For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shukra Neeti Rules : ఇలా చేస్తే మీ వయసు మంచులా కరిగిపోతుందని మీకు తెలుసా...!

|

ఈ లోకంలో నివసించే ప్రతి ఒక్కరి జీవితం, ప్రవర్తన, లక్షణాలకు సంబంధించిన పుస్తకాలను ఎంతో మంది రాశారు. అవి ఇప్పటికీ అందరికీ అందుబాటులో ఉన్నాయి.

మన భారతదేశ సనాతన సంప్రదాయం, హిందూ ధర్మానికి సంబంధించి ఎంతోమంది తత్వవేత్తలు, రుషులు ఎన్నో గొప్ప విషయాలను శాస్త్రాల రూపంలో మనకు అందించారు. వీటిలో చాలా మందికి తెలియనిది శుక్ర నీతి. భ్రుగు మహర్షి కుమారుడు, రాక్షసుల గురువు శుక్రాచార్యుని విధానాల్లో మన జీవితంలో అనేక అంశాల్లో మనకు ఉపయోగకరంగా ఉన్నాయి.

అలాంటి వాటిలో అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. అవి గనుక మీరు పాటించకపోతే మీ వయసు మంచుగడ్డలా కరిగిపోయి మీరు త్వరగా ముసలివారవుతారు. ఈ సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు...ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు...

అనవసరమైన జర్నీ..

అనవసరమైన జర్నీ..

ప్రస్తుత సమాజంలో చాలా మంది ఎక్కువ దూరం ప్రయాణించాలని ఆసక్తి చూపుతూ ఉంటారు. దీని కోసం లాంగ్ డ్రైవ్ పేరిట ఎక్కడెక్కడో జర్నీ చేస్తుంటారు. కొత్త ప్రదేశాలను చూసి వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మన నాలెడ్జ్ పెరుగుతుందని భావిస్తారు. అయితే శుక్రుని విధానాల ప్రకారం మీరు అవసరమైన దాని కంటే ఎక్కువ ప్రయాణం చేస్తే మీ బాడీ చాలా వేగంగా టైడ్ అయిపోయినట్లు అనిపిస్తుందట. అంతేకాదు దీని వల్ల మీ వయసు చాలా వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు అనసవరమైన ప్రయణాలు చేయకపోవడం మంచిది. ముఖ్యంగా కొన్నిసార్లు యాత్రలు, టూర్ల పేరిట అనవసరంగా ప్రయాణాలు చేస్తుంటారు కొందరు. అలాంటివి మానుకుంటే మీ వయసు మరియు ఆరోగ్యానికి మంచిది.

తక్కువగా తినడం..

తక్కువగా తినడం..

మన దేశంలోని సనాతన సంప్రదాయం కారణంగా ప్రతి నెల ఏదో ఒక రాష్ట్రం లేదా ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పండుగ లేదా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో చాలా మంది ముందుగా ఉపవాసం ఉంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ మనసు స్వచ్ఛంగా ఉంటుందని భావిస్తారు. అంతేకాదు బాడీ కూడా శుద్ధి అవుతుందని పురాణాల్లో పేర్కొంటున్నాయి. సాధారణంగా ఉపవాసం శాస్త్రీయ ప్రాముఖ్యత ఏంటంటే మీ జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి. కలుషితాలను శరీరం నుండి విడుదల చేసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే కొందరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉపవాసం ఉంటారు. దీని వల్ల మీ బాడీ బలహీనంగా మారిపోతుంది. అంతేకాదు మీ శరీరానికి తగినంత శక్తినిచ్చే ఆహారం లభించకపోతే మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Kumbh Mela 2021 : మహా కుంభమేళా గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీ కోసమే...!

రొమాన్స్ విషయంలో..

రొమాన్స్ విషయంలో..

శుక్రుని విధానాల ప్రకారం రొమాన్స్ అనేది యవ్వనంలో ప్రతి ఒక్కరికీ రొమాన్స్ అనేది అతి ముఖ్యమైన చర్య. ఎందుకంటే ఆ కార్యంలో పాల్గొంటే మరొకరికి ఈ భూమి మీద అడుగుపెట్టడానికి అవకాశం దక్కుతుంది. అందుకే ఆ కార్యంలో పాల్గొనడాన్ని వైవాహిక జీవితంలో తప్పనిసరి చేశారు. అంతేకాదు వివాహం జరిగిన తొలి రోజు నుండే చాలా ఆ పనిలో నిమగ్నమై ఉంటారు. దీని వల్లే భార్యభర్తల మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. అయితే రొమాన్స్ ను కూడా పరిమితంగా చేయాలంట. కేవలం ఆ కార్యంలోనే ఎప్పుడూ పాల్గొంటూ ఉంటే కూడా శరీరం అలసటకు గురవుతుందట. దీని వల్ల మీ వయసు త్వరగా కరిగిపోయి.. మీరు అతి త్వరగా ముసలివారయ్యేలా చేస్తుందట. కాబట్టి మీ లైంగిక జీవితాన్ని చాలా పరిమితంగా చేయడానికి ప్రయత్నించండి.

చేయాల్సిన దానికన్నా..

చేయాల్సిన దానికన్నా..

శుక్ర నీతి ప్రకారం ప్రతి ఒక్క మనిషి తన మనుగడ మరియు జీవనం కోసం ఏదో ఒకపనిని చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఎక్కువగా కష్టపడి పని చేస్తూ ఉంటారు. అలా కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే దీనిని సరైన సమయంలో.. సరైన ప్రదేశంలో చేస్తే ఫలితంగా సానుకూలంగా ఉంటుంది. దీనికి ముందు రెగ్యులర్ గా మీరు ఎక్సర్ సైజ్ చేయాలి. అలా చేయకుండా మీరు ఏదైనా పనిని కష్టపడి చేస్తే, మీరు ప్రతికూల ఫలితాలను పొందాల్సి ఉంటుంది. అంతేకాదు మీ బాడీ కూడా చాలా వేగంగా టైడ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎంత కష్టపడి పని చేయాలో అంతే కష్టపడి. అవసరానికి మించి కష్టపడకండి. అలా చేసినప్పుడు కూడా మీ వయసు త్వరగా కరిగిపోతుంది. మీరు చాలా వేగంగా ముసలివారిలా కనిపించేస్తారు.

English summary

According to Shukra Neeti These Tasks Will Decay Your Age

Check out these things will decay your age based on shukra neeti. Read on.