For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి వ్యాపారులు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Lunar Eclipse May 2022 Astrology :ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వేళ ఈ రాశులకు చాలా కష్టాలు...!Lunar Eclipse May 2022 Astrology :ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వేళ ఈ రాశులకు చాలా కష్టాలు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సహోద్యోగులతో అహంకారం మరియు ఘర్షణకు దూరంగా ఉండాలి. అనవసరమైన కోపం ఈరోజు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉండొచ్చు. ఈరోజు మీరు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం గురించి మాట్లాడటానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోవచ్చు. వ్యాపారులు ఈరోజు పెద్దగా ఆర్థిక లావాదేవీలు చేయొద్దు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీకు తోబుట్టువులతో ఈరోజు చాలా సరదాగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. మీ మానసిక స్థితి బాగా ఉండదు. మీ ఆరోగ్యం ఈరోజు మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు మీరు ఇటీవల ఏదైనా పెద్ద మార్పులు చేసినట్లయితే, మీరు ఆశించిన ఫలితాలను పొందొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉండొచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :30

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 11 గంటల వరకు

Mercury Retrograde in Taurus : బుధుడి తిరోగమనంతో ఈ రాశులకు ఇబ్బందులు.. మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు..Mercury Retrograde in Taurus : బుధుడి తిరోగమనంతో ఈ రాశులకు ఇబ్బందులు.. మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు..

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. కొన్ని శుభవార్తలు వినడం వల్ల మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు ప్రియమైన వారితో మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ సోదరునితో మీ సంబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యను పొందడానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే, మీరు విజయం సాధించడానికి బలమైన అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు ప్రమాదకర నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. బాస్ మిమ్మల్ని మెచ్చుకోవాలంటే, మీ పనితీరును మెరుగుపరచుకోవాలి. మీరు ప్రతి ఒక్క చిన్న పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకోకుండా ఉండాలి. మీరు ఆలోచించకుండా వ్యాపార నిర్ణయం తీసుకుంటే, భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీరు కోరుకున్న బదిలీని పొందొచ్చు లేదా ప్రమోషన్ రావొచ్చు. మరోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికి పనిభారం పెరుగుతుంది. మీరు కష్టపడి పని చేయడానికి నిరాకరిస్తే, మీ పురోగతి కల ఆగిపోతుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

Vastu Tips for Wallet:మీ పర్సులో ఇవి ఉంటే వెంటనే పడేయండి... ఎందుకంటే డబ్బు సమస్యలు పెరుగుతాయట..Vastu Tips for Wallet:మీ పర్సులో ఇవి ఉంటే వెంటనే పడేయండి... ఎందుకంటే డబ్బు సమస్యలు పెరుగుతాయట..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఈరోజు చాలా మంచి రోజు. మీరు చాలా కాలంగా అన్వేషిస్తున్న ఉద్యోగం గురించి శుభవార్తలు వినొచ్చు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం ప్రయ్నతిస్తున్న వ్యక్తులకు సానుకూల ఫలితాలొస్తాయి. మరోవైపు వ్యాపారులకు పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు సోమరితనాన్ని విడిచిపెట్టి మీ పనులన్నింటినీ పూర్తి చేయాలి. మీరు ఏదైనా పనిని పెండింగులో ఉంచితే, దాని తప్పుడు ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ తల్లిదండ్రులతో సంబంధం బలంగా ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు కండరాల నొప్పితో ఇబ్బంది పడొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో మందుల వ్యాపారం చేసే వారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. మీరు మీ పనులన్నింటినీ శ్రద్ధగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదను పొందొచ్చు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో అదనపు సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం విషయానికొస్తే దంత సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు పనిలో ఎక్కువగా అనుభూతి చెందరు. కాబట్టి మిమ్మల్ని మీరే నియంత్రించుకోవడం మంచిది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే సన్నిహితులను సంప్రదించాలి. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :13

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో కొందరు పనికి సంబంధించి ఈరోజు మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల ఉంటుంది. అయితే మీరు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు పెరగొచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : సాయంత్రం 4:40 నుండి రాత్రి 10:05 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో సేల్స్ మరియు మార్కెటింగ్ కి సంబంధించి పని చేసే వ్యక్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు మీరు కొన్ని గొప్ప విజయాలు పొందొచ్చు. వ్యాపారులు ఈరోజు పెద్ద క్లయింట్లతో వ్యవహరించే అవకాశాన్ని పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -11 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Tuesday, May 10, 2022, 19:36 [IST]
Desktop Bottom Promotion