Latest Updates
-
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు బాగా నిద్రిస్తారని తెలుసా...!
మీ రాశిని బట్టి మీకు నిద్రకు సంబంధించి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి ఆహారం, నిద్ర, శృంగారం అనేది అత్యంత ముఖ్యమైనవి. వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా మనిషి అస్సలు తట్టుకోలేడు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మీ రాశిని బట్టి మీరు ఏ రకమైన వ్యక్తి.. ముఖ్యంగా మీరు నిద్రపోయే విధానాన్ని బట్టి మీరు అనుసరించే విధానాలను తెలుసుకోవచ్చు.

ఇది చాలా చిన్న విషయంగా అనిపించినప్పటికీ.. ఇది మీ జీవనశైలి మెరుగుదలలో నిద్రకు సంబంధించిన అలవాట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు నిద్రపోయే విధానం, మీరు ఎంత బాగా నిద్రపోతున్నారు మరియు మీ నిద్ర వేళల వ్యవధి గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. కొంతమంది ఎక్కువ సమయం నిద్రపోతుంటారు.. మరికొందరు తలగడ లేకపోతే నిద్రలేని రాత్రులు గడపొచ్చు.

ఇంకొందరు తలగడ లేకుండానే హాయిగా నిద్రపోవచ్చు. ఇంకా కొంతమందికి ఎక్కువ పీడకలలు రావచ్చు. ఈ సందర్భంగా ఏ రాశి వారు ఎలా నిద్రిస్తారు.. వారు ఎలాంటి నిద్ర అలవాట్లను కలిగి ఉంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు ప్రశాంతమైన నిద్రను కలిగి ఉండటం ఎల్లప్పుడూ కష్టంగా భావిస్తారు. వీరు నిద్రపోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది అత్యంత సహజం. ఈ రాశి వారి మనస్సులోని అన్ని ఉత్తేజకరమైన ఆలోచనలు మరియు ఏదో ఒక విధంగా నిద్రపోయే ఆలోచనతో అణచివేయబడాలని అనుకోరు.

వృషభ రాశి..
ఈ రాశి వారు ప్రశాంతంగా నిద్ర పోయేందుకు ప్రయత్నిస్తారు. అయితే వీరు చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు హాయిగా నిద్రించడం అసాధ్యం. అయితే వీరు ప్రశాంతంగా ఉంటే.. ఎలాంటి ఆటంకం ఎదురైనా హాయిగా నిద్రిస్తారు.

మిధున రాశి..
ఈ రాశి వారు తమ చుట్టుపక్కల మరియు ప్రపంచంలో ఏమి జరుగుతున్నా.. ప్రతి చిన్న విషయం గురించి తెలుసుకోవాలనుకుంటారు. వీరు ఏదైనా సమాచారం తెలుసుకోలేకపోతే ఏదో కోల్పోయినట్టు భావిస్తే.. వీరు నిద్ర పోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు అనవసరమైన ఒత్తిడి మరియు ఉద్రిక్తతను నివారించడం చాలా ముఖ్యం.

కర్కాటక రాశి..
ఈ రాశి వారి నిద్రపోయే అలవాట్ల విషయానికొస్తే.. వీరు కొన్ని ఆరోగ్యకరమైన పరిసరాలను ప్రేమిస్తారు. వీరు కొన్నిసార్లు నిద్రపోకూడదని ఎంచుకునే స్వభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి వారు అతిగా ఆలోచించడం మరియు మీరు చేసే ప్రతి పనిలో గొప్పగా ఉండాల్సిన అవసరం ఉందనుకుని.. వీరి మనశ్శాంతికి విఘాతం కలిగించుకుంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారు ఎక్కువ సమయం నిద్రపోయే అవకాశం ఉంది. వీరు తేలికపాటి స్లీపర్లు, చిన్న శబ్దం అయినా నిద్రకు భంగం కలిగిందని బాధపడతారు. మరోవైపు వీరి నిద్రకు ఆటంకం కలిగితే వీరు చాలా కోపం ప్రదర్శించే అవకాశం ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు నిద్రపోయే ముందు వారి ప్రాధాన్యతలను సూటిగా అమర్చడానికి ఇష్టపడతారు. నిద్రకు ముందే రేపటి రోజు చేయాల్సిన అన్ని పనుల జాబితాను సిద్ధం చేస్తారు. అందువల్ల వీరు వెంటనే నిద్రపోలేరు. వీరి మనసులో ప్రతిదీ తనిఖీ చేస్తారు మరియు వీరు ప్రతిదీ కచ్చితంగా చేశారని నిర్ధారించుకున్నాకే నిద్రపోతారు.

తుల రాశి..
ఈ రాశి వారికి మంచి వాతావరణం ఉంటే హాయిగా నిద్రపోతారు. వీరు ఆరోగ్యకరమైన నిద్ర పరిశుభ్రతను పాటించాలని భావిస్తారు. వీరి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే అలవాట్లను అనుసరిస్తారని నిర్ధారించుకుంటారు. రేపటి రోజును కొత్తగా ప్రారంభించాలనుకుంటే.. వీరు ఉదయాన్నే నిద్రపోవటం అనేది చాలా ముఖ్యమని భావిస్తారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు నిద్రలోకి జారుకున్న వెంటనే ఎక్కువ కలలను కంటారు. అంతేకాదు ఆ కలలను సాకారం చేసుకునేందుకు గల మార్గాలను ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఉదయాన్నే మరియు ప్రశాంతంగా నిద్రపోవడం వీరికి అసాధ్యంగా అనిపిస్తుంది. వీరికి నిద్రపోవడం అనేది సోమరితనంగా అనిపిస్తుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు నిద్రపోయే సమయంలో ఫోన్లను పక్కన పెట్టేస్తారు. లేదంటే వీరు ఎల్లప్పుడూ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండిపోతారు. వీరి జీవనశైలిలో ఎక్కువగా కొత్త విషయాలను చూడాలనుకుంటారు. కాబట్టి వీరు వర్చువల్ టూర్ అయినా.. వివిధ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో స్క్రోలింగ్ చేస్తూ.. నిద్ర సమయాన్ని వేస్ట్ చేస్తుంటారు.

మకర రాశి..
ఈ రాశి వారు వర్క్ హాలిక్ పర్సన్స్. వీరి ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది గడువులోగా పూర్తి కాకపోతే నిద్రను త్యాగం చేస్తారు. నిద్ర విషయంలో రాజీ పడిపోతారు. అయితే తర్వాత దాని గురించి పశ్చాత్తాప పడతారు. ఎక్కువగా అనుభూతి చెందరు. దీంతో వీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా నిద్రలేమి సమస్యలకు గురవుతారు. వీరు స్రుజనాత్మక మనస్సు కలవారు. వీరి ఆలోచనలు మరియు ఊహాల కారణంగా ఎక్కువ గందరగోళంలో ఉంటారు. దీంతో వీరు నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ ప్రక్రియలో వీరికి చాలా ఆందోళన కూడా పెరుగుతుంది.

మీన రాశి..
ఈ రాశి వారు తరచుగా, నిద్ర విషయంలో సమస్యలను ఎదుర్కొంటారు. వీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో.. అప్పుడు వీరు తొందరపాటు మరియు ఒత్తిడి పెంచుకునేలా ఆలోచిస్తారు. దీని వల్ల వీరి మనశ్శాంతికి ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల వీరు నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల మీరు ఇతరుల మానసిక సమస్యల నుండి మిమ్మల్ని డైవర్ట్ చేయడం మరియు వేరు చేయడం అనేది చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications











