Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
చివరి సూర్య గ్రహణం 2020 : ఏ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..!
డిసెంబరులో సూర్య గ్రహణం వల్ల రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2020 సంవత్సరంలో ఇప్పటివరకు ఐదు గ్రహణాలు జరిగాయి. అందులో మూడు సూర్య గ్రహణాలు విజయవంతంగా ముగిశాయి. మరో సూర్యగ్రహణం మరికొద్ది గంటల్లో జరగబోతోంది.

అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన రాత్రి 7:03 గంటల నుండి డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 12:23 గంటలకు ఈ గ్రహణం జరగబోతోంది. గరిష్ట గ్రహణం 9:43 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ సూర్య గ్రహణం మన భారతదేశంలో కనిపించదు.

ఎక్కువగా దక్షిణ అమెరికా ఖండంలోని కొన్ని దేశాలలో నివసించే ప్రజలకు మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. చిలీ మరియు అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణాలు చూడటానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో సూర్య గ్రహణం వల్ల ప్రతి ఒక్క రాశిచక్రంపై కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా ఏయే రాశిచక్రంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ మొత్తం చూడండి...

మేష రాశి..
ఈ రాశి నుండి తొమ్మిదో స్థానం గుండా సూర్యగ్రహణం సంభవిస్తుంది. దీని కారణంగా మీరు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వ్యాపారులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ తండ్రితో కూడా సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది తరచూ అనేక విధాలుగా సవాళ్లను కలిగిస్తుంది. మీ ప్రయాణానికి అవరోధాలు ఉండవచ్చు.

వృషభరాశి..
ఈ రాశి నుండి ఎనిమిదో ఇంటి నుండి గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ప్రాసెస్ చేసిన మరియు అనారోగ్యకరమైన ఆహారం తినకుండా జాగ్రత్త వహించండి. మీ కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక విషయాలకు సంబంధించిన మాంద్యం మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలో, బంధువులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్వహించడానికి ప్రయత్నాలు అవసరం కావచ్చు. స్వల్ప మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటానికి ప్రయత్నించండి.

మిధున రాశి..
ఈ రాశి నుండి ఏడో స్థానం ద్వారా సూర్య గ్రహణం జరుగుతుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే అవి అంతగా తీవ్రంగా ఉండకపోవచ్చు. అయితే మీ మనస్సుకు గందరగోళానికి గురి చేస్తుంది. అంతేకాదు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. అంచనాలు మరియు అపార్థాలు తరచుగా మీ భాగస్వామితో మీ సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతాయి. మరోవైపు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి ఆరో ఇంటి నుండి సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి ఉద్యోగులు మరియు వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, దాని ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై ఎక్కువగానే పడుతుంది. ఆరోగ్య పరంగా మీకు కొంత ఆందోళనకరంగా ఉంటుంది.

సింహ రాశి..
ఈ రాశి నుండి ఐదో స్థానం గుండా సూర్య గ్రహణం సంభవించనుంద. ఈ సమయంలో మీరు భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అది మీ ఇంటిని ప్రభావితం చేస్తుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక స్థిరత్వం గురించి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీరు ముందుకు వెళ్లి ఎక్కువ శ్రద్ధ వహిస్తే ఇది మీకు చాలా సహాయపడుతుంది.

కన్య రాశి..
ఈ రాశి నుండి నాలుగో పాదం గుండా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. మీరు ఆశించిన ప్రయోజనాలు మరియు బహుమతులను పొందలేరు. మీ ఆరోగ్యం కొంచెం ఇబ్బందుల్లో ఉండవచ్చు. మీరు వ్యాధి బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అది మిమ్మల్ని మరింత ప్రమాదంలో పడేస్తుంది.

తుల రాశి..
ఈ రాశి నుండి మూడో స్థానం గుండా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మీరు చేసే పనిలో కొన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ తోబుట్టువులు మరియు పెద్దలతో సౌకర్యవంతమైన సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరమైన వాటికి విషయాలన్నింటిలో ముఖ్యమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలి. ఈ సమయంలో, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వెంచర్లను నివారించండి. గ్రహణం మీపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపదు.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి రెండో స్థానం ద్వారా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం మరియు కుటుంబసభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలు చెదిరిపోతాయి. నెలవారీ బడ్జెట్‌ను మించిపోవడం మరియు అనవసరమైన ఖర్చులు కారణంగా మీరు ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందుతారు. కాబట్టి తరచుగా మీరు ప్రతి వస్తువు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఈ కాలంలో, మీ కళ్ళు చికిత్స అవసరమయ్యే కొన్ని సమస్యలను అభివృద్ధి చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.

ధనుస్సు రాశి..
ఈ రాశి నుండి సూర్యగ్రహణం ఆరోహణ క్రమంలో సంభవిస్తుంది. ఈ సందర్భంగా మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. మీ ఊపిరితిత్తులలో మీకు అసౌకర్యంగా అనిపించొచ్చు. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించొచ్చు. ఈ కాలంలో, మీరు ఆర్థిక కొరతను అనుభవించవచ్చు మరియు ఒక విధంగా లేదా మరొక విధంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ నెలవారీ ఖర్చుల అంచనాకు అంతరాయం కలిగించే ఖర్చు అధిక స్థాయికి వెళ్ళవచ్చు. ఇతరుల నుండి డబ్బు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి..
ఈ రాశి నుండి పన్నెండో ఇంటి నుండి సూర్యగ్రహణం జరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అకస్మికంగా ఎక్కువ ఖర్చులు కావచ్చు. మీకు ఆర్థిక సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఇది మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో, ఆర్థిక స్థిరత్వం మరియు సహనం మీకు ఆర్థిక మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల నుండి చాలా సహాయపడుతుంది. జాగ్రత్తగా ముందుకు సాగడం చాలా అవసరం.

కుంభ రాశి
ఈ రాశి నుండి పదకొండో ఇంటి నుండి గ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు కొన్ని విషయాలలో ఎక్కువ ప్రయోజనం ఉండొచ్చు. మరోవైపు మీరు మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. ఈ కాలంలో మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత బలోపేతమవుతుంది.

మీన రాశి..
ఈ రాశి నుండి సూర్య గ్రహణం పదో స్థానం గుండా సంభవిస్తుంది. ఈ సమయంలో మీకు పని విషయంలో ప్రతికూలతగా అనిపించొచ్చు. ముఖ్యంగా ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కాలంలో, మీరు కోరుకున్న ఫలితాలను సాధించడానికి మీ వ్యాపార వ్యూహాలను మరియు విధానాలను పునర్వ్యవస్థీకరించాలి.



Click it and Unblock the Notifications