Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Miss India 2020 winner: అందంలో మన తెలుగమ్మాయిదే అగ్రస్థానం.. అరుదైన కిరీటాన్ని గెలుచుకున్న మానస
మిస్ ఇండియా 2020 వినర్నర్ మన తెలుగమ్మాయి నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది..
ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల పోటీల్లో మన తెలుగమ్మాయి అరుదైన ఘనత సాధించింది. బుధవారం రాత్రి ముంబై నగరంలో జరిగిన వీఎల్ సి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో తెలంగాణకు చెందిన మానస వారణాసి అగ్రస్థానంలో నిలిచింది.

విజేతగా నిలిచిన 23 ఏళ్ల మానస మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. హర్యానాకు చెందిన మౌనిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా, ఉత్తరప్రదేశ్ కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్ గా నిలిచారు.

ఈ ఫ్యాషన్ షోలో జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ తారలు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పులకిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి ఉన్నారు.
వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. అసలు ఈ మానస వారణాసి ఎవరు? తను హైదరాబాదులోనే పుట్టిందా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హైదరాబాదులో జననం..
ఫెమినా మిస్ ఇండియా 2020లో విజేతగా నిలిచి కిరీటాన్ని గెలుచుకున్న మానస వారణాసి హైదరాబాదులోనే పుట్టింది. తన వయసు ప్రస్తుతం కేవలం 23 సంవత్సరాలే.

మానస విద్య..
హైదరాబాదులో పుట్టిన మానస ఇక్కడే ప్రాథమిక మరియు ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ ఛేంజ్ అనలిస్టుగా పని చేస్తోంది.

మానసకు ఇష్టమైనవి..
మానస వారణాసికి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం.. యోగా చేయడం వంటివి చాలా ఇష్టమట. తను చిన్ననాటి నుండి చాలా సైలెంట్ గా ఉండేదట. తనకు భరత నాట్యం, సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యత ఉందట.

మరో పోటీలో..
ఫెమినా మిస్ ఇండియా 2020 వరల్డ్ లో విజేతగా నిలిచిన మానస వారణాసి ఇదే ఏడాది అంటే డిసెంబర్ 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం తరపున పాల్గొననుంది.

ఫిబ్రవరి 28న..
ఫిబ్రవరి 28వ తేదీన కలర్స్ ఛానెల్ లో ఈ ఫ్యాషన్ షో టెలికాస్ట్ కానుంది. ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీల్లో సినిమాల కంటే ఫ్యాషన్లదే ఎక్కువ హవా అన్నట్లు అనిపిస్తుందట. ఇక్కడ చాలా మంది అందాల భామలు తమ అద్భుతమైన ఫ్యాషన్లతో ర్యాంప్ పై వాక్ చేస్తూ మనల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. కాబట్టి ఈ షోను మిస్సవ్వకుండా చూసెయ్యండి మరి.

హోస్టులుగా..
ఫెమినా మిస్ ఇండియా 2020 జ్యూరీ ప్యానెల్ లో నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్ మరియు ప్రఖ్యాత డిజైనర్ ఫల్గుణి, షేన్ పీకాక్ ఉండగా.. మిస్ ఇండియా 2021 పోటీలకు వాణీ కపూర్, ఖుర్రానా తమ ప్రదర్శనతో గ్రాండ్ నైట్ హోస్టులుగా వ్యవహరించారు.
All Images Credited to : Twitter



Click it and Unblock the Notifications
