For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu : ఈ రాశుల వారికి షేర్ మార్కెట్లో లాభాలు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, అశ్వీయుజ మాసంలో గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -07 October 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Monthly Horoscope: అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...Monthly Horoscope: అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీకు అసౌకర్యం కలిగించే పరిస్థితులను నివారించాలి. మిమ్మల్ని మీరు సానుకూలంగా ఉంచుకోండి. మీరు వాదనల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి, లేకుంటే మీరు మాత్రమే బాధపడొచ్చు. మిమ్మల్ని ప్రతికూలంగా భావించే మరియు మానసిక ఒత్తిడిని కలిగించే వ్యక్తుల సహవాసంలో ఉండకండి. విద్యార్థులు స్వయంక్రుషితో మెరుగవుతారు. ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచిగా ఉంటుంది. మీ శ్రేయస్సును నిజంగా కోరుకునే వ్యక్తులతో ఉండండి. పెద్దల అంగీకారంతో ఏదైనా ముఖ్యమైన విషయంలో ముందడుగు వేయాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశ వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. దీని వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. సన్నిహితుడు లేదా కుటుంబ సభ్యుడి నుండి మీరు ఈ ప్రయోజనాన్ని పొందుతారు. వ్యాపారులకు మెరుగ్గా ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. మీరు స్థిరాస్తిని కొనుగోలు చేయొచ్చు. ఈ అవకాశం మిమ్మల్ని దాటిపోనివ్వవద్దు. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగం మెరుగుపరచడానికి పని చేయండి. ఈరోజు మీరు మీ గత అనుభవంతో మరొకరికి కూడా సహాయపడగలరు. పెట్టుబడికి ఈరోజు మంచి రోజు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి ఉదయం 11:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు విదేశీ ప్రయాణం చేయకూడదు. స్వదేశీ ప్రయాణాలు చేయొచ్చు. అయితే కేవలం కుటుంబ సభ్యులతోనే చేయాలి. స్నేహితులతో ఈరోజు విహార యాత్రలు చేస్తే ప్రమాదాలు సంభవించొచ్చు. ఉద్యోగులకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. మీకు కార్యాలయంలో పోటీ పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉంటుంది. న్యాయవాదులకు, వైద్యులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలను కూడా విస్మరించడం నేర్చుకోండి. దుర్గాదేవి అష్టోత్తరం చేయాలి.

లక్కీ కలర్ : లైట్ బ్లూ

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

అక్టోబర్ నెలలో 4 గ్రహాల తిరోగమనం.. ఈ రాశులకు ఆర్థిక రంగంపై ప్రభావం...! అక్టోబర్ నెలలో 4 గ్రహాల తిరోగమనం.. ఈ రాశులకు ఆర్థిక రంగంపై ప్రభావం...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు సామాజికంగా ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ పాత స్నేహితులతో కలవొచ్చు. వారితో సరదాగా సమయం కూడా గడపొచ్చు. ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మీ ఇంట్లో వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగం చేసే వ్యక్తులు పని రంగంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యతను పాటించాలి. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించడం నేర్చుకోండి. విద్యార్థులకు, ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లో పని చేసే వారికి లాభం రావొచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో ఓపికగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో మీ భాగస్వామితో మీ సంబంధం మళ్లీ మెరుగుపడే అవకాశం ఉంది. మీరు మీ హృదయం నుండి ప్రయత్నిస్తే, మీ సంబంధం తిరిగి ట్రాక్‌లోకి వస్తుంది. సంబంధంలో స్వాభావికత మరియు కోల్పోయిన మెరుపు తిరిగి రావడం మీరు చూస్తారు. ఈరోజు మీ ఇద్దరి మధ్య అన్ని అపార్థాలు తొలగిపోతాయి. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు సానుకూల శక్తితో ముందుకు వెళ్తారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాల వల్ల లాభం కలుగుతుంది. షేర్ మార్కెట్లో పని చేసే వారికి శుభప్రదంగా ఉంటుంది. విదేశీ విద్యకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు లాభాలు వచ్చే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా విజయం సాధించొచ్చు. మీరు ముందుకు వెళ్లే మార్గం గురించి ఆలోచిస్తారు. ఈరోజు మీరు మీ రాబోయే లక్ష్యాలను పరిగణించవచ్చు. భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేయడం చాలా ముఖ్యం. కానీ మీరు మీ కోసం పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదని గుర్తుంచుకోండి. ఎందుకంటే అవి నెరవేరకపోతే మీరు బాధపడతారు. ఈరోజు మీరు మీ ముఖ్యమైన పనిని కూడా పరిష్కరించొచ్చు. ఉద్యోగులు తమ ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తుంటే సమయం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ఈ రాశుల వారు ఉత్తమ బాయ్ ఫ్రెండ్స్ గా ఉంటారట... ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి..!ఈ రాశుల వారు ఉత్తమ బాయ్ ఫ్రెండ్స్ గా ఉంటారట... ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి..!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. వైద్యులకు, న్యాయవాదులకు మంచిగా ఉంటుంది. వ్యాపారులు ఊహించిన లాభాలు పొందుతారు. మీ స్నేహపూర్వక స్వభావం కారణంగా ప్రజలు మీ చుట్టూ ఉంటారు. ఈరోజు మీరు చేయవలసిన పని చాలా ఉంటుంది. దీని వలన మీరు కూడా కలత చెందవచ్చు. మీరు సహనంతో పనులను చేయాలి. నిర్వహించాలి. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆనంద ప్రవాహం కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులకు మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారుల నుండి కొంత మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు సంతోషంగా మరియు తేలికపాటి మానసిక స్థితిలో ఉంటారు. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించగలుగుతారు. ఇది మీరు మానసికంగా ఎంత బలంగా ఉన్నారో చూపుతుంది. మీరు ప్రణాళికతో మీ రోజును ప్రారంభించండి. కళాకారులకు, వ్యాపారులకు ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీరు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ఈరోజు మీరు ఏదైనా విందు కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈరోజు మీరు కొంత దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు ఆఫీసు పని కోసం బయటకు వెళ్లాల్సి రావొచ్చు. ఈ ప్రయాణం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్ కొత్త దిశను పొందొచ్చు. ఈరోజు గ్రహాల కదలిక మీకు పూర్తి మద్దతు ఇస్తుంది. మీరు మీ ప్రాముఖ్యతను ప్రజలకు విజయవంతంగా తెలియజేయగలరు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో మీ భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే శుభప్రదంగా ఉంటుంది. శివనామ స్మరణ చేయడం వల్ల సానుకూల ఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్స్ : 1,8

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు. ఈరోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఈరోజు మీరు ప్రారంభించే పనిలో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. ప్రజలకు సహాయం చేయడానికి మీరు కూడా ముందుంటారు. మీ ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది.

లక్కీ కలర్ :పర్పుల్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు కొన్ని రకాల భావోద్వేగాలను అనుభవించవచ్చు. తులారాశిలో చంద్రుడు ఉండటం వలన, మీకు మానసిక కల్లోలం ఉండొచ్చు. ఉద్యోగులకు ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులకు నష్టం రావొచ్చు. విద్యార్థులకు విద్యలో అడ్డంకులు రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు నష్టం కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఈరోజు మీరు ఏదైనా సమస్యపై ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి. లేదంటే మరింత గందరగోళానికి గురవుతారు. ఈరోజు మీకు మానసిక విశ్రాంతి ఇవ్వండి. మీకు సంతోషాన్ని కలిగించే పనిని ఈరోజు చేయండి. మీరు పాటలు వినొచ్చు. డ్యాన్స్ చేయవచ్చు. ఈరోజు శుభ ఫలితాలు రావడానికి కాకికి ఆహారం ఇవ్వండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి ఉదయం 11 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఉండదు. మీరు చిన్న విషయాలపై కోపం తెచ్చుకోవచ్చు. ఈరోజు మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ పనిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న శత్రువు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నిర్లక్ష్యానికి దూరంగా ఉండాలి. మీరు ఓపికగా పని చేయండి. త్వరలో సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ బలహీనతలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఈరోజు ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండండి. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడటం వల్ల మీరు ఆనందాన్ని పొందుతారు. రాజకీయ రంగంలో ఉండే వారికి ఎదుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 7:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -07 October 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Wednesday, October 6, 2021, 18:49 [IST]
Desktop Bottom Promotion