For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు 19 నుండి ఏప్రిల్ 25 వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి.

Weekly Rashi Phalalu

మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

<strong>డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..</strong>డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఖర్చులు పెరగడం వల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది. అయితే వారం చివర్లో ఆదాయ పరంగా పరిస్థితులు మెరుగుపడొచ్చు. అయితే మీరు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసం మీరు చాలా కష్టపడి పని చేయాలి. మరోవైపు ప్రేమ విషయంలో ఈ వారం ప్రత్యేకంగా ఉండదు. కానీ మీ సంబంధం బాగానే ఉంటుంది. ఈ వారంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆరోగ్య పరంగా కూడా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : సోమవారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం మంచిగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో మంచి సమయం గడపడానికి అవకాశం పొందుతారు. ఈ సమయంలో, మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం మరింత బలపడుతుంది. అయితే ఈ వారం పని పరంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన పనుల కోసం మీరు ఉన్నతాధికారుల ఆమోదం పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు మంచిగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఇది రాబోయే సమయంలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఈ వారం మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : శనివారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారిలో కొందరికి ఈ వారం లక్ కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు కొత్త బాధ్యతలను సిద్ధంగా ఉంటారు. ఈ సమయంలో ఉన్నతాధికారులు మీ సామర్థ్యాన్ని ఎంతో అభినందిస్తారు. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ఏదైనా సమస్య తలెత్తితే, దాన్ని పరిష్కరించడంలో మీ ప్రియమైనవారు మీకు సహాయం చేస్తారు. ప్రేమ విషయంలో ఈ వారం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీ భాగస్వామిని కలవడానికి మీకు చాలా అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ వారం శుభవార్తలను వింటారు. ఆరోగ్య పరంగా పెద్ద సమస్యలేమీ ఉండవు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 7

లక్కీ డే : ఆదివారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం శృంగార జీవితంలో పెద్ద సమస్య ఉండవచ్చు. మీరు ఈ విషయంలో ఎక్కువగా ఆందోళన పడే అవకాశం ఉంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈ వారం వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. కానీ వీరు ఒత్తిడికి లోనవుతారు. అయితే వ్యాపారులు ఈ వారం అకస్మాత్తుగా ఓ చిన్న ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 14

లక్కీ డే : మంగళవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబసభ్యులలో ఐక్యత మరియు ప్రేమ ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ వారం ఉన్నతాధికారులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. వారి సలహాలను మీరు పాటించాలి. వ్యాపారులకు ఈ వారం నష్టాలు ఉండొచ్చు. అయినా మీరు ధైర్యంగా ఉంలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 18

లక్కీ డే : శుక్రవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు శారీరక మరియు మానసిక అనారోగ్యాలను ఎదుర్కోనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది. మరోవైపు వ్యాపారులు ఈ వారం కొంచెం ఎక్కువ కష్టపడితే మీరు ఊహించిన లాభాలను పొందవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వివాహితులు ఈ వారం చాలా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న అపొహలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న జంటలకు అద్భుతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 30

లక్కీ డే : గురువారం

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారు ఈ వారం పనిలో చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగులపై ఉన్నతాధికారుల నిఘా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా సమస్య ఉంటే వారు మీకు మద్దతు ఇస్తారు. ఇది మీకు ఒక సువర్ణావకాశం, కాబట్టి అజాగ్రత్తగా ఉండకండి. వ్యాపారులు ఈ వారం ప్రారంభంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ నష్టాన్ని త్వరలో భర్తీ చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది, కాబట్టి ఎక్కువగా చింతించకండి. ఆర్థిక పరంగా ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ కుటుంబ జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది. అయితే ఈ వారం మీ జీవిత భాగస్వామితో మీ విభేదాలు కొనసాగుతాయి. అనవసరమైన విషయాలపై వాదించే మీ అలవాటు మీ వివాహ జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 28

లక్కీ డే : ఆదివారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు కూడా ఈ వారం గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక విషయాల పట్ల మీరు చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. ఆరోగ్య పరంగా మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు. మీకు ఏదైనా అనుమానముంటే, వెంటనే మీరు వైద్యులను సంప్రదించండి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ డే : శనివారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ ప్రియమైనవారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీరు కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తి శ్రద్ధ వహించడం మంచిది, ఎందుకంటే ఇది మీ కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వారం మీరు మీ వైవాహిక జీవితంపై దృష్టి పెట్టగలుగుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో గత రోజుల అందమైన జ్ఞాపకాలను తిరిగి పొందుతారు. అయితే ఉద్యోగులకు ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మీరు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 5

లక్కీ డే : గురువారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా ముఖ్యమైనది. వారం ప్రారంభంలో మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ బడ్జెట్ కు తగ్గట్టు ఖర్చులను క్రమంగా పెంచుతారు. వ్యాపారులకు వ్యాపార పరంగా అనుకూలంగానే ఉంటుంది. వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. ఏదైనా అనుమానం ఉంటే, మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి. మీరు అన్ని పనులను ఈ వారం చాలా సులభంగా పూర్తి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. శృంగార జీవితంలో మీ భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు శ్రద్ధగా అధ్యయనం చేయగలరు. ఈ వారం ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మీరు ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ డే : శుక్రవారం

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఉండొచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. అయితే ఈ సమయంలో మీరు మీ అనుభవాల నుండి చాలా నేర్చుకుంటారు. మరోవైపు వ్యాపారవేత్తలు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. వారం చివరిలో మీకు కొంత ఉపశమనం కలగవచ్చు. ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. మీ ప్రియమైన వారికి భావోద్వేగ మద్దతు పొందడం ద్వారా మీరు ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. మీరు ఈ వారం ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ డే : మంగళవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా ఆనందం కలుగుతుంది. వారం ప్రారంభంలో చాలా సరదాగా గడుపుతారు. ఈ వారం మీరు మీ కుటుంబంతో పూర్తిగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. మీరు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు. మీరు ఈ వారం చాలా కష్టపడి పని చేయవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు అవివాహితులైతే, మీరు ఈ వారం వివాహ సంబంధిత నిర్ణయం తీసుకోవచ్చు. శృంగార జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ వారం ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆదాయాన్ని పెంచే బలమైన అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 9

లక్కీ డే : బుధవారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Weekly Rashi Phalalu for April 19 to April 25

In the year 2020, third week of april will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Story first published:Sunday, April 19, 2020, 1:08 [IST]
Desktop Bottom Promotion