For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు తెలివైన నిర్ణయాన్ని తీసుకోవాలి...

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీకు సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో విభేదాలు ఉండొచ్చు. వ్యాపారులు ఈరోజు ప్రమోషన్లపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ కోసం కొత్త మార్గాలు తెరవబడతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : ఉదయం 5:10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ప్రతి నిర్ణయాన్ని చాలా తెలివిగా తీసుకోవాలి. ఇంట్లో లేదా ఆఫీసులో తొందరపడి ఏ పనులు చేయకండి. మీకు అదనపు బాధ్యతలు ఉంటే జాగ్రత్తగా పని చేయాలి. లేదంటే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీ పనితీరు కూడా క్షీణిస్తుంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి చాలా మంచి ఫలితాలు రావొచ్చు. మీరు కోరుకున్న ఉద్యోగం పొందడానికి బలమైన అవకాశం ఉంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారులు ఈరోజు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఇది మీ సమయాన్ని మరియు డబ్బును మాత్రమే వ్రుథా చేస్తుంది. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారితో చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అజాగ్రత్తగా ఉండొద్దు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :2

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

Mangal Gochar 2022:కుజుడు మీనంలోకి ప్రవేశం.. ఈ రాశులకు చాలా అదృష్టం..!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. అయితే మీరు మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు మీ పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. వ్యాపారులు మీ నిర్ణయాలను తెలివిగా తీసుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు ఇంటి సభ్యుల నుండి సకాలంలో మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆరోగ్య పరంగా మీరు కండరాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఉద్యోగులకు కార్యాలయంలో స్థానం బలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు రావొచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన పనులు చేసే వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :22

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు గ్రహాల ప్రతికూల ప్రభావాల వల్ల కొంత కల్లోలం ఏర్పడుతుంది. ఈరోజు మీరు కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. వ్యాపారులు కొంత సొమ్ము నష్టపోవచ్చు. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఎక్కువ ఖర్చులు చేయడానికి అనుకూలంగా ఉండదు. ఆరోగ్యంగా ఉండేందుకు మీ దినచర్యలో యోగా మరియు ధ్యానం చేర్చుకోవాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృషభంలో బుధుడి అస్తమయం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈరోజు విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు ప్రైవేట్ ఉద్యోగులకు ఈరోజు మెరుగ్గా ఉంటుంది. చిరు వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే, మీరు వాటికి పరిష్కారాలను కనుగొనేందుకు ప్రయత్నించాలి. మీరు అనవసరంగా ఆందోళన చెందడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. మీ సమస్యలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:05 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో ఉన్నత స్థానంలో పని చేస్తుంటే, మీ కింది స్థాయి సిబ్బందితో సరిగ్గా ప్రవర్తించాలి. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం మానుకోండి. ఈరోజు మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆహారం మరియు పానీయాలకు సంబంధించిన పనులు చేసే వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. వ్యాపారులకు ఈరోజు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో బంధం బలపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా మంచి సంకేతాలొస్తాయి. ఈరోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు అలసటతో కూడిన రోజు అవుతుంది. పెండింగులో ఉన్న పనుల జాబితా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే, మీరు తెలివిగా ఖర్చు చేయాలి. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. అనవసర విషయాల గురించి ఖర్చు చేయడం మానుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో మంచి విజయాన్ని పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదలకు బలమైన అవకాశం ఉంది. ఉద్యోగులు ఆఫీసులో బాస్ మద్దతు పొందుతారు. వ్యాపారులకు ఈరోజు కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :41

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీకు మరపురాని రోజుగా మిగిలిపోతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు డబ్బు విషయంలో తొందరపడకుండా ఉండాలి. మీరు బాగా ఆలోచించిన తర్వాతే పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ అమ్మకాలలో ఆకస్మిక పెరుగుదల కారణంగా, మీరు మంచి లాభాలను పొందొచ్చు. ఈరోజు మీరు సానుకూలతను అనుభవిస్తారు. ఈరోజు మీరు వ్యాపార నిర్ణయాలన్నీ చాలా తెలివిగా తీసుకుంటారు. మరోవైపు ఉద్యోగులు ఈ కాలంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు మీ ఖర్చుల జాబితాను తగ్గించినట్లయితే, త్వరలో మంచి ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి ఉదయం 11 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -18 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published: Wednesday, May 18, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion