Today Rasi Phalalu : ఓ రాశి నిరుద్యోగులకు ఉద్యోగావకాశం...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, శ్రావణ మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -25 August 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ కోపాన్ని నివారించాలి. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి పనులను చేయకండి. ఉద్యోగులు ఆఫీసులో బద్దకాన్ని తగ్గించుకోవాలి. ఈరోజు మీకు ఎక్కువ పనిభారం ఉండొచ్చు. మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. బట్టలు మరియు ధాన్యాల వ్యాపారులు మంచి లాభాలను పొందొచ్చు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, కారంగా ఉండే ఆహారాన్ని నివారించాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ప్రయత్నాలను ఆపొద్దు. త్వరలో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఆఫీసులో ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. మీ పనితీరు చాలా ప్రశంసించబడుతుంది. మీకు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. రిటైల్ వ్యాపారులు మంచి ఆర్థిక లాభాలు పొందొచ్చు. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు కొత్త అవకాశాన్ని పొందొచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. అదే జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. చిన్న విషయాలపై వాదనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు టార్గెట్ బేస్ పని చేస్తుంటే.. ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది. మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. మరోవైపు, మీరు నిరుద్యోగి మరియు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు మీరు నిరాశకు గురవుతారు, కానీ మీరు ప్రయత్నిస్తూనే ఉంటే, మీరు త్వరలో విజయం సాధించొచ్చు. భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు మిశ్రమ ఫలితాలను రావొచ్చు. మీరు వ్యాపారంలో ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తుంటే, తొందరపడకండి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు తమ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆఫీసులో మీ పనులను సకాలంలో పూర్తి చేయండి. అలాగే తప్పులు చేయకుండా ఉండండి. ఈరోజు బాస్ మీ పనిని సమీక్షించొచ్చు. వ్యాపారవేత్తలు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించడాన్ని నివారించాలి. లేకుంటే ఈరోజు మీరు నష్టపోవచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంటి సభ్యులతో మీ సంబంధం బాగుంటుంది. తండ్రి వైపు నుండి ఆర్థిక లాభం సాధ్యమవుతుంది. మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, ఈ రోజు మీరు మీ తండ్రి సలహా నుండి మంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. మీరు వివాహం చేసుకుంటే, మీ వైవాహిక జీవితంలో అసమ్మతి ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామిని అనవసరంగా అనుమానించడం మానుకోండి. ఒకరిపై ఒకరు మీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. పనికి సంబంధించి మీరు సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు. రాబోయే రోజుల్లో మీరు ఈ ప్రయాణంలో మంచి ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలను పొందవచ్చు. జీతం తీసుకునే వ్యక్తులు కార్యాలయంలో వారి పురోగతి సంకేతాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా, ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మరోవైపు మీరు మీ ప్రియమైనవారి పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా అదృష్టవంతమైన రోజు కానుంది. మీరు గొప్ప పురోగతిని సాధించగలరు. అలాగే, మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి ఫలితాలు పొందొచ్చు. మీ వ్యాపారం కొత్త దిశలో సాగుతుంది. ఈరోజు మీరు కొత్త అవకాశాన్ని పొందొచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందొచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఒకరిపై ఒకరికి విశ్వాసం బలపడుతుంది. అలాగే మీ ప్రేమ కూడా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు విలువైన వస్తువులను కొనాలనుకుంటే, ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి సాయంత్రం 5 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ కృషి విజయవంతం అయ్యే బలమైన అవకాశం ఉంది. మరోవైపు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీకు ఆఫీసులో కొన్ని ముఖ్యమైన పనులు అప్పగించొచ్చు. ఇది కాకుండా, బాస్ నుండి మీటింగ్ కోసం కాల్ పొందడానికి బలమైన అవకాశం ఉంది. చిన్న వ్యాపారవేత్తలు మంచి ఆర్థిక లాభాలను పొందగలరు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు ఇంటి పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఈరోజు జీవిత భాగస్వామి మానసిక స్థితి చాలా బాగుంటుంది. వారు మీతో ఎక్కువ సమయం గడపాలని డిమాండ్ చేయవచ్చు. మరోవైపు ఆర్థిక పరంగా ఆందోళనలు పెరగొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో గొప్ప ఉపశమనం కలగొచ్చు. ఎందుకంటే గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. మీరు మీ పనితీరులో పెద్ద మెరుగుదలను చూడొచ్చు. మరోవైపు, వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటులో ఆర్థిక లావాదేవీలు చేయకండి. లేదంటే మీకు నష్టం ఎదురవుతుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పని చేస్తుంటే.. ఈరోజు మీరు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించి పనిచేసే వ్యక్తులు కూడా ఈరోజు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల పెండింగ్ పని పూర్తవుతుంది. అలాగే సహోద్యోగులతో మీ అనుబంధం మెరుగుపడుతుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో విబేధాలు ఉండొచ్చు. అయితే, త్వరలోనే ప్రతిదీ సాధారణ స్థితికి వస్తుంది. మీ ప్రియమైనవారి భావాలను మీరు అర్థం చేసుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు మీరు కొత్త బట్టలు లేదా ఆభరణాల కోసం కూడా షాపింగ్ చేయవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం తగ్గొచ్చు. ఇది మీ పనిని కూడా ప్రభావితం చేయొచ్చు. ఈరోజు ఆఫీసులో మీ ముఖ్యమైన కొన్ని పనులు అసంపూర్తిగా ఉంటాయి. దీని కారణంగా ఉన్నతాధికారులు చాలా అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారవేత్తలు ఈరోజు మంచి లాభాలు పొందొచ్చు. పెద్ద లాభాల కోసం చిన్న లాభాలను విస్మరించొద్దు. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు వారితో తగినంత సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇంటి పెద్దలు మీకు ఏవైనా సలహాలు ఇస్తే, మీరు దానిని తప్పకుండా పరిగణించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే మీరు పొదుపుపై ​​ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఔషధ వ్యాపారులు పెద్ద ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆహార పదార్థాల వ్యాపారం చేసే వ్యక్తులు కూడా మంచి లాభాలు పొందొచ్చు. అయితే, మీరు పరిశుభ్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీరు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందొచ్చు. కొత్త ఆదాయ వనరు పొందడానికి బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ఇంటి పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి చాలా రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా ఫ్రెష్‌గా మరియు శక్తివంతంగా ఉంటారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 4:40 నుండి రాత్రి 10:05 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వివాదాల సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఉంటుంది. అయితే, మీరు మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలి. మీరు ఆఫీసులో మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. సహోద్యోగుల లోపాలను బయటకు తీయడం మానుకోండి. అలాగే వారితో ఎక్కువగా కబుర్లు చెప్పకపోవడమే మంచిది. ఫర్నిచర్‌కు సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తులు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Wednesday, August 25, 2021, 5:00 [IST]
Desktop Bottom Promotion