Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
స్టడీ : స్మార్ట్ ఫోన్ వల్ల పేదరికం తగ్గుదల... మహిళల్లో సాధికారత పెరుగుతుంది...!
స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆయా దేశాలలో మహిళా సాధికారత సాధ్యమవుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో కనీసం ముగ్గురు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దీంతో ప్రపంచమంతా స్మార్ట్ గా మారిపోతోంది.

ఏదైనా తినాలన్నా... ఏదైనా కొనాలన్నా.. ఏదైనా కావాలన్నా ప్రతిదానికీ స్మార్ట్ ఫోన్.. అందులో వాటికి సంబంధించిన యాప్ ఉంటే చాలు ప్రపంచం మన అరచేతిలో వచ్చి వాలిపోతుంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, మెక్ గిల్ విశ్వవిద్యాలయం మరియు బోకోని విశ్వవిద్యాలయం పరిశోధకులు స్మార్ట్ ఫోన్ల గురించి అధ్యయనం చేశారు.

అందులోనూ అవి మహిళల చేతుల్లో ఉంటే ఎంత శక్తివంతమైన సాధనంగా పని చేస్తుందో.. అవి దేశాలలో స్థిరమైన అభివృద్ధికి, వారి లక్ష్యాలకు, మహిళా సాధికారతకు చాలా సహాయపడుతుందని నిర్ధారించారు.

మొబైల్ ఫోన్ల ప్రాముఖ్యత...
1993-2007 మధ్య 209 దేశాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీలో ప్రచురించిన అధ్యయనంలో గుడ్ హెల్త్, లింగ సమానత్వం, పేదరికం తగ్గింపు వంటి ప్రపంచ సామాజిక అభివృద్ధికి మొబైల్ ఫోన్లకు ప్రాముఖ్యత ఉన్నట్లు తేలింది.

మహిళలు శక్తివంతంగా..
మొబైల్ ఫోన్లు మహిళలను ఎలా శక్తివంతం చేస్తాయో కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. దీనిపై రచయితలు అంగోలా, బురుండి, ఇథియోపియా, మాలావి, టాంజానియా, ఉగాండా మరియు జింబాబ్వేలకు చెందిన 100,000 మంది మహిళలపై వ్యక్తిగత స్థాయి విశ్లేషణలు నిర్వహించారు.

మొబైల్ ఫోన్ల వల్ల..
ఈ దేశాలన్నింటిలో సంతానోత్పత్తి సమస్య ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. అలాగే శిశువు మరియు తల్లి మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది. అయితే మొబైల్ వాన్ల వాడకం వల్ల ఇది చాలా వరకు తగ్గిపోయింది.

ఆధునిక పద్ధతులు..
మొబైల్ ఫోన్లను ఎప్పుడైతే మహిళలు వాడటం మొదలు పెట్టారో.. వారు గర్భనిరోధకం గురించి తెలుసుకునేందుకు అవకాశం పొందారు. అంతేకాదు వారు గర్భనిరోధకం గురించి నిర్ణయం తీసుకునే ప్రక్రియలలో పాల్గొనడానికి అవకాశం దక్కింది. అలాగే వీరు గర్భనిరోధకానికి ఆధునిక పద్ధతులను ఉపయోగించడాకి ఆసక్తి చూపారు.

మెరుగైన ఫలితాలు..
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మొబైల్ ఫోన్లు గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారితో పోలిస్తే, పట్టణ ప్రాంతాలలో నివసించే వారిలోనే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. వీటి వల్ల మెరుగైన జ్ణానం మరియు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. ఫలితాలు మెరుగ్గానే వస్తున్నాయి.

మగవారితో పోలిస్తే..
మగవారితో పోలిస్తే.. మహిళలు మొబైల్ ఫోన్లను సొంతంగా కలిగి ఉండటం లేదు. అయితే అవి ఉన్నవారు మాత్రం కమ్యూనికేషన్ లో, టెక్నాలజీలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటున్నారు.

విద్యా విస్తరణకు..
‘మొబైల్ ఫోన్ టెక్నాలజీ మరింతగా డెవలప్ అయితే, దానిలో విద్యా విస్తరణకు మరియు ఆర్థిక వృద్ధి వంటి ఇతర అభివృద్ధి ప్రక్రియల పాత్రను పూర్తి చేయడానికి ఉపయోగపడుతుందని' సోషియాలజీ మరియు సెంటర్ విభాగంలో ప్రొఫెసర్ లూకా మరియు పెసాండో అన్నారు.



Click it and Unblock the Notifications
