Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో ధనస్సు రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!

శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం చూస్తుండగానే హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర మాసంలో ఫ్లవ నామ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. అప్పుడే ఉగాది పండుగ కూడా వెళ్లిపోయింది. శ్రీరామ నవమి పండుగను కూడా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం.

Ugadi Rashi Phalalu 2021 : Dhanasu rasi (Sagittarius)Ugadi Horoscope in Telugu

ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉంటుంది.. ఏయే గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయా.. లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తాయా.. గత ఏడాది మాదిరిగానే సమస్యలు వెంటాడతాయా.. అనే వివరాలతో పాటు ప్రతి నెలా మీ జాతకం ఎలా ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్..

ఏప్రిల్..

ఈ రాశి వారికి తొలి నెలలో ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఈ కారణంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే వ్యాపారులకు ఆశించిన విధంగానే ఫలితాలు దక్కుతాయి. సంతాన పరంగా జంటలు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. మూడో వారంలో మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మే..

మే..

ఈ నెలలో మీకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సమయానికి ఆదాయం లభిస్తుంది. రెండో వారంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మూడో వారంలో కూడా మీకు ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులకు మాత్రం లాభాలొచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు పదవుల కోసం తీవ్రంగా శ్రమించాలి. మీరు ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరమవుతాయి. మీరు చేసిన పనులు హడావిడిగా పూర్తవుతాయి.

జూన్..

జూన్..

ఈ నెలలో ధనస్సు రాశి వారికి మంచిగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా ఆదాయం లభిస్తుంది. వ్యాపారులకు ప్రోత్సాహాకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో ఆకస్మాత్తుగా కొన్ని శుభకార్యాలు నిర్వహించొచ్చు.

జులై..

జులై..

ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబంలో, వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా ఉటాయి. మీరు ఆశించిన విధంగా పలితాలు వస్తాయి. జంటలకు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ పనుల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రెండో వారం నుండి కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. నెల చివర్లో అంతా మంచిగా ఉంటుంది.

ఆగస్టు..

ఆగస్టు..

ఈ నెలలో ధనస్సు రాశి వారికి కొన్ని నష్టాలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు ఈ నెలలో మానసికంగా చాలా ఆందోళనకరంగా ఉంటుంది.

సెప్టెంబర్..

సెప్టెంబర్..

ఈ నెలలో ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు ఏదైనా కొత్త పనులు చేయడానికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు. మీరు పనుల పట్ల ఎక్కువ ఫోకస్ పెడతారు. మీ జీవిత భాగస్వామి సహకారం వల్ల మీ మనోబలం పెరుగుతుంది. మీరు కొన్ని శుభవార్తలు వింటారు.

అక్టోబర్..

అక్టోబర్..

ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. తొలి వారంలో ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కొన్ని అడ్డంకులు ఉంటాయి. మహిళలకు ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. మూడో వారంలో ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

నవంబర్..

నవంబర్..

ఈ నెలలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఈ నెలలో కొన్ని విషయాల్లో మీరు ఆందోళన చెందుతారు.

డిసెంబర్..

డిసెంబర్..

ఈ నెలలో ఆర్థిక పరంగా కొంత అనుకూలత ఉంటుంది. మీకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగులకు కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ నెలలో మీరు చేపట్టిన చాలా పనులు సమయానికి పూర్తి కావు. దీంతో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

జనవరి..

జనవరి..

ఈ రాశి వారికి ఈ నెలలో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారులు భాగస్వామ్యుల నుండి మంచి సహాకారం లభిస్తుంది. మీరు విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగలరు. ఈ మాసంలో వ్యవహార అనుకూలత ఉంటుంది. ఆర్థిక పరంగా పరిస్థితి మంచిగా ఉంటుంది. మీ వివాహాది ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి.

ఫిబ్రవరి..

ఫిబ్రవరి..

ఈ నెలలో ఈ రాశి వారికి చాలా విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. బంధు మిత్రుల కలయిక వల్ల మానసిక ఉల్లాసం పొందుతారు. మీరు ఆర్థిక పరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మీ ఆదాయం మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు బదిలీలు కావొచ్చు. మీరు ఆశించిన ప్రమోషన్లు లభిచడం మాత్రం కష్టం అనిపిస్తుంది.

మార్చి..

మార్చి..

ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. మిత్రుల కలయిక వల్ల మీరు మానసిక ఉల్లాసం పొందుతారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఆశించిన ప్రమోషన్లు పొందుతారు. మీరు సీనియర్ల సలహాలు పాటించడం మంచిది.

Story first published: Thursday, April 22, 2021, 16:31 [IST]
Desktop Bottom Promotion