For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 6 తేదీ వరకు

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు ఉబ్బసం ఉంటే, నిర్లక్ష్యంగా ఉండకండి.

Weekly Rashi Phalalu for January 31 to February 06

ఎప్పటికప్పుడు, మీ వైద్యుడిని సంప్రదించండి. మరోవైపు పని విషయంలో ఈ వారం మరికొన్ని రాశుల వారికి మంచిగా ఉంటుంది. అయితే ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు సోమరితనం మానేసి, మీ పనిపై దృష్టి పెట్టాలి. వ్యాపారులు ఈ వారం అకస్మాత్తుగా ప్రయాణించవలసి ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలతో పాటు ద్వాదశ రాశుల వారి జీవితంలో ఈ వారంలో ఎలాంటి మార్పులుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం...

Zodiac Signs :వచ్చే నెలలో ఆరు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..మీ రాశి ఉందేమో చూసెయ్యండి..!Zodiac Signs :వచ్చే నెలలో ఆరు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..మీ రాశి ఉందేమో చూసెయ్యండి..!

మేష రాశి : (మార్చి 20 - ఏప్రిల్ 18 వరకు) :

మేష రాశి : (మార్చి 20 - ఏప్రిల్ 18 వరకు) :

ఈ రాశి వారు ఈ వారం కోపం ప్రదర్శించకూడదు. మీ అనియంత్రిత కోపం మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లో పడేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆఫీసులో ఉన్న సీనియర్ ఆఫీసర్లు మరియు బాస్ ని గౌరవించడం మరియు వారి చర్చకు ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. సహోద్యోగులతో కూడా మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఎలక్ట్రానిక్ వ్యాపారులకు ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. మరోవైపు, ఈ సమయంలో, మీ జీవిత భాగస్వామికి మీ నుండి కొన్ని ఫిర్యాదులు ఉంటాయి. మీ ప్రియురాలికి కూడా తగినంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించడం మంచిది. విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 35

లక్కీ డే : సోమవారం

వృషభరాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభరాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం పని మీద దృష్టి పెట్టాలి. లేకపోతే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ ఉద్యోగాన్ని కూడా మార్చాలని అనుకోవచ్చు, కానీ త్వరగా అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఫైనాన్స్‌ రంగంలో ఉండేవారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనది. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈ కాలంలో మీకు చేతులు మరియు కాళ్ళకు సంబంధించి ఏదైనా సమస్య ఉండవచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 4

లక్కీ డే : శనివారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు ఉబ్బసం ఉంటే, నిర్లక్ష్యంగా ఉండకండి. ఎప్పటికప్పుడు, మీ వైద్యుడిని సంప్రదించండి. పని విషయంలో ఈ వారం మంచిగా ఉంటుంది. అయితే ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు సోమరితనం మానేసి, మీ పనిపై దృష్టి పెట్టాలి. వ్యాపారులు ఈ వారం అకస్మాత్తుగా ప్రయాణించవలసి ఉంటుంది. కలప సంబంధిత వ్యాపారం చేస్తున్న వారు ఈ కాలంలో కొన్ని ఆర్థిక నష్టాలను చవిచూడవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. ఈ కాలంలో, మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వారం చివర్లో ఇంట్లో మతపరమైన కార్యక్రమం నిర్వహించవచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ డే : మంగళవారం

Saturn Transit 2021:శని గ్రహ సంచారం వల్ల ఈ రాశుల వారికి ఏడాదంతా లాభాలుంటాయట...!Saturn Transit 2021:శని గ్రహ సంచారం వల్ల ఈ రాశుల వారికి ఏడాదంతా లాభాలుంటాయట...!

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఈ వారం మీ ఇంట్లో వాతావరణం మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ప్రేమ మరియు ఐక్యత ఉంటుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో ఒక చిన్న యాత్ర చేయడానికి కూడా అవకాశం పొందవచ్చు. మీరు అవివాహితులైతే, ఈ కాలంలో మీ వివాహం విషయం మరింత బలపడవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు పెద్ద ఖర్చు చేసే మానసిక స్థితిలో ఉంటే దాన్ని నివారించాలి. ఈ సమయంలో మీరు పొదుపుపై ​​ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ వారం ఉపాధి ప్రజలకు చాలా బిజీగా ఉంటుంది. మీ మొత్తం పనిని ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. తద్వారా మీరు మీ పనిని ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేయవచ్చు. ఈ సమయం వ్యాపారులకు చాలా ముఖ్యమైనది. ఆరోగ్య పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 14

లక్కీ డే : శుక్రవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారిలో ఈ వారం నిరుద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. పని సమయంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఉద్యోగులకు యజమాని నుండి ప్రశంసలు లభిస్తాయి. ఎందుకంటే మీరు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేయగలరు. అలాగే, అవసరమైతే మీ సహోద్యోగులకు సహాయం చేయడంలో మీరు వెనక్కి తగ్గరు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ మొదలైన వాటిలో పనిచేసే వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఈ వారం మీరు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంటి సభ్యులతో సమన్వయం బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా నిర్ణయాలను చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి.ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 23

లక్కీ డే : బుధవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ ఆఫీసర్లను బాగా ఆకట్టుకుంటారు. మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను కూడా కేటాయించవచ్చు. వ్యాపారులు ఈ వారం ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీరు పెద్ద పెట్టుబడి గురించి ఆలోచిస్తుంటే, ఈ సమయంలో వాయిదా వేసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం మీకు ప్రత్యేకంగా ఉండదు. ఆరోగ్య పరంగా ఒక చిన్న సమస్య ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 38

లక్కీ డే : ఆదివారం

Vastu Shastra Tips : రోజూ సాయంకాలం వేళ ఈ పనులు చేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్టే...!Vastu Shastra Tips : రోజూ సాయంకాలం వేళ ఈ పనులు చేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్టే...!

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పనిలో చాలా బిజీగా ఉంటుంది. మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. లేకుంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, అన్నయ్య లేదా సోదరితో సంబంధాలు తీవ్రమవుతాయి. ఈ కాలంలో, వారి నుండి ఆర్థిక ప్రయోజనం కూడా పొందొచ్చు. ఈ వారం చివరిలో మీరు సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు. మీ యొక్క ఈ ప్రయాణం పనికి సంబంధించినది మరియు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈ సమయంలో మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 19

లక్కీ డే : శుక్రవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అదే సమంలో ఆర్థిక పరంగా కూడా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే, సహోద్యోగులతో సమన్వయం మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో, ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయం పరిష్కరించబడుతుంది. వారం చివరిలో, జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్య ఉండవచ్చు. మీరు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. మీరు బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తే, ఎలాంటి సమస్యా ఉండదు. ఆరోగ్య పరంగా ఒక సమస్య ఎదురవుతుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : శనివారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి ఈ వారం ప్రారంభంలో మంచిగా ఉండదు. ఈ సమయంలో మీ మనసులో చాలా గందరగోళంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు గతాన్ని మరచిపోయి, కొత్తగా ఆరంభించడానికి ప్రయత్నించడం మంచిది. ఈ కాలంలో నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తుంటే, అది కూడా సఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయం వ్యాపారులు పెద్ద లాభాలు పొందాలనుకుంటే, మీ ప్రణాళికలో మార్పు చేయాలి. ఈ వారం ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 33

లక్కీ డే : సోమవారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వ్యాపారులు ఏదైనా పెద్ద పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఆఫీసులో బాస్ తో మీ సంబంధాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నించండి, ముఖ్యంగా ఒక మహిళా బాస్ ఉంటే వారిని గౌరవంగా చూసుకోండి. వారం మధ్యలో డబ్బుకు సంబంధించిన సమస్య ఉండవచ్చు. ఈ కాలంలో, చాలా కష్టపడినా మీ ఆర్థిక ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆరోగ్య పరంగా ఈ వారం పెద్దగా సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ డే : ఆదివారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో ఏదైనా సమస్య ఉంటే, అప్పుడు మీరు మీ ఉన్నతాధికారులతో బహిరంగంగా మాట్లాడాలి. ఈ కాలంలో మీరు పని సంబంధిత కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు సానుకూలంగా ఉండండి మరియు ఓపికపట్టండి. రిటైల్ వ్యాపారులు మంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఈ వారంలో ప్రారంభ రోజులు బాగానే ఉంటాయి, కానీ మధ్యలో కొన్ని పెద్ద ఖర్చులు ఉండవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈ కాలంలో మీ చెవులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 5

లక్కీ డే : సోమవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం మానసిక సమస్యల కారణంగా పనిపై సరైన శ్రద్ధ చూపలేకపోవచ్చు. మీరు పురోగతి సాధించాలనుకుంటే, మీరు పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం చిన్న పనులను కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ పొరపాటు వల్ల భారీ నష్టాలు సంభవిస్తాయి. ఈ సమయంలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. డబ్బు విషయానికొస్తే, ఈ వారం మీకు మంచిది. ఆరోగ్యంపై కూడా మీరు చాలా ఎక్కువగా శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : గురువారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

English summary

Weekly Rashi Phalalu for January 31 to February 06

In the year 2021, First week of February will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Desktop Bottom Promotion