Latest Updates
-
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.!
కర్కాటకంలోకి సూర్యుడు.. మకరంలోకి శని ప్రవేశిస్తే... 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి....
జులై 16వ తేదీన సూర్యుడు కర్కాటకంలోకి, శని గ్రహం మకరంలోకి ప్రవేశిస్తున్న సమయంలో 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు అధిపతిగా సూర్యుడు అని చాలా మంది నమ్ముతారు. తన వేయి కిరణాల చేతల లోకానికి వెలుగునివ్వడమే కాకుండా చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే సూర్యుడిని పాలనాధికారి అంటారు.

సూర్యుడు అంటే నిజాయితీకి.. న్యాయానికి.. గౌరవానికి ప్రతీకగా ఉంటాడు. మరోవైపు శని గ్రహం అంటే ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికి సూచనగా శనిని పిలుస్తారు.

అయితే ఈ రెండు గ్రహాలు మరికొద్ది గంటల్లో అంటే జులై 16న గురువారం నాడు సూర్యుడు కర్కాటకంలోకి.. శని గ్రహం మకర రాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఈ రెండు ఏడో పాదం నుండి ప్రయాణించబోతున్నాయి.

ఈ రెండు గ్రహాలు ఒకేసారి రెండు రాశులలోకి ప్రవేశించే సమయాన్ని సంస్తాపక యోగం లేదా మిశ్రమ యోగం అని అంటారు. సూర్యుడు.. శనికి తండ్రి అయినప్పటికీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది. ఇలాంటి సమయంలో ద్వాదశ రాశులపై ఈ రెండు గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట. ఇంతకీ ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు పనులను వేగంగా ప్రారంభించాలని భావిస్తారు. కానీ అవి వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మీరు నిరాశ చెందొచ్చు. ఇది మీ కుటుంబంలో వాతావరణాన్ని కూడా చెడగొడుతుంది. ఇలాంటి సమయంలో మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి.

వృషభ రాశి..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఉద్యోగులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు పురోగతి సాధించే అవకాశం కూడా ఉంది. మీరు విహారయాత్రలు వంటివి కూడా చేసే అవకాశముంది.

మిధునం..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ప్రభుత్వాధికారులతో వివాదం పెట్టుకోకూడదు. మరోవైపు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి బడ్జెట్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారిలో ఉద్యోగులకు, వ్యాపారులకు సూర్య-శని రవాణా వల్ల ప్రతికూల సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమయాల్లో మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. మీరు మీ పనిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ పనులు చాలా వరకు అసంపూర్ణంగా మిగిలిపోవచ్చు.

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా వల్ల ఇంటి వాతావరణం అల్లకల్లోలంగా మారుతుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మీరు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. లేకపోతే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

కన్య రాశి..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. మీకు ఆకస్మికంగా లాభాలు వస్తాయి. అంతేకాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా దక్కే అవకాశం ఉంది. మీరు ఇంతవరకు ఎదుర్కొన్న సమస్యలకు అనూహ్యంగా పరిష్కారం కూడా లభించే అవకాశం ఉంది.

తుల రాశి..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ పెండింగ్ పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ పనుల వైపు నుండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మీరు ఏదైనా విహారయాత్రలు ప్లాన్ చేసి ఉంటే, వాటిని వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా వల్ల మీకు అనేక విషయాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మీరు కొన్ని విషయాల్లో కోపాన్ని ప్రదర్శిస్తారు. అంతేకాదు మీరు ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

మకర రాశి..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా వల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఈ సమయంలో మీరు ఏవైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే, మీరు అనవసరంగా సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అనిపిస్తుంది. అలాగే మీరు భావోద్వేగంలో కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఈ సమయంలో మీరు ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టకూడదు. ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే మీరు వనరులను సరిగ్గా వినియోగించుకుంటే, మీకు సానుకూల ఫలితాలు వస్తాయి.

కుంభ రాశి..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు అనేక ప్రయోజనాలను పొందే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మీ పనులన్నీ సకాలంలోనే పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి వారికి సూర్య-శని రవాణా వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశముంది. ఫలితంగా మీ పురోగతి నెమ్మదిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు అప్పులు చేయడం లేదా ఇవ్వడం వంటివి చేయకూడదు. వాహనాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఉద్యోగులు ఆఫీసులో మేనేజర్, సహోద్యోగులతో వివాదాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది.



Click it and Unblock the Notifications