Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
ఈ రాశుల వారు చలికాలాన్ని చాలా ఇష్టపడతారట... ఎందుకో తెలుసా...
ఈ రాశుల వారు వింటర్ సీజన్ ను బాగా ఇష్టపడతారట.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే సూర్యుడు దర్శనమిస్తున్నాడు. అయినా కూడా వాతావరణం చల్లగా ఉంది.

ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరూ వేడి వేడిగా ఏదైనా బజ్జీ, సమోసా ఇతర పదార్థాలను తినేందుకు ఆసక్తి చూపుతారు. అలాగే చలిలో బయట అడుగు పెట్టేందుకు ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపరు. అయితే ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో సరదాగా గడపాలని అనుకుంటూ ఉంటారు.

ఇక కొత్త దంపతులైతే పడకగదిలో నుండి బయటికి రావడానికి ఏ మాత్రం ఇష్టపడరు. ఎంతసేపు దుప్పట్లోనే దూరేయాలని ఆరాటపడుతూ ఉంటారు. వీటన్నిటి సంగతి పక్కనబెడితే.. చలికాలం అంటే ప్రేమికులకు ఎంతో ఇష్టం. అయితే కొందరు చలికాలంలో గజగజ వణికించే వాతావరణాన్ని పెద్దగా ఇష్టపడరు. మరికొందరు మాత్రం ఈ శీతాకాలాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు చలికాలాన్ని బాగా ఇష్టపడతారట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో ఇప్పుడే చూడండి...

వృషభ రాశి..
ఈ రాశి వారికి చలికాలం అంటే ఎంతో ఇష్టమట. వీరు ఎల్లప్పుడూ చల్లని వాతావరణాన్ని కోరుకుంటారట. ఇలాంటి వెదర్ చాలా సౌకర్యంగా ఉంటుందని భావిస్తారట. ముఖ్యంగా చలికాలంలో వెచ్చిని స్వెటర్లు.. దుప్పట్లు కప్పుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారట. అంతేకాదు ఇలాంటి వాతావరణం ఎల్లప్పుడూ వీరిని కూల్ గా ఉంచేందుకు సహాయపడుతుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు శీతాకాలాన్ని ఎక్కువగా ఆస్వాదించడాన్ని ఇష్టపడతారు. ఈ కాలంలో మీరు ఇంట్లో ఉండి.. వేడి వేడి పదార్థాలను తినాలని... గరం ఛాయ్ తాగితే ఎంతో మజా వస్తుందని ఫీల్ అవుతారట. అంతేకాదు వీరికి ఈ చలికాలంలో వెబ్ సీరిస్ లు చూడటం అంటే ఎంతో ఇష్టమట. ఈ కాలంలో వీరు ఎక్కువగా బయటికి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. అయితే వారి ప్రియమైన వారితో మాత్రం ఏకాంతంగా గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

కన్య రాశి..
ఈ రాశి వారు శీతాకాలాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు. ఈ కాలంలో అందరూ ఇంట్లో ప్రియమైన వారితో లేదా ఫ్యామిలీతో గడపాలని అనుకుంటారు. అయితే వీరు మాత్రం తమ ఫ్రెండ్స్ తో కలిసి గడిపేందుకు ఇష్టపడతారు. ఈ సమయంలో వీరు బయటకు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. చల్లని గాలులు వీరికి ఎంతో హాయిగా అనిపిస్తాయి. వీరు గాలిలో తేలిపోతున్నట్టు ఫీలవుతారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు చలికాలంలో ఎక్కువగా తమ పార్ట్ నర్ తో కలిసి పడకగదిలో ఎంజాయ్ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. ఈ సమయంలో ప్రియురాలిని లేదా భాగస్వామిని బాగా కౌగిలించుకోవడం అనేవి ఎక్కువగా చేయాలనుకుంటారు. వీరికి ఈ కాలంలో చాలా మెమొరీస్ ఉండాలని కోరుకుంటారు. ఇదంతా చలికాలంలో మాత్రమే జరుగుతుందని గట్టిగా నమ్ముతారు. అందుకే వీరికి చలికాలం అంటే బాగా ఇష్టమట.

మకర రాశి..
ఈ రాశి వారికి కూడా శీతాకాలం అంటే చాలా ఇష్టమట. ఈ సమయంలో వీరు లైఫ్ లో కీ రోల్ ఎందులో పోషించారనే దాని గురించి ఆలోచించొచ్చు. ఈ రాశి వారు డెవలప్ అవ్వడానికి ఈ సమయాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుంటారు. ఈ కాలంలో వీరు భవిష్యత్తులో ఏమి చేయాలనే విషయాల గురించి థింక్ చేస్తారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృషభరాశి, వృశ్చికరాశి.. కర్కాటక రాశి.. కన్యరాశి.. మకర రాశుల వారికి చలికాలం అంటే విపరీతంగా ఇష్టమట. ఈ కాలంలో వీరు ఫ్యామిలీతో సరాదాగా గడిపేందుకు, స్నేహితులతో పార్టీలు చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారట.



Click it and Unblock the Notifications