Today Rasi Phalalu :ఓ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపార నిర్ణయాల్లో తొందరపడొద్దు..

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు మీ వ్యక్తిగత జీవితంపై కూడా శ్రద్ధ వహించే అవకాశాన్ని పొందొచ్చు. మీరు స్నేహితుల నుండి కొన్ని మంచి సలహాలను కూడా పొందొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు మీరు మీ తోబుట్టువులతో చాలా సరదాగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ ఇంట్లో లేదా ఆఫీసులో మీకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడొచ్చు. వ్యాపారులకు ఈరోజు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మీరు చాలా నిరాశకు గురవుతారు. మీరు మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడపలేకపోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు రావొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో కలప వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. మీ పనులేవైనా చాలా నిలిచిపోయినట్లయితే, ఈరోజు పూర్తి చేస్తారు. దీంతో మీకు ఆర్థిక పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో ఏ పనిపైనా సరిగ్గా ఫోకస్ పెట్టలేరు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయాలలో తొందరపడకూడదు. మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. లేదంటే మీరు భవిష్యత్తులో చాలా నష్టపోవాల్సి వస్తుంది. వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో మంచి విజయాన్ని పొందొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. మీరు సానుకూలతను అనుభవిస్తారు. ఈరోజు మీరు మీ అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు మీ అన్వేషణ ముగియవచ్చు. మీ ఇంటి వాతావరణం బాగా ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సహోద్యోగుల పనిలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీరు మీ పనితీరును మెరుగుపరుచుకోవడం మంచిది. వ్యాపారులు ఈరోజు ఆర్థికంగా నష్టపోవాల్సి రావొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులు ఉంటాయి. మీకు కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :2

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో భాగస్వామితో వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకుంటే, అనుభవం ఉన్న వారి సలహాను తప్పకుండా తీసుకోవాలి. పని చేసే వ్యక్తులపై పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రశాంతమైన మనసుతో పనులన్నింటినీ సమయానికి పూర్తి చేయాలి. ఈరోజు ఉన్నతాధికారులు కూడా మీరు చేసిన పనికి సంతోషిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈరోజు మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించొచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మరోవైపు ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధించిన కొంత సమాచారాన్ని వారితో పంచుకోవడం మానుకోండి. రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. వ్యాపారులు ఈరోజు కొత్త వ్యక్తులతో కలిసి పని చేయబోతున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు తల్లిదండ్రులతో మంచి అనుబంధం ఉంటుంది. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు వారి కష్టానికి తగిన ఫలాలను పొందొచ్చు. ఈరోజు బాస్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. చిరు వ్యాపారులకు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు పెట్టుబడి పెట్టేందుకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు భాగస్వామ్యంతో కొంత పని చేయబోతున్నట్లయితే, మీ మార్గంలో కొన్ని అడ్డంకులు రావొచ్చు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో చాలా కష్టపడాల్సి రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు.

లక్కీ కలర్ : లైట్ బ్లాక్

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి ఉదయం 10:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ ప్రియమైన వారి మద్దతు పొందడం ద్వారా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. అవివాహితులకు ఈరోజు మంచి వివాహ సంబంధం రావొచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో పారదర్శకంగా ఉండాలి. మీరు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. మీరు ఎలాంటి ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పనితీరుతో బాస్ సంతోషిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. అయితే ఎక్కువ ఖర్చు చేయకండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :34

లక్కీ టైమ్ : ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే మీరు మీ అవగాహనతో ఈ కష్టాన్ని అధిగమించగలుగుతారు. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో చాలా బిజీగా ఉంటుంది. ఇది కాకుండా, ఈరోజు మీరు పనికి సంబంధించి కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులతో సమయం గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఉత్సాహం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు ఎలాంటి అజాగ్రత్త వహించొద్దు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Saturday, May 21, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion