Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
Ugadi Rashi Phalalu 2021: ఉగాది నుండి సింహ రాశి వారి జాతకం ఎలా ఉందంటే...!
శ్రీ ఫ్లవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా సింహ రాశి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాగం ప్రకారం, ఏప్రిల్ 13వ తేదీ ఉగాది పండుగ రోజు నుండి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉంటుంది..

ఏయే గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయా.. లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తాయా.. గత ఏడాది మాదిరిగానే సమస్యలు వెంటాడతాయా.. అనే వివరాలతో పాటు ప్రతి నెలా మీ జాతకం ఎలా ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్..
సింహ రాశి కొత్త ఏడాదిలోని తొలి నెలలో ప్రారంభంలోనే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ప్రారంభించిన కొత్త పనుల్లో అడ్డంకులు ఎదురైనా..ఎలాగోలా చివరికొచ్చేసరికి పూర్తి చేస్తారు. రెండు వారాల అనంతరం పరిస్థితులు అదుపులోకి వస్తాయి. విద్యార్థులకు చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ఊహించిన ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

మే..
ఈ నెలలో ఈ రాశి వారికి ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీ ఆదాయం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఆశించిన విధంగా లాభాలు పెరుగుతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ నెలలో మీరు కొత్త వాహనాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగులకు కొన్ని మార్పులు సంభవిస్తాయి. మీరు కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది.

జూన్..
ఈ నెలలో సింహ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మీకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ స్వభావంలో ఏదైనా పొరపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్దుకుని, మీ వ్యవహారాలను పూర్తి చేసేస్తారు. మీరు మూడో వారం ప్రత్యర్థుల నుండి సానుకూల సమాచారాన్ని అందుకుంటారు. ఈ నెలలో వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. అవివాహితులు వివాహం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి.

జులై..
ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు చాలా ఉత్సాహ పూరితంగా పనులు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తొలి వారంలో ఇంట్లో కొన్ని మార్పులు వస్తాయి. మీరు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు. మూడో వారంలో ఆకస్మిక వివాదాలు, ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఈ మాసంలో సాధారణంగా ఉంటుంది.

ఆగస్టు..
ఈ నెలలో సింహ రాశి వారికి ఆదాయ పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మహిళలకు మాత్రం ఆదాయం విషయంలో గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణంలో సంతోషం ఉంటుంది. మీకు బంధుమిత్రుల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది. సంతాన ప్రయత్నాలలో ఉండే వారికి విజయం లభిస్తుంది. మరోవైపు ఈ నెలలో మీరు చేసిన కొన్ని పనుల నుండి మీకు మానసిక అశాంతి ఏర్పడుతుంది.

సెప్టెంబర్..
ఈ నెలలో సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మతపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ వాతావరణం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారులు కూడా మందకోడిగా సాగుతాయి. అకస్మాత్తుగా దూర ప్రాంత ప్రయాణాలు, కోర్టు వ్యవహారాలలో ప్రతికూలతలను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఈ నెల ప్రతికూలంగా ఉంటుంది. ఈ నెలలో మూడో వారంలో ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు.

అక్టోబర్..
ఈ నెలలో మీరు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు. అయితే కొత్త వాహనం లేదా కొత్త ఇల్లు కొనాలనే మీ ప్రయత్నాలు మాత్రం సఫలమవుతాయి. మీ వ్యాపారం బాగా పుంజుకుంటుంది. రెండో వారంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబసభ్యులలో ఉన్న వ్యతిరేకత క్రమంగా తగ్గిపోతుంది. మూడో వారంలో మీ పుట్టింటి వారి సహకారంతో పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. చివరి వారంలో సాదారణ ఫలితాలు వస్తాయి.

నవంబర్..
ఈ మాసంలో సింహ రాశి వారికి ఊహించిన విధంగా ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న చోటుకు బదిలీలు అవుతాయి. మీ స్నేహితుల సహకారంతో ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అవివాహితులకు కూడా శుభవార్తలు వినిపిస్తాయి. మూడో వారంలో ధైర్య సాహసాలు వంటివి చేయకూడదు. ఎందుకంటే మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. మీరు పడ్డ కష్టానికి ఫలితం రాకపోచ్చు.

డిసెంబర్..
ఈ నెలలో వ్యాపారులకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఊహించిన ఫలితాలు వస్తాయి. రెండో వారంలో అంతా సాధారణంగా ఉంటుంది. మూడో వారంలో కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ నెలలో బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

జనవరి..
ఈ నెలలో ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వ్యాపారులకు మాత్రం లాభాలు రావొచ్చు. వడ్డీ వ్యాపారం చేసే వారికి నష్టాలు రావొచ్చు. బంధుమిత్రుల నుండి కొన్ని చెడు వార్తలు వినిపిస్తాయి. మరోవైపు ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ సమస్యలన్నీ పరిష్కారం కావొచ్చు. చివరి వారంలో మీరు కొత్త పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తుంటే, వాటిని వాయిదా వేసుకోవడం మంచిది.

ఫిబ్రవరి..
ఈ రాశి వారికి ఈ మాసంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రెండో వారంలో మీరు శత్రువులపై విజయం సాధించొచ్చు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు చేయాలనుకుంటున్న శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. చివరి వారంలో పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారతాయి.

మార్చి..
ఈ నెలలో మీకు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మీ వివాహా ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుందది. మీరు ఆశించిన విధంగా భూమి, ఆస్తికి సంబంధించిన లావాదేవీలు జరుగుతాయి. మూడో వారంలో మీరు కొత్త ఇంటికి సంబంధించి కొన్ని శుభకార్యాలను వింటారు. మీకు కావాల్సిన ఆదాయం సకాలంలో లభిస్తుంది.



Click it and Unblock the Notifications