Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
కుంభరాశిలోకి శుక్రుడి సంచారంతో, ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!
కుంభంలోకి శుక్రుడి సంచారంతో ఈ 6 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మేవారంతా శుక్రుడు ఆనందం, సంతోషం, అందరి శ్రేయస్సుకు కారకంగా భావిస్తారు. గ్రహాలను బట్టి ఎవరి జాతకంలో శుక్రుడి అనుగ్రహం ఉంటుందో వారికి సంపద, ఆయురారోగ్యం లభిస్తుంది.

అలాంటి శుక్రుడు 2021లో ఫిబ్రవరి 21వ తేదీన మధ్యాహ్నం 2:19 గంటలకు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో శుక్రుడు సుమారు నెల రోజుల పాటు నివాసముండనున్నాడు.

ఆ తర్వాత మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అనేది పడుతుంది. శుక్రుడు ఇలా ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడం వల్ల ఈ సమయంలో 6 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలుంటాయట. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మిధున రాశి..
కుంభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మీరు మీ రంగంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఈ కాలంలో మీకు చాలా విషయాల్లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి..
శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అకస్మాత్తుగా సంపద పెరుగుతుంది. మీరు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. మీకు రావాల్సిన బకాయిలను ఈ కాలంలో పొందుతారు. ఉద్యోగులకు మాత్రం సహోద్యోగులతో వివాదం ఉండొచ్చు. ఈ సమయంలో మీరు ఆనందకరమైన విషయాలకు డబ్బులను ఖర్చు చేయొచ్చు. కుటుంబం విషయంలో అద్భుతంగా ఉంటుంది.

తులరాశి..
శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఉత్సాహంగా ఉంటుంది. వివాహితులకు పిల్లల నుండి ఓ శుభవార్త వినిపిస్తుంది. సమాజంలో మీ తల్లి గౌరవం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు లాభం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు కూడా మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు శత్రువుపై ఆధిపత్యం చెలాయిస్తారు.

మకర రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలను కూడా పొందుతారు. మీరు కొత్త బట్టలు లేదా ఆభరణాల కోసం షాపింగ్ చేయొచ్చు. ఈ సమయంలో విద్యార్థులు పరీక్షలో మంచి ఫలితాలను పొందొచ్చు. మీరు మీ క్రుషిని ఇలాగే కొనసాగించాలి.

ధనస్సు రాశి..
శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు కొంత దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు మీ ఫీల్డ్ లో మంచి ప్రదర్శనను కొనసాగిస్తారు. ఉద్యోగులు సీనియర్లతో పాటు సహోద్యోగులతో మంచి సంబంధాలు పెంచుకోవాలి. మీ ప్రేమ జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
