Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
రోహిణి కార్తెలో రోకళ్లను పగులగొట్టే ఎండలతో పాటు.. భారీ వర్షాలు కురుస్తాయా?
రోహిణి కార్తె అంటే అందరికీ తెలుసు కదా.. రోకళ్లు సైతం పగిలిపోయే కాలం ఇది. ఎండా కాలంలో నాలుగు నెలలు ఒక ఎత్తు అయితే.. చివరి రెండు వారాలలో అదీ రోహిణి కార్తె సమయంలో వచ్చే ఎండ వేడిమి మరో ఎత్తు.

రోహిణి కార్తె సమయంలో పక్షం రోజులలో అధిక వేడి గాలులు, ఎండ తీవ్రత, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి. అయితే రోహిణి కార్తెలో ఎండలు ప్రచండంగా ఉండే అవకాశం ఉంది.

అయితే ఒక్కోసారి మాత్రం రుతుపవనాలతో సంబంధం లేకుండా భారీ వర్షాలు కురుస్తాయి. దాని ఫలితమే ఇటీవల కరువు ప్రాంతమైన రాయలసీమలో అకస్మాత్తుగా కుండపోత వర్షం కురవడం. సాధారణంగా రోహిణి కార్తె సమయంలో ఎండలు మాత్రమే ప్రభావం చూపుతాయని అందరికీ తెలుసు. అయితే వరుణుడు కూడా ఇదే కాలంలో తన ప్రతాపాన్ని చూపే అవకాశముందని అతికొద్ది మందికే తెలుసు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

రోహిణి కార్తె అంటే ఏమిటి?
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 27 నక్షత్రంగా ఆధారంగా పంచాంగాలు, జాతకాలు, క్యాలెండర్లు తయారు చేస్తారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రునికి దగ్గరగా ఉంటే ఆరోజుకు ఆ నక్షత్రం పేరు పెడతారు. అయితే తెలుగు వారు మాత్రం ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుస్తారు. అయితే మనం చంద్రుని ప్రకారం కాకుండా, సూర్యమానం ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు.

కాల పరిమితి..
ఈ కాలానికి 13 నుండి 14 రోజుల పరిమితి ఉంటుంది. అంటే దాదాపు రెండు వారాలన్న మాట. ఈ సూర్యమానాన్నే తమిళులు కూడా ఆచరిస్తారు. అయితే వారు మాసాలుగా చూస్తారు. ఇలా మొత్తం 27 కార్తెలు ఉంటాయి. వీటిని అనుగుణంగా తెలుగు వారు తమ అనుభవాల సారం నుండి సంపాదించుకున్న విజ్ణానమే ఈ కార్తెలు.

కార్తెలను ఆధారంగా..
కార్తెలను ఆధారంగా వ్యవసాయం కూడా చేస్తారు తెలుగు వారు. ఉదాహరణకు అశ్వని కార్తె వస్తే అడుగు కూడా తడవదు అని, భరణి ఎండకు బండలు బద్ధలవుతాయని, మ్రుగశిర వస్తే ముసలి ఎద్దు కూడా రంకెలిస్తుందని, ఆరుద్ర వాన అంటే ఆదాయాల భాన అని, రోహిణి ఎండలకు రోళ్లు పగులుతాయని పండితులు చెబుతున్నారు.

కరోనా కంటే డేంజర్..
శార్వరి నామ సంవత్సరంలో రోహిణి కార్తె మే 25వ తేదీ వరకు వచ్చింది. ఇది వచ్చే జూన్ 8వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కరోనా కంటే డేంజర్. వడదెబ్బ తగిలకుండా అప్రమత్తంగా ఉండాలి.

ఆరోగ్యంపై శ్రద్ధ..
ఈ రోహిణి కార్తె సమయంలో భానుడి దెబ్బకు మనం బయటికెళితే మన శరీరం వెంటనే డీహైడ్రేషన్ కు గురవుతుంది. కావున ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మట్టికుండలో నీళ్లను తాగాలి. మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావా, వంటి వాటిని తరచుగా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. దీంతో మీకు మంచి ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే మసాలాకు సంబంధించిన ఆహార పదార్థాలు వేపుళ్లు, పచ్చళ్లు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవద్దు.

రెండు పూటల స్నానం..
ఈ ఎండా కాలంలో నీళ్ల ఇబ్బంది కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే మీకు నీటి సౌకర్యం బాగా ఉంటే, మీరు తప్పకుండా రెండు పూటల స్నానం చేయాలి. అన్ని వయసుల వారు కాటన్ దుస్తులనే ధరించాలి. ఇవి చాలా కంఫర్ట్ గా ఉంటాయి. అందులోనూ వైట్ కలర్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి మంచి ఉపశమనం లభిస్తుంది.

మూగ జీవాలకు నీళ్లు..
అలాగే ఈ ఎండాకాలంలో మూగ జీవాలైన పశు, పక్ష్యాదులకు కూడా మీరు నివసించే చోట నీళ్లను అందుబాటులో ఉంచండి. ఇంకా ఎవరైనా నీళ్లు అడిగితే మంచి మట్టి కుండ నీళ్లను ఇవ్వండి. దీని వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.

భారీ వర్షాలు..
రోహిణి కార్తెలో ఎండలు ఎంత ఎక్కువగా ఉంటాయో.. అదే స్థాయిలో అకస్మాత్తుగా భారీ వర్షాలు కూడా కురుస్తాయి. ఒక్కోసారి రుతుపవనాలతో సంబంధం లేకుండా అకాల వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా కుండపోత వర్షాలు కూడా కురిశాయి.



Click it and Unblock the Notifications
