Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
వైరల్ వీడియో : అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు బీరు పొంగించారు.. తర్వాత కాలేజీ నుండి బహిష్కరణకు గురయ్యారు
తమ విద్యాసంస్థ ఓ మఠం ఆధ్వర్యంలో నడుస్తుందని, తమ కళాశాల మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తుందని, తమకు సమాజంలో మంచి పేరు ఉందని చెప్పారు.
న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది బీర్లు పొంగిస్తారు.. కేకులు కట్ చేస్తారు.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే న్యూ ఇయర్ రాక ముందే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి బీర్లు పొంగించారు కొందరు అమ్మాయిలు.

తమ స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఓ రూమ్ లో నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలతో కలిసి మందేసి చిందులేశారు.. అయితే అక్కడున్న ఓ అబ్బాయి వారందరికీ తెలియకుండా ఆ సంఘటనను వీడియో తీశాడు.అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అంతే ఆ వీడియో కాస్త తెగ వైరల్ అయిపోయింది. వారు రహస్యంగా చేసుకున్న బర్త్ డే పార్టీ కాస్త ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...
అబ్బాయిలతో కలిసి...
ఆరోజు ఓ విద్యార్థిని పుట్టినరోజు. నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మొత్తం ఆరుగురు స్నేహితులు కలిసి బర్త్ డే పార్టీని గ్రాండ్ గా జరుపుకుందామని నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే వారంతా కలిసి బీర్లు తెచ్చుకున్నారు. గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు.

అతని బంధువే...!
అయితే ఈ పార్టీలో జరిగిన సంఘటనలన్నింటినీ వారికి తెలియకుండా అక్కడున్న ఓ అబ్బాయి తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. అతను ఎవరో కాదు. ఆ బర్త్ డే జరుపుకునే అమ్మాయి బంధువే. ఆ వీడియోను వాట్సాప్, ఫేస్ బుక్ లలో షేర్ చేశాడు.

వైరల్ అయిపోయింది...
అంతే ఆ వీడియో కాస్త తెగ వైరల్ అయిపోయింది. ఆ విషయం కాస్త తమ తల్లిదండ్రులకు తెలిసిపోయింది. అంతేకాదు వారు చదువుకునే కాలేజీ యాజమాన్యానికి కూడా తెలిసిపోయింది.

చర్యలు తీసుకున్న కాలేజీ యాజమాన్యం
కాలేజీ యాజమాన్యానికి మందు తాగిన విషయం గురించి తెలియడంతో వెంటనే చర్యలు తీసుకుంది. ముందుగా అమ్మాయిల తల్లిదండ్రులను కాలేజీకి పిలిపించారు ప్రిన్సిపాల్ . అయితే ఈ ఘటన కాలేజీలో జరగకపోయినా, వారు తమ విద్యాసంస్థకు సంబంధించిన యూనిఫామ్ లో ఉన్నందున శాశ్వత బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

2వ తేదీ నుండి..
తమ విద్యాసంస్థ ఓ మఠం ఆధ్వర్యంలో నడుస్తుందని, తమ కళాశాల మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తుందని, తమకు సమాజంలో మంచి పేరు ఉందని చెప్పారు. మీ పిల్లలు చేసిన పని వల్ల తమ పరువు పోయి మిగిలిన వారిలో చులకన భావం రాకుండా ఉండేందుకే వారిని సస్పెండ్ కాకుండా శాశ్వత బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మీ పిల్లల్ని 2వ తేదీ నుండి కాలేజీకి పంపొద్దని తల్లిదండ్రులను ఆదేశించారు.

కాలేజీతో సంబంధం లేని అబ్బాయిలు..
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆ వీడియోలోని ముగ్గురు అమ్మాయిలు కాలేజీ యూనిఫామ్ లో ఉండగా, మరో అమ్మాయి సివిల్ డ్రస్ లో ఉంది. అయితే అక్కడ ఉన్న అబ్బాయిలు మాత్రం కాలేజీతో సంబంధం లేని వాళ్లుగా గుర్తించారు.

ఎక్కడ జరిగిందంటే..
గత డిసెంబర్ నెలలోని 24వ తేదీ జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఎక్కడో విదేశాల్లో కాదు. మన దేశంలోనే. అది కూడా తమిళనాడు రాష్ట్రంలోని మయిలాదుత్తురైలోని ధర్మపురం ఆధీనం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగింది.

మద్యం తాగేందుకు...
మాములుగా మద్యం తాగాలంటే ఎవరికైనా చట్టం ప్రకారం కనీసం 21 ఏళ్లు పూర్తవ్వాలి. కానీ ఆ నలుగురు అమ్మాయిలు 18 ఏళ్ల వయస్సు వారే కావడం గమనార్హం.

ఇంతకుముందు
ఇదే మొదటి వీడియో కాదు. ఇంతకు ముందు కూడా కొందరు అమ్మాయిలు రహస్య ప్రదేశాలకు వెళ్లి బీర్ తాగిన సంఘటన సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. అది కూడా బాగా వైరల్ అయ్యింది. అయితే వారంతా ఆ సమయంలో సివిల్ డ్రస్ లో ఉన్నారు. వారి వివరాలు ఏంటో తెలియకుండా జాగ్రత్తపడ్డారు.



Click it and Unblock the Notifications
