Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
ఈ 4 రాశుల వారిని ‘ఆ’ విషయంలో నమ్మొచ్చు...!
ఈ రాశుల వారిని సలహాల విషయంలో నమ్మొచ్చట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.
మనం ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటి నుండి బయటపడటానికి ఏవేవో మార్గాలను అన్వేషిస్తాం. అప్పుడు మనకు చాలా దారులు కనిపిస్తాయి.

అయితే అందులో ఏది ఉత్తమమైనది.. ఏది మంచిది కాదు అనే విషయాలను తేల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే మనం ఇలాంటి సందర్భాల్లో అనుభవం ఉన్న వారిని లేదా పెద్దలను సలహాలు, సూచనలు అడగటం వంటివి చేస్తుంటాం.

ఈ నేపథ్యంలో సలహాలు అందరూ ఇస్తారు గానీ.. మనకు నమ్మకమైన వ్యక్తులైతే మంచి సలహాలు ఇస్తారు. అలాంటి వ్యక్తులను కనిపెట్టడం కాస్త కష్టమే. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ 4 రాశుల వారు ఇచ్చే సలహాలను పూర్తిగా నమ్మొచ్చట. ఇంతకీ ఆ రాశుల వారెవరో ఇప్పుడే చూసెయ్యండి...

కన్య రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో నిజాయితీగా ఉంటారు. వీరిని ఏ సమయంలో అయినా సలహాలు అడగొచ్చు. ఎందుకంటే వీరు వాస్తవ విషయాలనే చెబుతారు. మనకు ఏవైనా సాధ్యపడతాయో వాటి గురించి వివరిస్తారు. ముఖ్యంగా వాస్తవాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపుతారు. అయితే వీరు సలహాలు ఇచ్చే సమయంలో కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని తిట్టడం వంటివి చేయొచ్చు. అయితే మీరు దీనికి చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే అది కూడా మీ మంచికే. కాబట్టి సలహాల విషయంలో ఈ రాశి వారు బెస్ట్ అని చెప్పొచ్చు.

తుల రాశి..
ఈ రాశి వారు లైఫ్ విషయంలో చాలా బ్యాలెన్స్ గా ఉంటారు. వీరు నిజ జీవితంలో ఏది బాగుంటుంది.. ఏది బాగుండదు అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తుంటారు. ఏదైనా విషయం గురించి స్పష్టత కోసం మంచి, చెడు రెండు వైపులా ఆలోచిస్తారు. అందుకే ఈ రాశుల వారి సలహాలు ఉత్తమం అని చెప్పొచ్చు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు చాలా మంచిగా మాట్లాడతారు. వీరు ఏదైనా ఉపన్యాసం మొదలుపెట్టారంటే అందరూ వీరి మాటలకు ముగ్దులైపోతారు. వీరితో మీరు ఏదైనా సమస్యల గురించి చెప్పుకుంటే.. వాటికి కచ్చితంగా పరిష్కారం చూపుతారు. అంతేకాదు ఈ రాశి వారు ప్రతీకార ప్రణాళికలను కూడా రూపొందించడంలో సిద్ధహస్తులుగా ఉంటారు.

మకర రాశి..
ఈ రాశి వారికి జీవితంలో ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలనే విషయాలు బాగా తెలుసు. వీరు నిజ జీవితంలో ప్రాక్టికల్ గా ఉంటారు. వాస్తవాల గురించి ఆలోచిస్తారు. వీరు ఏ పని చేసినా గట్టి ప్రయత్నం చేస్తారు. అందుకే చాలా సందర్భాల్లో విజయం సాధిస్తారు. వీరు ప్రతి పనిని చాలా కష్టపడి చేస్తారు. అందుకే వీరు సలహాలు, సూచనల విషయంలో వీరి అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి వీరు ఉత్తమమైన వ్యక్తులని చెప్పొచ్చు.



Click it and Unblock the Notifications
