Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
Raksha Bandhan 2021: రాఖీ పండుగ రోజున ఈ 3 రాశులకు శుభయోగం...
రాఖీ పండుగ రోజున ఈ 3 రాశులకు శుభయోగం కలగనుంది.
మరికొద్ది గంటల్లో రక్షా బంధన్ పండుగ రాబోతోంది. అన్నాచెల్లెళ్లు.. అక్కా తమ్ముడి మధ్య ఉన్న ప్రేమను చాటి చెప్పే పవిత్రమైన పండుగ రాఖీ పౌర్ణమి. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ.. తన రక్షణ, సంరక్షణను ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క సోదరీమణి తమన సోదరులకు రాఖీ కట్టడం మనం చూస్తు ఉంటాం.

అంతేకాదు సోదరుడుకి కట్టే రాఖీ వల్ల తను ఆరోగ్యంగా ఉండాలని.. తాను చేపట్టినా ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాం. ఇదిలా ఉండగా.. హిందూ పంచాంగం ప్రకారం.. ఆగస్టు 22వ తేదీన రక్షా బంధన్ పండుగ సమయంలో ఒక యోగం ఏర్పడుతుంది.

కాబట్టి ఈ ఏడాది సోదరులకు సోదరీమణులు రక్షా బంధన్ రోజున ఏ సమయంలో అయినా రాఖీ కట్టొచ్చు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్రుడు రక్షాబంధన్ సమయంలో కుంభరాశిలో ఉంటాడు.

గురుడు కూడా ఇప్పటికే అదే రాశిలో నివాసం ఉంటున్నాడు. ఈ రెండింటి కలయిక వల్ల గజ కేసరి యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలొస్తాయట. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. రక్షా బంధన్ రోజున గురుడితో కలసి గజ కేసరి యోగం చేయనున్న సందర్భంగా ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీ ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. మీకు ప్రతి ఒక్కరి సహకారం లభిస్తుంది. మీ జీవితంలో ఆనందం కూడా లభిస్తుంది.

ధనస్సు రాశి..
గజ కేసరి యోగం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బలమైన అవకాశాలు కలిగే అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీ పనిలో విజయం కూడా దక్కుతుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులకు ఈ కాలంలో లావాదేవీలు చేయాలనుకుంటే.. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి వారు ఇప్పటికే ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే.. మీరు మీ జీవితానికి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. మీ కోరికలు లేదా కలలు నిజమవుతాయి. ఆర్థిక పరంగా ఈ కాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేపట్టే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీకు సమాజంలో, ఇంటా, బయట ప్రశంసలు లభిస్తాయి. మొత్తానికి మీకు కూడా గజ కేసరి యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
