Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Chanakya Niti: ఈ ముగ్గురు వ్యక్తులు అత్యంత ప్రమాదకరం, వీరితో సావాసం ఏమాత్రం క్షేమకరం కాదు
చాణక్యుడు పాములు, తేళ్ల లాగే కొందరు వ్యక్తులు చాలా ప్రమాదకరమని చెప్పాడు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ మన చుట్టే ఉంటారని హెచ్చరించాడు ఆచార్యుడు.
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, దౌత్యవేత్త, వ్యూహకర్త.. ఆయన ఆర్థిక, రాజకీయ, దౌత్య శాస్త్రంతో పాటు ఆచరణాత్మక జీవితం గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. నేటికీ కష్ట సమయాల్లో ఆయన చెప్పిన మాటలు, సలహాలు, సూచనలు, విధానాలు ఎంతగానో తోడ్పడతాయి.

చాణక్యుడు పాములు, తేళ్ల లాగే కొందరు వ్యక్తులు చాలా ప్రమాదకరమని చెప్పాడు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ మన చుట్టే ఉంటారని హెచ్చరించాడు ఆచార్యుడు. అలాంటి వారిని సరిగ్గా గుర్తించి, సామరస్యంగా మెలిగితే జీవితం సాఫీగా, ఆనందంగా సాగుతుందని చెప్పాడు చాణక్యుడు. జీవితంలో అలాంటి వారి సాయాన్ని కూడా ఎప్పుడూ తీసుకోవద్దని సూచించాడు.
నైవ పశ్యతి జన్మన్థః కమన్ధో నైవ పశ్యతి|
మదోన్మత్తా న పశ్యంతి అర్తీ దోష న పశ్యతి||
చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకానికి అర్థం.. పుట్టుకతో అంధుడైన వ్యక్తి ఎలా లోకాన్ని చూడలేడో, అదే విధంగా కామ, క్రోధ, లోభాతో పాటు మత్తులో ఉన్న వ్యక్తి దేన్నీ చూడలేడు, అర్థం చేసుకోలేడని అర్థం. అదే సమయంలో స్వార్థపరుడు కూడా తనలోని తప్పుల గురించి పట్టించుకోకుండా ఇతరుల తప్పుల గురించి వెతుకుతాడని, అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలని చెప్పాడు చాణక్యుడు.

స్వార్థపరులకు, నీచమైన వ్యక్తులకు దూరంగా ఉండాలి:
స్వార్థపరులకు, నీచమైన వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పాడు చాణక్యుడు. ఎందుకంటే అలాంటి వ్యక్తుల వల్ల ఎప్పటికీ మీకు చెడే జరుగుతుందని చెప్పాడు. మంచి జరగకపోగా మీకు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించాడు చాణక్యుడు.
చాణక్య నీతి ప్రకారం శత్రువు ముందు నుండి దాడి చేస్తాడు. అతడిని, అతడి దాడిని గమనించడానికి, జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. కానీ స్వార్థపరులు, నీచమైన వ్యక్తులు మన వెనకే ఉండి గోతులు తవ్వుతారని చెప్పాడు చాణక్యుడు. అలాంటి వారిని నమ్మడం వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుందన్నాడు ఆచార్య చాణక్యుడు.

కోపంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి:
కోపంతో, ఆవేశంతో ఉన్న వ్యక్తికి ఎప్పుడూ దూరంగా ఉండాలని చెప్పాడు చాణక్యుడు. కోపం మనిషికి అతి పెద్ద శత్రువు. కోపంలో ఒక వ్యక్తికి ఆలోచించే మరియు అర్థం చేసుకునే శక్తి తక్కువగా ఉంటుంది. కోపంతో, ఒక వ్యక్తి తనకు, ఇతరులకు కూడా హాని చేస్తాడు. కోపంలో, ఒక వ్యక్తికి తప్పొప్పులపై అవగాహన తగ్గుతుంది. అతను తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తులు శత్రువుల కంటే ప్రమాదకరమని చాణక్యుడు చెప్పాడు.

చెడు, అత్యాశ గల వ్యక్తులకు దూరంగా ఉండాలి:
అత్యాశ పడే వారికి, అసూయతో రగిలిపోయే వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలని చెప్పాడు చాణక్యుడు. కష్ట సమయాల్లో కూడా అలాంటి వ్యక్తుల నుండి సహాయం కోరకూడదని అన్నాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు దురాశ, అసూయతో సహాయం చేస్తున్నట్లు చూపిస్తారని, ఒకవేళ సహాయం చేసినా దాని వెనక స్వార్థం ఉంటుందని చెప్పాడు చాణక్యుడు.
అసూయపడే వారు ఇతరుల శ్రేయస్సు, పురోగతితో వారు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. దుష్ట, దురాశ స్వభావం గల వ్యక్తుల ఇతరుల అభివృద్ధిని చూసి అసూయ చెందుతారు. వారికి హాని చేయడానికి ప్రయత్నిస్తారు.



Click it and Unblock the Notifications