Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
Venus Transit in Pisces 2021 : మీనంలోకి శుక్రుడు ఎంట్రీ... ఈ 6 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!
మార్చి 17వ తేదీన శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలుంటాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ శుక్ర గ్రహ అనుగ్రహం వల్ల ఆనందం, ఐశ్వర్యం, ప్రేమతో పాటు ఇతర వ్యవహారాల్లో సులభంగా విజయం సాధించొచ్చని చాలా మంది నమ్మకం.

అంతటి గొప్ప గ్రహమైన శుక్రుడు మార్చి 17వ తేదీన కుంభ రాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే ఈ రాశిలో సూర్యుడు ప్రవేశించాడు. ఇప్పుడు శుక్రుడు కూడా ప్రవేశించడంతో రాశిచక్రాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలుంటే.. మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. అయితే మీనంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఆరు రాశుల వారికి మాత్రం అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

కుంభ రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీకు దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి లభిస్తుంది. మీ ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుల నుండి మీకు చాలా విషయాల్లో మద్దతు లభిస్తుంది. వ్యాపారులు సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారులు నూతన ఒప్పందాలను కుదుర్చుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. భవిష్యత్తు భద్రత కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మీరు విజయం పొందుతారు. ఈ సమయంలో మీరు ఆకస్మిక లాభాలను పొందే అవకాశం ఉంది.

మకర రాశి..
మీన రాశిలోకి శుక్రుడి ఆగమనంతో ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. అందరితోనూ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తారు. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు పని చేసే చోట అంతా విజయవంతంగా మారుతుంది. పోటీ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు అంతా శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల ఆర్థిక పరకంగా మీకు అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి..
శుక్రుడు మీనరాశిలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. వారితో స్నేహం పెంచుకుంటారు. మీ జీవిత భాగస్వామితో చిరస్మరణీయమైన క్షణాలను అనుభవిస్తారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది.

కన్య రాశి..
మీనరాశిలోకి శుక్రుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులు, ఉన్నతాధికారులతో ప్రశంసలను అందుకుంటారు. ఈ కాలంలో మీరు మీ ప్రాజెక్టు పనులను చాలా శ్రద్ధగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారులు కూడా ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు. మీ ఖర్చులు కూడా నియంత్రణలోకి వస్తాయి. మీరు తీసుకున్న అప్పులను కూడా తిరిగి చెల్లిస్తారు. దీని వల్ల మీ మనసులో సంతోషంగా ఉంటుంది.

కర్కాటక రాశి..
శుక్రుడు మీనరాశిలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు తమ కెరీర్ కు సంబంధించి పురోగతి సాధిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మరియు ఉద్యోగాలను మార్చాలని ఆలోచిస్తున్నవారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈ రవాణా సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో మనశ్శాంతి లభిస్తుంది.

వృషభరాశి..
శుక్రుడు మీనరాశిలోకి ఆగమనం చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. క్రమంగా పరిస్థితులన్నీ నియంత్రణలోకి వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మీ ప్రేమ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు చాలా అవకాశాలుంటాయి.



Click it and Unblock the Notifications
