Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
Sun Transit in Leo on 17 August 2021:సింహంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనం...!
2021లో ఆగస్టు 17న సింహరాశిలోకి సూర్యుని సంచారంతో ఈ రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందట. ఆ రాశులేవో చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలకు సూర్యుడిని అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు.

ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో ఆగస్టు 17వతేదీన సూర్యుడు మరోసారి తన దిశను మార్చుకోనున్నాడు. తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి మంగళవారం నాడు సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కచ్చితమైన ప్రభావం ఉంటుంది.

సుమారు ఏడాది తర్వాత సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల సూర్యుడు కూడా బలంగా ఉంటాడు. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసుకోండి...

మేష రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు ఐదో స్థానంలో రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంగా మేష రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం కూడా మంచిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు రావొచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఓపికగా ఉంటే.. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

మిధున రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు ధైర్యం, శక్తి వంటివి పెరుగుతాయి. ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది. వ్యాపారులు వ్యాపారంలో మంచి లాభాలను సాధిస్తారు. కష్ట సమయాల్లో మీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. వారి మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఈ కాలంలో మీరు పేదలకు దానం వంటివి కూడా చేయొచ్చు. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడే అధిపతిగా పరిగణిస్తారు. తన సొంత రాశిలోకే సూర్యుడు అడుగు పెట్టడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మీరు ఏ పనినైనా చేసేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీరు యోగా, ధ్యానం చేయడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్య పరమైన సమస్యల నుండి బయటపడతారు. కష్ట సమయాల్లో మీ కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. వ్యాపారులకు పెట్టుబడుల విషయంలో అందరి మద్దతు లభిస్తుంది.

తుల రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో పని చేసే వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులకు చాలా విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో సకాలంలో పనులు పూర్తి చేయడం వల్ల ప్రమోషన్ గురించి కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు మెరుగుపడతాయి.

వృశ్చికరాశి..
ఈ రాశి నుండి సూర్యుడు పదో స్థానం నుండి ప్రయాణించనున్నాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈ సమయంలో శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు పొందొచ్చు. మీరు ఈ కాలంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని చూస్తుంటే, సూర్యుడి రవాణా వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు తొమ్మిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంగా ధనస్సు రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు ఈ కాలంలో మంచి విజయాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ పిల్లలు అనేక విషయాల్లో పురోగతి సాధిస్తారు. మరోవైపు మీరు ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కాలంలో మీరు తీర్థయాత్రలకు వెళ్లేందుకు ఓ ప్లాన్ వేసుకుంటారు. అన్నింటికంటే ముఖ్యమైనది ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా జీవనం గడుపుతారు.



Click it and Unblock the Notifications
