Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
సూర్యుడు వృశ్చికంలో ప్రవేశం.. ఈ రాశులకు అదృష్టం..! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
వృశ్చిక రాశిలోకి సూర్యుడు సంచారం చేసే సమయంలో ఈ రాశుల వారికి సానుకూల ఫలితాలుంటాయట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో సూర్యుడిని అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు ప్రతి నెలా ఓ రాశి నుండి మరో రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇలా మారినప్పుడు మకర సంక్రాంతి అని కూడా అంటారు.

2021 సంవత్సరంలో నవంబర్ 16వ తేదీన అర్ధరాత్రి 12:49 గంటలకు తులరాశి నుండి వృశ్చికరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెల రోజుల పాటు అంటే డిసెంబర్ 16వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. అదే రోజున తెల్లవారుజామున 3:28 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు.

వృశ్చిక రాశిలో సూర్యుని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజకరంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశిచక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అయితే సూర్యుడి సంచారం సమయంలో ద్వాదశ రాశులలోని ఐదు రాశుల వారికి అదృష్టం రానుందట. ఈ సమయంలో ఆ 5 రాశుల వారు సమాజంలో గౌరవం, విజయం పొందుతారు. అలాగే ఆర్థిక పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఇంతకీ ఆ రాశులేవి? ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందా లేదా ఇప్పుడే చూసెయ్యండి.

వృషభ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు ఏడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆఫీసులో పని చేసే ఉద్యోగులు మంచి విజయం సాధిస్తారు. అలాగే గౌరవాన్ని పొందుతారు. మీరు ఈ కాలంలో కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించొచ్చు.

మిధున రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు ఆరో పాదం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా పురోగతి ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగంలో పని చేసే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీరు అనేక ప్రయోజనాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈ కాలంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో పాదం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయొచ్చు. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నట్లయితే, మీ సహోద్యోగులతో మర్యాదగా ప్రవర్తించాలి. లేదంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందుల్లో ఉండొచ్చు. మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు. అయితే సూర్యుని రాశి మార్పు వల్ల మీ ఖర్చులను పెంచుతుంది. ఈ సమయంలో మీరు ఖర్చులపై శ్రద్ధ వహించాలి. సూర్యుని అనుగ్రహంతో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎవరికీ హాని చేయొద్దు. దీని కారణంగా నష్టాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది. మీరు వివాదాల పరిస్థితిని నివారించాలి. ఆరోగ్య పరంగా అంతా బాగుంటుంది.

తుల రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు రెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో విజయం సాధించొచ్చు. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సమయం సానుకూలంగా ఉంటుంది. కానీ తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా ముఖ్యమైన పనిని చేసే ముందు, అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి..
సూర్యుడు తుల రాశి నుండి ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ ధైర్యం, శక్తి పెరుగుతుంది. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కేతు గ్రహం కూడా ఇప్పటికే ఇదే రాశిలో నివాసం ఉంటున్నాడు. సూర్యుడు మరియు కేతువు కలయిక వల్ల మీ జీవితంలో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరగొచ్చు. ఉద్యోగులు ఈ కాలంలో ఎలాంటి రిస్కులు తీసుకోకూడదు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆలోచించొద్దు. చెడు సావాసాలను కూడా వదులుకోండి.
గమనిక : ఇక్కడ ఇచ్చిన రాశుల సమాచారం అన్ని వర్గాల వారిని ద్రుష్టిలో ఉంచుకుని ఇచ్చినది. మీకు పూర్తి సమాచారం కావాలంటే వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించి అన్నీ వివరాలు తెలుసుకోగలరు. ఇక్కడ ఉన్న సమాచారానికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని పాఠకులు గుర్తుంచుకోగలరు.



Click it and Unblock the Notifications
