Sun Transit in Pisces on 14 March:మీనంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ప్రతికూలం...!

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహాల అధిపతిగా భావిస్తారు. సాధారణంగా సూర్యుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో ఆకాశంలో ఎప్పుడూ ఒక చోట ఉండకుండా, సంచారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ సూర్యుడు స్థిరంగా ఉంటాడు. సూర్యుని చుట్టే భూమి తిరుగుతూ ఉంటుంది.

Sun Transit in Pisces on 14 March 2021 Effects on Zodiac Signs in Telugu

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సరిగ్గా ఇలాగే గ్రహాలు, ఉపగ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల నవగ్రహాలకు అధిపతిగా రవిని భావిస్తారు. అయితే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు.

Sun Transit in Pisces on 14 March 2021 Effects on Zodiac Signs in Telugu

అలాంటి సూర్యుడు మార్చి 14వ తేదీన అంటే ఆదివారం నాడు సాయంత్రం 5:55 గంటలకు కుంభ రాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో మీరు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీరు శత్రువులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తారు. మరోవైపు వ్యాపారవేత్తలకు ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత ఉండకపోవచ్చు.

పరిహారం : ప్రతిరోజూ గాయత్రి మంత్రాన్ని జపిస్తే శుభఫలితాలొస్తాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి సూర్యుడి సంచారం సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారులు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయం ఉద్యోగులకు కూడా చాలా మంచిగా ఉండొచ్చు. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి.

పరిహారం : ప్రతిరోజూ సూర్యుని తలచుకుని ధ్యానం చేయండి.

మిధున రాశి..

మిధున రాశి..

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి సహకారం లభిస్తుంది. మీకు కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారం చేయండి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీకు కుటుంబం మద్దతు ఇస్తుంది. ఈ కాలంలో మీ ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. పని రంగంలో ఉండేవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే ‘రామక్రిష్ణ స్తోత్రం'పఠించండి.

సింహ రాశి..

సింహ రాశి..

మీన రాశిలోకి సూర్యుడి ఎంట్రీతో ఈ రాశి వారిపై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది. మీ పనులన్నీ వేగవంతం అవుతాయి. అయితే మీరు భవిష్యత్తు గురించి ఆలోచించి ఆందోళన చెందుతారు. ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో మీకు మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది.

పరిహారం : ఆదివారం రోజున నాణ్యత గల రూబి రత్నంతో ఉన్న బంగారు లేదా రాగి ఉంగరాన్ని ధరించండి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు సూర్యుడి సంచారం సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు చాలా సంయమనంతో పని చేయాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాలంలో కొత్త వ్యాపారం వంటివి ప్రారంభించడాన్ని వాయిదా వేసుకోవాలి.

పరిహారం : సూర్యోదయం సమయంలో సూర్యమంత్రాన్ని జపించాలి.

తుల రాశి..

తుల రాశి..

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. మీరు చాలా కాలంగా బాధపడుతున్న ఒక దీర్ఘాకలిక వ్యాధి నుండి ఉపశమనం కూడా పొందొచ్చు. ఈ సమయంలో పని చేసే ప్రజలకు చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీ శత్రువు చాలా చురుకుగా ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే ‘సూర్యఅష్టకం'ను వినండి లేదా పఠించండి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

మీన రాశిలోకి సూర్యుడి సంచారంతో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో మీ ఇంట్లోని పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ఒప్పందాన్ని ఖరార చేయకూడదు.

పరిహారం : కాపర్ పాత్రలో నీటిని వేసుకుని తాగితే మంచి ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

సూర్యుడు మీనరాశిలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ రాశి వారికి ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ ఇంటి వాతావరణం కూడా ప్రతికూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులుండొచ్చు. మరోవైపు మీరు ఈ కాలంలో తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పరిహారం : ప్రతిరోజూ సూర్య నమస్కారం చేస్తే శుభఫలితాలొస్తాయి.

మకర రాశి..

మకర రాశి..

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు చాలా విషయాల్లో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీ పనులలో చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది.

పరిహారం : ఎర్ర చీమలకు పిండిని ఆహారంగా ఇస్తే మంచి ఫలితాలు రావొచ్చు.

కుంభ రాశి..

కుంభ రాశి..

మీనరాశిలోకి సూర్యుడి సంచారం జరిగే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే మీ కుటుంబసభ్యులు లేదా స్నేహితుల మధ్య కొన్ని తేడాలు రావొచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆస్తి విషయంలో ఈరోజు మీరు ప్రయోజనం పొందొచ్చు.

పరిహారం : ముఖ్యమైన పనులు చేసేటప్పుడు తండ్రి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి.

మీన రాశి..

మీన రాశి..

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారి ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. మీకు ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కలవరపెడతాయి. మీ శత్రువు చాలా చురుకుగా ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో, మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచనాత్మకంగా గడపాలి.

పరిహారం : ఆదివారం రోజున ఆవుకు బెల్లాన్ని ఆహారంగా ఇస్తే మంచి ఫలితాలొస్తాయి.

Desktop Bottom Promotion