Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Taurus Horoscope 2021 : వృషభరాశి వారు సంపద పెంచుకుంటారు.. అది ఎప్పుడంటే...?
2021లో వృషభరాశి వారికి ఎలా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా వంటి మహమ్మారి కారణంగా 2020 సంవత్సరం ఇలా అలా వెళ్లిపోయినట్టుంది. గతేడాది ఫిబ్రవరి నుండి డిసెంబర్ దాకా లాక్ డౌన్, అన్ లాక్ డౌన్ వంటి వార్తలనే ఎక్కువగా విన్నాం, చూశాం.

2020లో ఏదో జరుగుతుందని భావిస్తే.. కరోనా తలచిందే జరిగింది. ఈ నేపథ్యంలో 2021లోకి అడుగుపెట్టిన మనకు కొత్త సంవత్సరంలో అయినా కలిసి వస్తుందా? లేదా అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది.

ఈ నేపథ్యంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2021లో వృషభరాశి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. గ్రహాలను బట్టి ఈ రాశి వారికి వార్షిక ఫలితం ఎలా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మొదటి నెలలో..
2021 ప్రారంభమైన మాసం జనవరిలో ఈ రాశి వారు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. అకస్మాత్తుగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. మరోవైపు పర స్త్రీలతో పరిచయం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రెండో నెలలో..
ఈ సమయంలో బంధువల నుండి ఒక చెడు వార్త వినిపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వైద్యులకు పనిభారం పెరుగుతుంది. ఉద్యోగులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఏ విషయంలో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి.

మూడో నెలలో..
ఈ రాశి వారికి ఈ కాలంలో సంపద పెరిగే అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది. ప్రేమ వంటి విషయాల్లో ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. మీ స్నేహితులతో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల మీరు మానసికంగా అద్భుతంగా గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

నాలుగో నెలలో..
ఈ రాశి వారికి ఏప్రిల్ మాసంలో అనుకోకుండా సంపద పెరగొచ్చు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మరోవైపు ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు.

ఐదో నెలలో..
ఈ రాశి వారు మే నెలలో సంపద విషయంలో సానుకూలంగా ఉంటారు. విద్యార్థులు ఎలాంటి పోటీ పరీక్షలోనైనా సులభంగా విజయం సాధిస్తారు. మరోవైపు ఉద్యోగులకు, వైద్యులకు పనిభారం పెరుగుతుంది. మరోవైపు విదేశాల్లో ఉండే వారికి శుభవార్త వినిపిస్తుంది.

ఆరో నెలలో..
జూన్ నెలలో మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రేమ వంటి విషయాల్లో మీరు ఆలోచనాత్మకంగా అడుగులు వేయాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడంతో మీరు ఆందోళనకు గురవుతారు. మరోవైపు విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

ఏడో నెలలో..
ఈ కాలంలో మీరు మీ సంపద పెంచుకునేందుకు ఉన్న దారులను అన్వేషిస్తారు. అదే సమయంలో ఇప్పటివరకు చేసిన అప్పులను తీర్చేస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ ఆదాయానికి కూడా ఎలాంటి లోటు ఉండదు. ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు పెండింగులో ఉన్న వారికి ఈ సమయంలో పరిష్కారం లభించే అవకాశం ఉంది.

ఎనిమిదో నెలలో..
ఈ సమయంలో పెళ్లి కాని వారు వివాహ సంబంధాల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు కూడా కొలిగ్స్ నుండి సహకారం లభిస్తుంది. మరోవైపు విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీ బంధువుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణించొచ్చు.

తొమ్మిదో నెలలో..
ఈ సమయంలో నిరుద్యోగులకు చాలా కాలం తర్వాత జాబ్ ఆఫర్ వస్తుంది. మీరు కోరుకున్న విధంగా సంపద పెరుగుతుంది. అయితే దానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. మీరు ఏదైనా టూర్ కు వెళ్లొచ్చు. వ్యాపారులకు ఈ సమయంలో అడ్డంకులు ఎదురవుతయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ నెలలో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు.

పదో నెలలో..
అక్టోబరు మాసంలో ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా మరియు సంపద పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ చిన్ననాటి స్నేహితులతో చాలా సరదాగా గడుపుతారు. ఉద్యోగులకు మాత్రం ఈ సమయంలో ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు తమ అధ్యయనాల విషయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది.

పదకొండో నెలలో..
ఈ నెలలో ఉద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అయితే పెళ్లి కాని వారు మాత్రం వివాహ సంబంధిత విషయాల గురించి మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరోవైపు నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ వస్తుంది. ఆదాయ పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ ఇంటికి బంధువులు ఎక్కువగా వచ్చి వెళ్తుంటారు.

చివరి నెలలో..
2021 సంవత్సరం డిసెంబర్ అయిన చివరి నెలలో ఈ రాశి వారు కొత్త ఇల్లు కట్టుకోవాలని భావిస్తారు. మరోవైపు పెళ్లి కాని వారికి వివాహ సంబంధం సెట్ అవుతుంది. నిరుద్యోగులు మంచి సంస్థలో ఉద్యోగంలో చేరతారు. అప్పుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఈ రాశి వారు చివరి మాసంలో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈ సమయంలో విద్యార్థులు ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











