Today Rasi Phalalu :ఓ రాశి వారికి ఈరోజు బాధ్యతల భారం పెరగొచ్చు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -16 June 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ పనికి సంబంధించిన పెద్ద సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, వ్యాపారం చేసే వ్యక్తులు మంచి అవకాశాన్ని పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఈరోజు కొంత షాపింగ్ కూడా చేయొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే టీ, కాఫీని తక్కువగా తీసుకోవాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :31

లక్కీ టైమ్ :మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. పని గురించి మాట్లాడినట్లయితే, మీ పెండింగ్ పనిని పూర్తి చేయొచ్చు. ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. మీ సానుకూలత మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఇంటి పెద్దలు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి మీరు ఈ రోజు ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీ చేయబోతున్నట్లయితే, తొందరపడకండి. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ :25

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పిల్లల వైపు నుండి సంతోషం వస్తుంది. ఈరోజు మీరు పిల్లల విద్యకు సంబంధించిన ఏదైనా పెద్ద ఆందోళన నుండి బయటపడొచ్చు. మీరు విద్యార్థి అయితే మరియు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే, ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన ఏ విషయంలోనూ తొందరపడొద్దు. తెలివిగా ఖర్చు చేస్తే మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులు పెద్ద లాభాలను పొందగలుగుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిది కాదు. అజాగ్రత్తగా ఉండకపోవడమే మంచిది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :34

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండాలి. మీరు ఈరోజు పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీరు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో ఎక్కువగా జోక్ చేయడం మానుకోవాలి. మీ ఈ అలవాటు ఈరోజు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి మాటలను పట్టించుకోకుండా తప్పు చేయకండి. మీరు మీ ప్రియమైన వారిని అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ :సాయంత్రం 5:05 నుండి రాత్రి 8:55 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో నిరుద్యోగులు ఎన్నో ప్రయత్నాలు చేసినా మీకు విజయం లభించనట్లయితే, మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. వ్యాపారులు ప్రమాదకర నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో ఏదైనా రిస్క్ తీసుకోవడం మీ వ్యాపారానికి మంచిది కాదు. ఈరోజు మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీకు కొందరు కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ :ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. మీరు ఇటీవల ఏదైనా నష్టాన్ని చవిచూస్తే, ఈరోజు మీరు దానిని భర్తీ చేయడానికి మంచి అవకాశాన్ని పొందొచ్చు. ఇది కాకుండా, మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే, మీ ప్రియమైనవారి సలహా నుండి మీరు గొప్పగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగస్తులకు పురోభివృద్ధికి అవకాశం ఉంది. విదేశీ కంపెనీల్లో పనిచేసే వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ :ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో బట్టలు మరియు మందుల వ్యాపారం చేసే వారికి ఈరోజు చాలా లాభదాయకమైన రోజు. అయితే, మీపై బాధ్యతల భారం కూడా పెరుగుతుంది. మీరు దీని కోసం ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది. మరోవైపు, ఉద్యోగస్తులు కార్యాలయంలో కొంత గొప్ప గౌరవాన్ని పొందవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు సానుకూల భావాన్ని కూడా అనుభవిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో మీకు వాగ్వాదం ఉండొచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు వారి ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. త్వరలో డబ్బుకు సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. మరోవైపు ఈరోజు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతాయుతమైన పనిని అప్పగించినట్లయితే, మీరు అజాగ్రత్తగా ఉండకూడదు. లేకుంటే మీ పురోగతి ఆగిపోవచ్చు. మరోవైపు ఈరోజు వ్యాపారులు వృథాగా పరుగులు తీయాల్సి వస్తుంది. న్యాయపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. నిలిచిపోయిన డబ్బు రాకపోవడంతో ఈరోజు మీరు చాలా ఆందోళన చెందుతారు. అయితే, మీ ఈ సమస్య త్వరలో తొలగిపోతుంది, కాబట్టి మీరు ఎక్కువ ఒత్తిడికి దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు. మీకు ఆర్థరైటిస్ సమస్య ఉంటే, ఈరోజు మీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో చాలా బాగుంటుంది. మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. దీంతో మీ మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో సమయం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఆఫీస్‌కు ఆలస్యంగా చేరుకోవడం మానుకోవాలి. అంతేకాకుండా, మీకు ఇచ్చిన బాధ్యతను ఎటువంటి పొరపాటు లేకుండా సమయానికి నెరవేర్చడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారులకు ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు పెద్ద లాభాలను ఆశించినట్లయితే, ఈరోజు మీరు నిరాశ చెందవచ్చు. ఇది కాకుండా, మీ యొక్క ఏదైనా ముఖ్యమైన పనికి కూడా ఆటంకం కలగొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో బాస్ మరియు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీరు మీ పనులన్నింటినీ శ్రద్ధగా పూర్తి చేస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రులతో మీ అనుబంధం మెరుగుపడుతుంది. మీరు కష్టాల్లో వారి మద్దతు పొందుతారు. అవసరానికి మించి ఖర్చు చేయడం మంచిది కాదు. ఇది మీ భవిష్యత్తు ప్రణాళికలకు ఆటంకం కలిగించొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ వంటి సమస్యలు ఎదురుకావొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నత స్థానంలో పనిచేస్తున్నట్లయితే, ఈరోజు మీరు మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనవసరమైన కోపం మీకు మంచిది కాదు. వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది, ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం పొందొచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు మీ దినచర్యలో యోగా మరియు ధ్యానాన్ని చేర్చుకోవాలి.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ :సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో ఎక్కువ పని భారం ఉంటుంది. అయితే మీరు ప్రశాంతమైన మనస్సుతో పని చేయడం మంచిది. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల మీ పనితీరు దెబ్బతింటుంది. అలాగే, ఇది మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. వ్యాపారులకు ఈరోజు చాలా శుభఫలితాలొస్తాయి. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మరోవైపు కుటుంబంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలను విస్మరించడం ద్వారా, మీరు మీ ఇంటి శాంతిని కాపాడుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Thursday, June 16, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion