For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు నవంబర్ 8 నుండి నవంబర్ 14వ తేదీ వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి రిస్థితులన్నీ ప్రతికూలంగా మారతాయి. కాబట్టి మీరు చాలా చురుకుగా ఉండాలి. ఉద్యోగులు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఇందుకు మీకు సరైన సమయం కాదు. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.

Weekly Rashi Phalalu for November 08 to November 14

మీరు సరైన సమయం కోసం వేచి ఉండాలి. ఈ వారం విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది. కాబట్టి మీరు శ్రద్ధగా అధ్యయనం చేయాలి. ఈ సమయంలో మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో దూరం పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలతో పాటు ద్వాదశ రాశుల వారి జీవితంలో ఈ వారంలో ఎలాంటి మార్పులుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం...

ఏ ఏ రాశుల వారు తక్కువ సమయంలో ధనవంతులుగా మారగలవని మీకు తెలుసు?ఏ ఏ రాశుల వారు తక్కువ సమయంలో ధనవంతులుగా మారగలవని మీకు తెలుసు?

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారతాయి. కాబట్టి మీరు చాలా చురుకుగా ఉండాలి. ఉద్యోగులు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఇందుకు మీకు సరైన సమయం కాదు. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు సరైన సమయం కోసం వేచి ఉండాలి. మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం మీకు లక్కీ కలిసి వస్తుంది. మీరు ఈ వారం ఆర్థిక సమస్యలను అధిగమించొచ్చు. మీ జీవిత భాగస్వామి ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ వారం చివరిలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 4

లక్కీ డే : శనివారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం వ్యక్తిగత జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారుల పట్ల సంతోషంగా ఉండరు. మీరు చిన్న తప్పులు చేసినప్పటికీ, మీ ఉద్యోగం ప్రమాదంలో పడొచ్చు. కాబట్టి మీ పనులను జాగ్రత్తగా చేయాలి. వ్యాపారులు భాగస్వామ్యంతో కలిసి చేసే వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ వారం విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది. కాబట్టి మీరు శ్రద్ధగా అధ్యయనం చేయాలి. ఈ సమయంలో మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో దూరం పెరుగుతుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 15

లక్కీ డే : సోమవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం తమ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ నిర్లక్ష్యం కారణంగా, ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగా తగ్గుతుంది. ఈ సమయం పని చేసే వారికి మంచిగా ఉంటుంది. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీరు ఉన్నత స్థానం పొందొచ్చు. ఈ వారం చిన్న వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ బడ్జెట్ పరంగా మంచిగా ఉంటుంది. ఈ వారం మీరు విలువైన దాన్ని కూడా పొందొచ్చు. మీ వైవాహిక జీవితంలో శాంతిని కాపాడుకోవాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 28

లక్కీ డే : సోమవారం

ఈ 4 రాశుల వారికి భార్య మాటే శాసనం.. మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!ఈ 4 రాశుల వారికి భార్య మాటే శాసనం.. మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా ఆనందం ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా రిలాక్స్ అవుతారు. దీని వల్ల మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు ఈ వారం ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. మీ సీనియర్లు మీకు కొన్ని ప్రధాన పనులను అప్పగించొచ్చు. ఈ వారం ఉద్యోగులు చాలా బిజీగా ఉంటారు. అయితే కష్టపడి పనిచేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గకండి. వ్యాపారులు ఈ వారం మంచి లాభాలను పొందుతారు. మీ ప్రియమైన వారితో సంబంధాలు మెరుగుపడతాయి. మీకు భావోద్వేగ మద్దతు కూడా లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈ వారం సాధారణం కంటే మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ డే : శనివారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఈరోజు సరైన సమయం. మీరు కొత్తగా ఆలోచనలు చేయాలి. వ్యాపారులు ఈ వారం ఆర్థిక పరంగా నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే మీరు నష్టాలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఇంట్లో పెద్ద వివాదం జరగొచ్చు. మీ తప్పుడు వైఖరి మీ ప్రియమైన వారిని బాధపెడుతుంది. మీరు వివాహం చేసుకుంటే, ఈ సమయం చాలా కురుకుదనంగా ఉంటుంది. చిన్న విషయాలు కూడా మీలో గందరగోళానికి కారణమవుతాయి. ఈ వారం పనికి సంబంధించి చిన్న ప్రయాణం చేయొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 17

లక్కీ డే : మంగళవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు తెలియని భయం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ చూపలేరు. ఈ సమయం వ్యాపారులకు కూడా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఎంత కఠినమైన పోరాటం చేసినప్పటికీ, మీకు మంచి ప్రయోజనం లభించదు. మీ వ్యాపార నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. మీరు ఆర్థికంగా లాభపడొచ్చు. ఆర్థిక పరంగా మీ ఇబ్బందులు తొలగిపోతాయి. మరోవైపు మీ కుటుంబసభ్యులతో సంబంధాలు బాగుంటాయి. క్లిష్ట పరిస్థితులలో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 41

లక్కీ డే : గురువారం

కన్యరాశిలోకి శుక్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!కన్యరాశిలోకి శుక్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారు ఈ వారం కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగులకు ఈ వారం ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీ వేగం కూడా చాలా బాగుంటుంది. వ్యాపారులు కూడా ఈ వారం మంచి లాభాలను పొందొచ్చు. ఈ కాలంలో, మీరు కొత్త ఉద్యోగం కావాలనుకుంటే, మరియు వ్యాపారులు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే లేదా కొత్త పెట్టుబడి పెడితే మీకు ఉత్తమమైన ఫలాలు లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ వారం మీకు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు కొన్ని పెద్ద ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 21

లక్కీ డే : మంగళవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు పెరగొచ్చు. వారం ప్రారంభంలో మీకు కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా బ్యాలెన్స్ గా వ్యవహరించాలి. మీరు కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులకు ఈ వారం పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఈ కాలంలో, మీ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీరు వ్యాపారం విషయంలో కొంత ప్రయోజనం పొందొచ్చు. వ్యాపారులు ఈ వారం కొత్త ఆర్డర్లను పొందే అవకాశం ఉంటుంది. ఈ వారం ఆర్థిక పరంగా మీరు ఆందోళన చెందుతారు. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ డే : శుక్రవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే, మీరే చొరవ తీసుకోవాలి. అప్పుడే పరిస్థితి సాధారణ స్థాయికి వస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచి ఫలితాలొస్తాయి. డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగుల కెరీర్ సరైన దిశలో పయనిస్తుంది. పనికి సంబంధించి ఈ వారంలో ఏడు రోజులు మీకు చాలా ముఖ్యమైనవి. ఈ వారం మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు ఒక మంచి సువర్ణావకాశం లభిస్తుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 10

లక్కీ డే : శనివారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ వారం మీకు తగినంత సమయం లభిస్తుంది. మీకు పనిభారం తక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. మీరు పని చేస్తే, ఈ వారం మీ పనులన్నీ సమయానికి ముందే పూర్తవుతాయి. మీరు కొత్తదాన్ని నేర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఈ సమయంలో చాలా గొప్ప ఆలోచనలు చేయొచ్చు. అయితే ఫైనల్ డెసిషన్ మాత్రం చాలా ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు బయట ఆహారాన్ని తినడం మానుకోవాలి. మీ ఆహారంలో కూరగాయలు, పండ్లను చేర్చాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 22

లక్కీ డే : గురువారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సంబంధాల్లో మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఉపాధి చేసే ప్రజలకు శుభప్రదంగ ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది. మీరు నిరంతరం పని చేస్తున్న విధానం కారణంగా, మీరు ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. వివాహం విషయంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 34

లక్కీ డే : బుధవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ఎలాంటి సమస్య ఉండదు. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆఫీసు పనుల్లో మార్పులు సహజమే. మీకు ఎక్కువ పనిభారం ఉండొచ్చు. మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. మీ పనిని శాంతియుతంగా చేయడానికి ప్రయత్నిస్తే, మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. వ్యాపారులు ఈ వారం ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మీ పెండింగ్ పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మరోవైపు కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఈ సమయంలో అందరితో సానుకూలంగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 22

లక్కీ డే : శుక్రవారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

English summary

Weekly Rashi Phalalu for November 08 to November 14

In the year 2020, Second Week of November will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Desktop Bottom Promotion