Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
జీవితం గురించి ఏ రాశి వారు ఏం గ్రహిస్తారంటే...!
ప్రతి ఒక్క రాశి చక్రం జీవితం నుండి ఏం గ్రహిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
'లైఫ్ ఈజ్ నాట్ ఏ జోక్.. లైవ్ లైక్ ఏ లయన్..' మనలో కొందరు జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. మరికొందరు లైఫ్ ను చాలా లైట్ గా తీసుకుంటారు.

మనం పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యే వరకు జీవితంలో ఎదురయ్యే ప్రతి క్షణం మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతూనే ఉంటుంది. కాకపోతే మనం వాటిలో కొన్నింటిని మాత్రమే గ్రహిస్తాం.. మరికొన్నింటిని అస్సలు పట్టించుకోం. ఇలాంటి విషయాల వల్ల మీకు కొన్నిసార్లు సంతోషం వస్తుంది.. మరికొన్ని సార్లు సవాళ్లు ఎదురవుతాయి.

ఇలాంటి సమయంలో ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు సంక్షోభ సమయం నుండి సంతోషం వైపు అడుగులు వేస్తారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి విషయాల్లో విఫలమవుతుంటారు. ఇలా తమ జీవితంలో ఏది జరిగినా.. పాజిటివ్ గా తీసుకునే వారు అతి తక్కువ మందే ఉంటారని చెప్పొచ్చు. వీటన్నింటిని సంగతి పక్కనబెడితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, లైఫ్ గురించి ద్వాదశ రాశులలోని ప్రతి ఒక్క రాశి వారు ఏమనుకుంటున్నారు? వారు జీవితం నుండి ఎలాంటి విషయాలను గ్రహిస్తున్నారు.. జీవితం నుండి ఏమి నేర్చుకుంటున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు జీవితం పట్ల పూర్తి అవగాహనతో ఉండరు. అందుకే వీరు కొన్నిసార్లు ఆత్రుతలో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే తర్వాత వారు చేసిన పొరపాట్లను గుర్తిస్తారు. కానీ వీరు లైఫ్ లో ఏదైనా సవాళ్లు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు చాలా చురుగ్గా పని చేస్తారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు లైఫ్ ని చాలా లైట్ గా తీసుకుంటారు. వీరు జీవితం గురించి ఇతరులకు సలహాలు, సూచనలు చేస్తుంటారు. అంతేకానీ వీరు మాత్రం వాటిని పాటించరు. వీరు ఎల్లప్పుడూ సేఫ్ జోన్ ను చూసుకుంటారు. కష్టాలను ఎదుర్కోవడానికి వీరు పెద్దగా ఇష్టపడరు.

మిధున రాశి..
ఈ రాశి వారు జీవితాన్ని భిన్న కోణంలో చూస్తారు. వీరు చాలా విషయాల్లో రెండు నాల్కల ధోరణి అవలంభిస్తారు. వీరికి లైఫ్ పై పెద్దగా అవగాహన ఉండదు. వీరు పరిస్థితులను ఒక్కోమాదిరిగా ప్రవర్తిస్తారు. వీరికి ఏ విషయం పట్ల స్పష్టత ఉండదు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు జీవితం గురించి చాలా భావోద్వేగంగా ఉంటారు. వీరు ఎక్కువగా కలలు కంటూ ఉంటారు. వీరు చాలా విషయాల్లో హ్యాపీగా ఉంటారు. వీరికి సంగీతం వినడం అంటే చాలా ఇష్టం. వీరు కలల్లోనే ఎక్కువగా బతుకుతూ.. అదే నిజమని అనుకుంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో ధైర్యవంతంగా ఉంటారు. వీరు జీవితంలో ప్రతి విషయాన్ని చాలా తెలివిగా వ్యవహరిస్తారు. లైఫ్ లో వీరికి ఎప్పుడు ఏమి కావాలో అనే విషయంపై చాలా స్పష్టత ఉంటుంది. వీరి విజయానికి అదే కారణమవుతుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు జీవితంలో ఏమి కావాలన్నా చాలా క్లారిటీతో ఉంటారు. వీరు ఏమి కోరుకున్న సాధించే సత్తా వీరిలో ఉంటుంది. వీరు ఏమి కావాలనుకున్న ప్రతిదీ సాధించాలనే పట్టుదలతో ఉంటారు. ఇలాంటి కారణాల వల్ల ఇతరులతో గొడవలు వస్తుంటారు. వీరు ఏదైనా కోరుకున్నప్పుుడు.. అది జరగకపోతే చాలా నిరాశ పడతారు.

తుల రాశి..
ఈ రాశి వారు జీవితంలో ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు. వాటి నుండి బయటకు రావడానికి ఎక్కువగా ఇష్టపడరు. రియల్ లైఫ్ గురించి వీరికి ఇన్ సెక్యూర్ గా ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యక్తిగత అలంకరణకు ఎక్కువ టైమ్ కేటాయిస్తారు. నలుగురిలో వీరు ప్రత్యేకంగా కనిపించేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు జీవితం గురించి ఏమి ఆలోచిస్తున్నారనేది ఎవ్వరికీ అర్థం కాదు. వీరి ఐడియాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరు ఎక్కువగా ఇతరులను గమనిస్తూ ఉంటారు. వీరు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి లైఫ్ పై ఎక్కువ క్లారిటీ ఉంటుంది. వీరు లైఫ్ లో ఏమి అనుకుంటారో అది కచ్చితంగా సాధిస్తారు. వీరు చాలా విషయాల్లో నిజాయితీగా ఉంటారు. వీరికి లైఫ్ విషయంలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారి జీవితంలో శని గ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వీరి లైఫ్ లో ఎక్కువగా కష్టాలొస్తుంటాయి. అందుకే వీరు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. వీరు లక్ష్యాలను పెద్దగా పెట్టుకుంటారు. వాటిని సాధించడానికి నిత్యం కష్టపడుతూనే ఉంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు జీవితం విషయంలో చాలా భిన్నంగా ఉంటారు. వీరి లాంటి వారు ఇంకొకరు ఈ లోకంలో ఉండరని భావిస్తుంటారు. వీరు ప్రతి విషయంలో చాలా డిఫరెంట్ గా ఉంటారు. వీరు కూడా ఒక్కొక్కరు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తారు.

మీన రాశి..
ఈ రాశి వారు లైఫ్ ను చాలా డీప్ గా థింక్ చేస్తారు. జీవితం గురించి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అందులో ఎంత మంచి ఉంది.. ఎంత చెడు ఉంది అనే విషయాలను లెక్కిస్తారు. అయితే వీరు ఇతరులను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే.



Click it and Unblock the Notifications
