Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Valentine Week Special 2021 : ఈ రాశుల వారికి లవ్ లైఫ్ లో ఊహించని మలుపులు...! అవెంటో ఇప్పుడే చూసెయ్యండి...!
ఫిబ్రవరి రెండో వారంలో మీ ప్రేమ జాతకం ఎలా ఉంటుందో చూసెయ్యండి.
ఫిబ్రవరి నెల అంటేనే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది వాలెంటైన్స్ డే. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే కోసం ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఈరోజున ప్రేమికులంతా ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా ఫిబ్రవరి 7వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రేమ వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడు రోజుల్లో రోజ్ డే, ప్రపోజ్ డే, కిస్ డే, హగ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే మరియు చివరగా వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 12 రాశిచక్రాల వారికి ఈ వాలెంటైన్స్ వీక్ లో ఎలా ఉండబోతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి వాలెంటైన్స్ వీక్ లో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రేమిస్తున్న భాగస్వామితో సరదాగా గడిపేందుకు మీకు తగినంత సమయం దొరుకుతుంది. మీ భాగస్వామి కూడా మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఇది మాత్రమే కాదు, మీరు మీ పార్ట్ నర్ సర్ ప్రైజ్ అయ్యే బహుమతులను ఇవ్వొచ్చు. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మొత్తం మీద ఈ వాలెంటైన్స్ వీక్ మీకు ఆనందాన్ని ఇస్తుంది.

వృషభ రాశి..
ఈ వాలెంటైన్స్ వీక్ ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మీపై మరింత ప్రేమను పెంచుకుంటారు. ఈ వారం మొత్తం మీకు చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మరోవైపు మీరు ఒంటరిగా ఉంటే, మీరు ఈ కాలంలో లవ్ ప్రపోజ్ ను పొందొచ్చు. మీరు వెంటనే ఈ ప్రపోజల్ ను అంగీకరించే అవకాశం ఉంది.

మిధున రాశి..
ఈ రాశి వారికి వాలెంటైన్ వీక్ చాలా ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రేమిస్తున్న పార్ట్ నర్ కోసం మీరు ఏదైనా చేయగలరు. అది మీ జీవితాంతం గుర్తుండిపోతుంది. వారు మిమ్మల్ని వివాహం ప్రతిపాదన చేయొచ్చు. మీరు కూడా అందుకు ఒప్పుకుని మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకుంటారు. ఇలా మీ మధ్య ప్రేమ ఈ వారంలో మరింత దగ్గరవుతుంది. మీరు ఈ వారంలో మీకిష్టమైన ప్రదేశానికి ఏకాంతంగా గడిపేందుకు వెళ్లొచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు ఈ వారం రొమాంటిక్ గా ఉంటే, పరిస్థితులు కొంత కఠినంగా ఉంటాయి. ఈ కాలంలో మీ ప్రేమలో కొన్ని విభేదాలు రావొచ్చు. మీరు మీ భాగస్వామిని మానసికంగా చాలా బాధపెట్టొచ్చు. అయితే వివాహితులకు మాత్రం ఈ వారం రొమాంటిక్ గా అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.

సింహ రాశి..
ఈ రాశి వారికి వాలెంటైన్ వీక్ లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, మధ్యలో మీకు అనుకూలంగా మారతాయి. మీ ప్రియుడు/ప్రియురాలు వివాహ ప్రతిపాదన చేయొచ్చు. మీరు వివాహం చేసుకుంటే, ఈ కాలంలో మీరు జీవిత భాగస్వామితో చిన్న విబేదాలను నివారించాలి.

కన్య రాశి..
ఈ రాశి వారికి ఈ వాలెంటైన్ వీక్ ప్రేమ విషయంలో మంచిగా ఉంటుంది. మీరు మీ పార్ట్ నర్ తో ఉండే దూరాన్ని తగ్గించుకుంటారు. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ భాగస్వామి మిమ్మల్ని నిజాయితీగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకుంటారు. ఈ వారం వివాహితులకు మంచి ఫలితాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టేందుకు మీ వంతు ప్రయత్నం చేస్తారు.

తుల రాశి..
ఈ రాశి వారికి ఈ వాలెంటైన్ వారంలో రొమాంటిక్ గా ఉంటుంది. ఈ కాలంలో మీకు, మీ భాగస్వామి మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ భాగస్వాములు మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఒకరితో ఒకరు ఉండటం చాలా సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో వివాహితుల జీవితాలలో కొంత శూన్యత ఉంటుంది. అయితే మరోవైపు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విస్మరిస్తున్నారని అనిపిస్తుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి వాలెంటైన్ వీక్ లో పార్ట్ నర్ నుండి ప్రేమ విషయంలో ఊహించిన దాని కంటే ఎక్కువ మద్దతు లభిస్తుంది. అంతేకాదు, మీ భాగస్వామి మీకు విలువైన బహుమతి కూడా ఇవ్వొచ్చు. వివాహితులకు కూడా ఈ వారం చాలా గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు సాంగత్యం మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. మీరు కూడా వారిని సంతోషపరిచేందుకు మీ వంతు ప్రయత్నం చేస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి ఈ వాలెంటైన్ వీక్ సంతోషకరంగా ఉంటుంది. అయితే మీరు చిన్న పొరపాటు చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావొచ్చు. మీ ప్రవర్తన మరియు మాటల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో గొడవలకు దూరంగా ఉండాలి.

మకర రాశి..
ఈ రాశి వారు వాలెంటైన్ వీక్ లో తమ భాగస్వామితో ప్రేమలో మునిగిపోతారు. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. మీరు మీ సంబంధాన్ని కొనసాగించాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఈ సమయం వివాహితులకు చాలా మంచిగా ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామితో కొంత ఇబ్బంది ఉంటుది.

కుంభ రాశి..
ఈ రాశి వారికి వాలెంటైన్ వీక్ లో రొమాంటిక్ గా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా బలపడుతుంది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండొచ్చని నిర్ణయానికి రావొచ్చు. దీనికి మీ కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభిస్తుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి తగినంత సమయం గడపడానికి అవకాశం పొందుతారు.

మీన రాశి..
ఈ రాశి వారు వాలెంటైన్ వీక్ లో భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. అప్పుడే మీరు ఉత్సాహంగా ఉండగలరు. లేకపోతే మీకు సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ భాగస్వామి భావాలను బాధపెట్టే పని చేయకండి. మరోవైపు వివాహితులకు ఈ వారంలో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా చురుకుగా ఉంటారు.



Click it and Unblock the Notifications











