For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు 21 నుండి జూన్ 27వ తేదీ వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం మీన రాశి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మరి కొన్ని రాశుల ఉద్యోగులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. చాలా వరకు కొన్ని రాశుల వారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

Weekly Rashi Phalalu

సూర్యగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మరికొన్ని రాశుల వారికి అధమ, మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఈ వారం కొన్ని రాశుల వారిలో వివాహం కాని మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఈ వారం రాశిచక్రాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది. మీ జీవితంలో ఎలాంటి మార్పులుంటాయో తెలుసుకోండి...

విదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండివిదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండి

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం పనిలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. ఈ వారం మీ సహోద్యోగులతో కూడా సఖ్యత బాగానే ఉంటుంది. మరోవైపు వ్యాపారులకు ఈ వారం ప్రత్యర్థుల నుండి కఠినమైన పోటీ ఉంటుంది. అయితే మీ వ్యాపారం వేగంగా పెరుగుతుంది. భాగస్వామితో కలిసి ముందుకెళ్లాలని ఆలోచిస్తుంటే, ఈసారి మీ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఆర్థిక పరంగా కూడా బలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 38

లక్కీ డే : ఆదివారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారిలో ఒంటరిగా ఉండే వ్యక్తుల జీవితాల్లోకి ఈ వారం కొత్త వ్యక్తి ప్రవేశం ఉండొచ్చు. మరోవైపు, ప్రేమ వివాహం వంటి విషయాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబసభ్యుల నుండి పూర్తి మద్దతు పొందవచ్చు. మరోవైపు వివాహితులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి కూడా ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈ వారం మీ ప్రయత్నాలు సఫలమైతే, మీరు ఆర్థిక సంక్షోభం నుండి పూర్తిగా బయటపడతారు. ఈ వారం మీరు కొన్ని ముఖ్యమైన పనులకు కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులుంటాయి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 23

లక్కీ డే : బుధవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో చాలా మంచిగా ఉంటుంది. మీ కుటుంబంలో ప్రేమ మరియు ఐక్యత ఉంటుంది. ఇదే కాకుండా, ఈ సమయంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, మీ కుటుంబసభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీతో నిలబడతారు. తమ్ముడు లేదా సోదరికి సంబంధించిన ఏదైనా ఆందోళన నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. అయితే మీరు ఎక్కువ ఖర్చులు కూడా చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం మీకు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 14

లక్కీ డే : శుక్రవారం

అష్ట కష్టాలు నుండి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే ‘‘అష్టలక్ష్మీ స్తోత్రం''!!అష్ట కష్టాలు నుండి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే ‘‘అష్టలక్ష్మీ స్తోత్రం''!!

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పనిలో చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీపై బాధ్యతలు గణనీయంగా పెరగవచ్చు. కానీ మీ కృషి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం మీ కోసం కొత్త పురోగతి మార్గాలు కూడా తెరవబడతాయి. వ్యాపారులకు ఈ వారం పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాదు, పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా కూడా ఈ వారం మెరుగ్గానే ఉంటుంది. మీరు ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తుంటే, మీరు విజయం సాధించవచ్చు. మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసేటట్లయితే, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం ఆరోగ్య పరంగా బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ డే : మంగళవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఈ వారం గణనీయమైన ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీకు అపార్థాలు పెరిగిపోతాయి. మీరు సంయమనంతో వ్యవహరించడం మంచిది. లేకపోతే ఇది మీ వైవాహిక జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. సమయానికి డబ్బు అందకపోవడం వల్ల మీ పనులన్నీ పెండింగులో పడిపోయే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కారణంగా మీరు మీ పనిపై సరైన శ్రద్ధ చూపలేరు. మీరు సీనియర్ అధికారుల సహాయం కోరడం మంచిది. మరోవైపు, వ్యాపారులు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 4

లక్కీ డే : శనివారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడు పెరిగే అవకాశం ఉంది. అయితే మీకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో మీరు ఆందోళన చెందుతారు. అందుకే మీరు డబ్బు విషయాలపై ఎక్కువ ఆధారపడకండి. పని విషయంలో ఈ వారం మెరుగైన ఫలితాలు ఉంటాయి. మీరు సీనియర్ల సహాయంతో అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు ఈ వారం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం బాగానే ఉంటుంది.ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 35

లక్కీ డే : సోమవారం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే కోరుకున్న కొలువులు గ్యారంటీ...!జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే కోరుకున్న కొలువులు గ్యారంటీ...!

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పనిలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ వారం ప్రారంభంలో బాగానే ఉన్నప్పటికీ, వారం మధ్యలో పని భారం పెరుగుతుంది. ఈ సమయంలో మీ పనులన్నీ సమయానికి పూర్తి కావు. అయితే మీరు ఒత్తిడి పెంచుకోవాల్సిన అవసరం లుదు. వ్యాపారులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది.అయితే మీరు కొన్ని విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనవసరమైన విషయాలకు డబ్బులను ఖర్చు చేయకండి. ఆరోగ్య పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 30

లక్కీ డే : శుక్రవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. మీ తోబుట్టువులతో, ముఖ్యంగా అన్నయ్యతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఈ సమయంలో కొన్ని కారణాల వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే, వారాంతాల్లో, అందరితో సరదాగా గడపడానికి మీకు సువర్ణావకాశం లభిస్తుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా బాగుంటాయి. మీ ప్రియమైన వ్యక్తిని సంతోషపెట్టడానికి మీరు ఈ సమయంలో కొన్ని మంచి ప్రణాళికలు చేయవచ్చు. పని పరంగా ఈ వారం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ వారం చాలా గొప్పగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ డే : గురువారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడటంతో, మీరు మీ ముఖ్యమైన పనులపై పూర్తి శ్రద్ధ చూపగలుగుతారు. మీ పని విషయంలో ఈ వారం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం మీకు అదనపు ఆదాయం లభించవచ్చు. మీరు విలువైన దాన్ని కూడా పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. వివాహితులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఇద్దరి మద్య పరస్పర అవగాహన ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వగలుగుతారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : సోమవారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారు ఈ వారం పూర్తి ఉత్సాహంగా ఉంటారు. మీరు ప్రతి విషయంలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వంటి వార్తలు వినిపించవచ్చు. అయితే, ఇది మీపై బాధ్యతలను పెంచుతుంది, కాబట్టి మీరు మరింత కష్టపడాలి. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఇంట్లో పెద్ద గొడవ జరగవచ్చు, దీనివల్ల వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. మీ భాషను చాలా ఆలోచనాత్మకంగా వాడాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 26

లక్కీ డే : ఆదివారం

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా సమస్యలు ఎదురవుతాయి. మీరు ఇంట్లో లేదా కార్యాలయంలో ఏవైనా తప్పులు చేస్తే ముందుగా అంగీకరించండి. అలా కాకుండా, సీనియర్లతో వాదించకండి. లేదంటే మీ ఉద్యోగమే ప్రమాదంలో పడొచ్చు. మరోవైపు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏవైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే వివాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో మీకు బాధ్యతలు పెరగొచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా వరకు ఖర్చులను నియంత్రించాలి. ఆర్థిక పరంగా ఈ వారం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 10

లక్కీ డే : గురువారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ప్రతి రంగంలో మెరుగుదల చూస్తారు. నిరుద్యోగులకు ఈ వారం కొత్త ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగంలో ఉన్నవారు, మీ సీనియర్ అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించాలి. మరోవైపు మీరు ఏదైనా సొంత వ్యాపారం చేయాలనుకుంటే, మీరు మీ తండ్రి యొక్క సహాయం పొందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. మీరు ఖర్చులను కూడా చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. దీని వల్ల మీకు పెద్ద సమస్య ఉండదు. ఆరోగ్య పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. అయితే పెద్ద సమస్యలేమీ ఉండవు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : శనివారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

English summary

Weekly Rashi Phalalu for june 21 to June 27

In the year 2020, Fourth week of June will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Desktop Bottom Promotion