Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
Zodiac Signs:ఈ నెలలో ఆరు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారు జరభద్రం.. ఎందుకంటే మీకు వ్యతిరేక ఫలితాలు...!
గ్రహాల స్థాన చలనం వల్ల ఈ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెలలో అంటే ఫిబ్రవరి 2021లో ఆరు గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. ఈ గ్రహాల రవాణాలో ముందుగా గ్రహాలలో యువరాజుగా పరిగణించబడే బుధుడు సంచారంతో గ్రహాల మార్పు మొదలవుతుంది. బుధుడు ఫిబ్రవరి మాసంలో 4వ తేదీన తన దిశను మార్చుకోనున్నాడు.

ఫిబ్రవరి 9న శనిగ్రహం మకరంలోకి ఆగమనం చేయనున్నాడు. ఈ గ్రహాలతో పాటు సూర్యుడు ఫిబ్రవరి 12వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరో రెండు రోజుల తర్వాత అంటే 14వ తేదీ గురుడు మకర రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. మరో వారం రోజులకు అంటే, ఫిబ్రవరి 21వ తేదీన బుధుడు తిరోగమనం చెంది మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 22వ తేదీన అంగారకుడు వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇలా ఆరు గ్రహాలు తమ స్థానాల నుండి మరో స్థానానికి రవాణా చేయనున్నందున ద్వాదశ రాశిచక్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ద్వాదశ రాశుల వారిలో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయి.. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృశ్చిక రాశి..
ఫిబ్రవరి నెలలో ఆరు గ్రహాల మార్పు వల్ల ఈ రాశి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల ప్రవర్తనతో మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీ ఇద్దరి మధ్య తేడాలను కలిగిస్తుంది. కాబట్టి ప్రతి సమయంలో చాలా ఓపికగా వ్యవహరించాలి. అలాగే మీ ప్రేమ విషయంలో కూడా మీకు ప్రతికూలమైన ఫలితమే ఎదురవుతుంది. మీరు అనవసరంగా వివాదాలు, వాదనలకు దిగకూడదని మాత్రం గుర్తుంచుకోండి. అలాగే అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

ధనస్సు రాశి..
ఈ నెలలో ఆరు గ్రహాలు తమ స్థానాలను మారడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల మీ మనసులో ఆందోళన పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ సమయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు దేనిలో అయినా పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు కష్టంగా ఉంటుంది. అలాగే మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ పనిని నిజాయితీగా చేస్తేనే, మీకు సరైన ఫలితం వస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో నిరాశే ఎదురవుతుంది. మరోవైపు కుటుంబ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వారి ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి..
ఈ రాశి వారికి గ్రహాల మార్పు వల్ల మిశ్రమ పలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వాహనాల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉంటాయి. మీ ప్రవర్తన, మాటలపై శ్రద్ధ వహించాలి. మీ రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఫేక్ కంపెనీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితిని బలంగా ఉంచేందుకు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే మీరు రుణాలు తీసుకునే పరిస్థితి రావచ్చు.

కర్కాటక రాశి..
ఫిబ్రవరి నెలలో ఆరు గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటలు, ప్రవర్తనను నియంత్రించాలి. విద్యార్థులు తమ పరీక్షల్లో మంచి మార్కులు పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుది. ఆరోగ్యంగా ఉండేందుకు మీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీరు చేసే పనులలో నిజాయితీగా ఉండాలి. ముఖ్యంగా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసేందుకు ఈ సమయం అనుకూలంగా ఉండదు.

తుల రాశి..
ఈ నెలలో ఆరు గ్రహాలు తమ దిశను మార్చుకోవడం వల్ల ఈ రాశి వారు చాలా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. మీరు ఏదైనా పనిని పూర్తి చేయడంలో విఫలమైతే మీ కోపం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ఆఫీసులో పోటీ పడి పని చేయాలి. మరోవైపు మీరు ఏదైనా పెట్టుబడికి సంబంధించిన ప్రతి నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేదంటే మీ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతాయి.

వృషభ రాశి..
ఫిబ్రవరి మాసంలో ఆరు గ్రహాల స్థాన చలనం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు చేసే పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు కుటుంబ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ సమయంలో మీరు ఎవ్వరికీ రుణాలు ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications