Latest Updates
-
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.!
Summer Solstice 2021: ఈ ఏడాదిలో పొడవైన రోజు ఎప్పుడు... ఆరోజు నీడ కూడా మాయమవుతుందట...
ఈ ఏడాదిలో పొడవైన రోజు ఎప్పుడో తెలుసుకుందామా..
మన క్యాలెండర్లో ప్రతిరోజూ సమయం, తేదీ, రోజులు మారుతూ ఉంటాయి. అలాగే రుతువులు కూడా మారుతూ ఉంటాయి. ప్రతిరోజూ పగలు మరియు రాత్రి మధ్య ఎంతో వ్యవధి ఉంటుంది.

ఇలా ఏడాది పొడవునా అంటే 365 రోజుల పాటు ఉంటుంది. కానీ సంవత్సరం పొడవునా ప్రతిరోజూ ఇలాగే ఉండదట. అన్నిరోజులూ సమానం కాదట. సంవత్సరంలో కొన్నిసార్లు కొన్ని రోజులు తక్కువగా ఉంటాయట. అందులో కొన్ని సందర్బాల్లో రాత్రులు ఎక్కువగా.. మరికొన్ని సందర్భాల్లో పగలు ఎక్కువ సమయం ఉంటుందట.

ఈ నేపథ్యంలో సంవత్సరంలో ఒక రోజు పగటి పూట ఎక్కువ సమయం మరియు రాత్రి వేళ అతి తక్కువ సమయం నమోదవుతుంది. అలాంటి అనుభవం మనకు ఈ ఏడాది ఇదే నెలలోనే ఎదురుకాబోతోంది. ఈ సంవత్సరంలో జూన్ 21వ తేదీన అంటే సోమవారం నాడు ఎక్కువ సమయం ఉండే రోజును చూడొచ్చట. అలాగే రాత్రి వేళ తక్కువ సమయం ఉండటాన్ని మనం గమనించొచ్చు. అయితే ఇదే రోజున ఏడాదిలో ఎక్కువ సమయం ఉండే రోజుగా వచ్చింది.. అసలు ఇది ఎందుకు వస్తుందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

జూన్ 21నే ఎందుకు..
ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, సూర్యుడు ఉత్తర అర్థగోళం నుండి ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ వైపునకు భారతదేశం మధ్యలో దాటుతాడు. ఆ రోజున సూర్యకిరణాలు భూమిపై ఎక్కువ సమయం పడటానికి కారణం ఇదే. ఈరోజున సూర్య కాంతి 15 నుండి 16 గంటల వరకు భూమిపై పడుతుంది. అందుకే జూన్ 21వ తేదీన సంవత్సరంలో పొడవైన రోజు కావడానికి కారణం. ఈ దృగ్విషయాన్ని సమ్మర్ అయనాంతం అంటారు.

నీడ మాయమవుతుంది..
జూన్ 21వ తేదీన మనిషి యొక్క నీడ కూడా మాయమవుతుందట. వాస్తవానికి సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పై ఉన్నప్పుడు నీడ అనేది సాధారణంగా కనిపించదట. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన దృగ్విషయం.

ఏడాదికి రెండుసార్లు..
అయనాంతం ఒక ఖగోళ సంఘట. ఇది సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. వేసవికాలంలో ఒకసారి సూర్యుడిని ఉత్తర లేదా దక్షిణ ధ్రువం నుండి చూసినప్పుడు సంవత్సరంలో పొడవైన రోజు నమోదు అవుతుంది. ఈరోజున, అంటే జూన్ 21వ తేదీన సూర్యుని కిరణాలు భూమిపై ఎక్కువ కాలం ఉంటాయి.

రెండో ఖగోళ సంఘటన
అదే సమయంలో రెండో ఖగోళ సంఘటన డిసెంబర్ 22వ తేదీన జరుగుతుందది. ఈరోజున పగలు తక్కువ సమయం మరియు రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. ఈరోజున సూర్యకిరణాలు భూమిపై కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. పగలు మరియు రాత్రి వ్యవధిలో గొప్ప వ్యత్యాసం ఉండేది సంవత్సరంలో కేవలం రెండు రోజులే.



Click it and Unblock the Notifications