి నుండి తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అయితే బుధుడి పరివర్తనం వల్ల నాలుగు రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయట. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.

సింహ రాశి..
సూర్యుడు అధిపతిగా ఈ రాశికి బుధుడి రవాణా వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుండి బుధుడు రెండో పాదం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ఆదాయ పరంగా అద్భుతమైన అవకాశాలు రానున్నాయి. ఉద్యోగులకు తాము కోరుకున్న చోట బదిలీ అవుతుంది లేదా మీకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మరోవైపు వ్యాపారులకు కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగ అద్భుతమైన లాభాలను పొందొచ్చు.

కన్య రాశి..
ఇదే రాశిలోకి బుధుడు రేపు అంటే గురువారం 26వ తేదీన ఉదయం 11:18 గంటలకు సింహ రాశి నుండి కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పూర్తి పనిని శ్రద్ధతో మరియు నిజాయితీతో ప్రయత్నం చేస్తే, మీరు అందులో కచ్చితంగా విజయం సాధిస్తారు. వ్యాపారులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు, విద్యారంగంలో పని చేస్తున్న వారికి కూడా ఈ కాలంలో మంచి ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు ఆశించిన పదోన్నతిని పొందొచ్చు. మొత్తం మీద మీరు ఈ కాలంలో ఏ పని చేసినా శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి..
ఈ రాశి నుండి బుధుడు పన్నెండో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో అంతర్జాతీయ సంస్థల్లో పని చేసే వారికి లేదా విదేశాలతో సంబంధం ఉన్న వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్న వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. మీరు చేసే పని ప్రదేశంలో అందరి ప్రశంసలు పొందుతారు. ఈ సమయంలో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సులభంగా విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీకు సానుకూలంగా ఉంటుంది కాబట్టి.. దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి బుధుడు పదకొండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీకు సన్నిహితుల నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు వ్యాపారులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు అనేక వనరుల నుండి ఆదాయం సమకూరుతుంది. మీరు దేనిలో పెట్టుబడి పెట్టినా కూడా అందులో మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు ప్రజలలో భిన్నమైన గుర్తింపును పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications
