Latest Updates
-
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి..
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
ఈ రాశుల వారు తమ పిల్లల్ని పెంచడంలో మంచి ప్రావీణ్యత కలవారట.
ఒకప్పుడు పిల్లల్ని పెంచడంలో పెద్దలందరూ చక్కని బాధ్యతగా భావించేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు చాలా తక్కువనే చెప్పాలి. మరోవైపు ఇప్పటితరం పిల్లల్ని పెంచాలంటే మాటలు కాదు.

ఎందుకంటే చిన్నప్పుడు మనం వారిని ఎలా పెంచితే వారు పెరిగి పెద్దయ్యాక కూడా వారిపై అదే ప్రభావం పడుతుంది. కొందరికేమో పిల్లల్ని పెంచడం అంటే మంచి సరదాగా ఉంటుంది. కానీ చాలా మంది పిల్లల్ని పెంచడం అంటే ఎంతో ఓపిక కావాలని చెబుతూ ఉంటారు.

అయితే పిల్లల్ని పెంచడంలో కొన్ని నియమాలు పాటించాలి. పిల్లల్ని చిన్నవయసు నుండే తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతగానో ఉంది. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు పిల్లల్ని పెంచే బాధ్యతను చక్కగా నిర్వహిస్తారట.

దీన్నే బట్టి వారి పిల్లల ప్రవర్తన కూడా మారుతూ ఉంటుందట. అప్పుడే మనం చిన్నారులకు మంచి భవితను అందించిన వారమవుతాం. ఇంతకీ ఏయే రాశుల వారు పిల్లల పెంపక బాధ్యతను చక్క నిర్వహిస్తారు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Shukra Neeti Rules : ఇలా చేస్తే మీ వయసు మంచులా కరిగిపోతుందని మీకు తెలుసా...!

కర్కాటక - మీనరాశి..
ఈ రెండు రాశుల వారు పిల్లల్ని పెంచడాన్ని ఒక బాధ్యతగా భావిస్తారు. వీరిద్దరూ పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు పిల్లల తర్వాత వీరికి ఏదైనా. అందువల్ల వీరు పిల్లలకు ఏమి కావాలో చాలా త్వరగా తెలుసుకంటూ ఉంటారు. వారి అవసరాలకు తగ్గట్టు అన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు పిల్లలను ఏమి కావాలో చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. పిల్లల ఎదుగుదల మరియు భవిష్యత్తు కోసం వీరు తమ శాయశక్తులా కష్టపడతారు. పిల్లలకు సంబంధించిన ఎన్ని అడ్డంకులొచ్చినా వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారట.

కన్య-మకర రాశి..
ఈ రాశుల వారు పిల్లల విషయంలో ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. వారి జీవితాల గురించి చాలా ప్రాక్టికల్ ఆలోచిస్తారట. ఇక పిల్లల్ని పెంచే విషయంలో వీరు ఒక క్రమపద్ధతిని అనుసరిస్తారు. పిల్లలకు చిన్నప్పటి నుండే క్రమశిక్షణ యొక్క అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంటారట. ఈ రాశుల వారు ప్రతిదీ పర్ఫెక్ట్ గా పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారట. వీరు తమ పిల్లలు అత్యంత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారట.

వృశ్చికం-కుంభ రాశి..
ఈ రెండు రాశుల వారు సాధారణంగా భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. కానీ పిల్లల విషయానికొచ్చేసరికి, వారి మధ్య ఉండే విభేదాలను పక్కనబెడతారట. అందుకే వీరు ఉత్తమ తల్లిదండ్రులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. వీరిలో వృశ్చికరాశి వారు ఎప్పుడూ తీవ్రమైన కోపం, ఆవేశంతో ఉంటారు. దీంతో వారి పిల్లలు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిపోవాలని ఆశిస్తూ ఉంటారు. అయితే కుంభ రాశి వారు మాత్రం తమ పిల్లల ఇష్టాన్ని గుర్తించి.. వారికి నచ్చింది చేయాలనే ఆలోచనతో ఉంటారు. పిల్లల పెంపకంలో కూడా ఈ రెండు రాశుల వారికి భిన్నమైన అభిప్రాయాలే ఉంటాయి. కానీ వీరి పిల్లలకు మాత్రం వీరు ప్రతిదానిలో మంచి, చెడు విషయాల గురించి వివరంగా చెబుతారు. అందువల్ల వీరి పిల్లలు సంపూర్ణ సమాచారాన్ని తెలుసుకుంటారు.

వృషభరాశి-తులా రాశి..
ఈ రాశుల వారు చాలా విషయాల్లో బ్యాలెన్స్ గా వ్యవహరిస్తారు. వీరిద్దరికీ పిల్లల పెంపకంలో కాసింత విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు పిల్లల పెంపకం అనే బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు. అయితే తులరాశి వారికి ఎప్పుడు.. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలనే మెళకువలు బాగా తెలుసు. అందుకే వీరి పిల్లలు భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు రాశుల వారు కూడా తమ పిల్లల ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ ఉంటారు.

మేషం-మిధున రాశి..
ఈ రాశుల వారు పిల్లల పెంపకం విషయంలో చాలా సరదాగా ఉంటారు. వీరిద్దరిలో మిధున రాశి వారు పిల్లలతో బాగా మాట్లాడగలుగుతారు. అందుకే వీరు పిల్లల పెంపకంలో అందరికన్నా ఒకడుగు ముందే ఉంటారు. వీరిద్దరి పెంపకంలో పిల్లలు తమ ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుకుంటారు. వీరు చేసే ఏ పనిలో అయినా విజయం సాధిస్తారు. అంతేకాదు వీరి కలలను నిజం చేసుకోవడంలో కూడా ఈ రాశుల పేరేంట్స్ ఎంతగానో సహాయపడతారు.



Click it and Unblock the Notifications