For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది..!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Venus Transit in Aries:మేషంలోకి శుక్రుని రవాణాతో ఈ రాశులకు సంపద పెరుగుతుందట...!Venus Transit in Aries:మేషంలోకి శుక్రుని రవాణాతో ఈ రాశులకు సంపద పెరుగుతుందట...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు చర్చలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, ఒకర్ని సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోండి. అనవసరమైన గొడవలు మీ వ్యాపారంలో పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. ఉద్యోగులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఆఫీసులో మీకు కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 8:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మిశ్రమ ఫలితాలొస్తాయి. వ్యాపారులు ఈరోజు పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఆఫీసులో బద్ధకాన్ని వదిలేసి, తమ పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఈరోజు కోరుకున్న లాభాలను పొందొచ్చు. మరోవైపు, ఆన్ లైన్ వ్యాపారం చేసే వారికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు పెద్ద ప్రాజెక్టులో పని చేసే అవకాశం లభిస్తుంది, కాబట్టి మీరు కష్టపడి పని చేయాలి. ఆర్థికపరంగా ఈరోజు ఖరీదైనది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో శారీరకంగా మరియు మానసికంగా మెరుగ్గా ఉంటారు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఒకేరోజున మూడు పండుగలు.. ఈరోజున దేవుడిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట...!30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఒకేరోజున మూడు పండుగలు.. ఈరోజున దేవుడిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలి. మీరు మీ విలువైన సమయాన్ని వృథా చేయకండి. వ్యాపారులకు ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనిలో ప్రభుత్వ అడ్డంకులు ఉంటే, ఈరోజు మీ సమస్య పరిష్కరించబడుతుంది. మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయానికొస్తే, ఈరోజు మీకు వెన్ను లేదా నడుముకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :8

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే సానుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఇటీవల మీరు ఏదైనా పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే ఈరోజు సానుకూల సమాధానం వచ్చే అవకాశం ఉంది. త్వరలో మీ కెరీర్ కొత్త దిశలో పయనిస్తుంది. వ్యాపారులకు ఈరోజు చాలా ఖరీదైన రోజు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ సంబంధం కూడా బలపడుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఇంటికి అకస్మాత్తుగా బంధువులు రావొచ్చు. ఉద్యోగులు ఆఫీసులో ఈరోజు ఎక్కువగా మాట్లాడటం మానుకోవాలి. వ్యాపారులు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక నిర్ణయాలు ఆలోచించకుండా తీసుకోకండి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు కష్టాల్లో వారి మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :31

లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

Shukra Gochar May 2022:మేషంలోకి శుక్రుని ప్రవేశంతో..ఈ రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది...!Shukra Gochar May 2022:మేషంలోకి శుక్రుని ప్రవేశంతో..ఈ రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు ప్రశాంతమైన మనసుతో పని చేస్తారు. ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు ఆర్థిక పరిస్థితిలో బలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ భాగస్వామితో ఆనందంగా గడపడానికి అవకాశం పొందొచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో చాలా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రావి వారిలో ఉద్యోగులు కార్యాలయంలోని నియమాలను కచ్చితంగా పాటించాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. ఇనుము వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్థిక పరమైన విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే, నిరాశకు గురవుతారు. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు శుభ ఫలితాలొస్తాయి. మీరు కోరుకున్న ప్రమోషన్ పొందొచ్చు. వస్త్ర వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు రావొచ్చు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈరోజు షాపింగుకు వెళ్తే, డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. మరోవైపు ఉద్యోగులు ఈరోజు చాలా ఎక్కువ సమయం కష్టపడాలి. ఈరోజు మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. మీ మనసులో అనేక ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. వ్యాపారులకు ఈరోజు ప్రగతి బాటలు తెరచుకుంటాయి. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, ఎక్కువ ఒత్తిడి పెంచుకోవద్దు.

లక్కీ కలర్ : కుంకుమ పువ్వు

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా పని చేస్తే, మీ కష్టమైన పనులు కొన్ని సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో ఉన్నతాధికారుల మద్దతు కూడా లభిస్తుంది. మరోవైపు, వ్యాపారవేత్తలు ఆర్థిక పరిమితుల నుండి బయటపడగలరు. ఈరోజు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్టే. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు ఆరాధనలో చాలా మంచి అనుభూతి చెందుతారు. మీరు ఈరోజు అవసరమైన వారికి సహాయం చేయొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి ఉపశమనం పొందొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:25 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -24 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Monday, May 23, 2022, 23:00 [IST]
Desktop Bottom Promotion