Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
సింహంలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
జులై 17న శుక్రుడు సింహంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశులకు సానుకూల ప్రయోజనాలు
జ్యోతిష్యశాస్త్రం ఈ నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. ఇప్పటికే బుధుడు తన స్థానాన్ని మార్చుకున్నాడు.

సూర్యుడు కూడా 16వ తేదీన కర్కాటకరాశిలోకి రవాణా చేయనున్నాడు. ఆ మరుసటి రోజే అంటే శనివారం రోజున శుక్రుడు కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఇదే రాశిలో సుమారు 23 రోజుల పాటు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు వైవాహిక జీవితం, అందం, ఆనందం, విలాసవంతం తదితర వాటికి కారణమైన గ్రహంగా పరిగణించబడుతుంది.

శుక్రుడు సింహరాశిలోకి సంచారం చేసే సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు వస్తాయి.. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

మేష రాశి..
శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు చాలా విషయంలో మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు మీరు ప్రజలకు సహాయం చేయడంలో ముందుంటారు. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ కాలంలో విద్యార్థులు తమ అధ్యయనాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగులకు ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు పనిలో విజయంతో పాటు గౌరవం, మర్యాదలు లభిస్తాయి.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు వెళ్లిపోవడం వల్ల కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఏ పని అయినా చాలా కష్టపడి పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ పెళ్లి దాకా ప్రయాణించొచ్చు. వివాహం చేసుకోవాలనుకునే వారికి మంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ సమయంలో మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఉద్యోగం చేసే వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుందిద. అంతేకాకుండా పెట్టుబడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ శక్తి, సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. మీరు స్నేహితులతో సమయాన్ని గడిపేందుకు వెళ్తారు. ఈ సమయాన్ని చాలా సరదాగా గడుపుతారు. విద్యార్థులు ఈ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. మరోవైపు ఉద్యోగం చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహారం, పానీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీ వైవాహిక జీవితంలో అంతా మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు.

ధనస్సు రాశి..
సింహ రాశిలోకి శుక్రుడు ప్రవేశించే సమయంలో ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు చాలా శక్తి పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా ధైర్యంగా చేస్తారు. అంతేకాదు పూర్తి ఆత్మవిశ్వాసంతో చేస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా ఉంటుంది. వ్యాపారులకు ఈ కాలంలో ఊహించిన విధంగా లాభాలు పెరుగుతాయి. అంతేకాదు మీరు ఈ కాలంలో ఎక్కువ ఖర్చులు చేస్తారు. అయితే ఖర్చులకు తగ్గ ఆదాయం లభిస్తుంది. దీంతో మీరు వెనుకడుగు అనేదే వేయరు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ కోరికలు నెరవేరుతాయి. తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది.

కుంభ రాశి..
శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఇతర దేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి సానుకూల ఫలితాలు రావొచ్చు. మరికొందరు ఈ కాలంలో అక్కడే స్థిరపడేందుకు ఇష్టపడతారు. అంతేకాదు విరాళం ఇవ్వడానికి కూడా ముందు వరుసలో ఉంటారు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా హుషారుగా పాల్గొంటారు. కుటుంబసభ్యులతో కూడా ఆనందంగా గడుపుతారు. ఏదైనా సమస్యలు ఎదురైతే.. వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు ఈ కాలంలో మంచి ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.



Click it and Unblock the Notifications
