జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా?

మీ రాశిని బట్టి మీకు సూట్ అయ్యే జాబ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. ఎందుకంటే మంచి ఉద్యోగం ఉంటేనే చాలా విషయాలు సక్రమంగా సాగుతాయి.

Which job suite you based on your zoidac signs

అందుకే చాలా మంది తమ చదువుకు తగ్గట్టు వారికి నచ్చిన రంగంలో మంచి ఉద్యోగం రావాలని కలలు కంటూ ఉంటారు. అయితే చాలా మంది తమ కోరికలను నెరవేర్చుకోలేకపోతారు.

Which job suite you based on your zoidac signs

చాలా మంది తమ విద్యకు సంబంధించిన రంగానికి కాకుండా, ఇతర రంగాల్లో ఎక్కువగా పని చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం పెద్ద ఉద్యోగాల్లో మంచి జీతానికి పని చేస్తారు. అయినా వారిలో ఏదో తెలియని వెలితి ఉంటుంది.

Which job suite you based on your zoidac signs

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీ జన్మరాశిని బట్టి మీరు ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలుసుకోవచ్చు. దీని వల్ల మీరు మీ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. ఈ సందర్భంగా మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఉద్యోగం లేదా ఎలాంటి పనులు సరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి

మేషరాశి

ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. దీని ప్రభావం కారణంగా వీరు నిత్యం చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా క్రీడారంగంలో రాణిస్తారు. వీరిలో క్రీడలకు లేదా అథ్లెటిక్స్ ను కెరీర్ గా ఎంచుకుంటే, తిరుగులేని విజయం సాధిస్తారు. అంతేకాదు వీరు కోచింగ్ ఇవ్వడంలోనూ అందరి కంటే ఒక అడుగు ముందే ఉంటారు.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. వీరు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు మంచి రైటర్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. వీరు రైటర్ గా మారితే, చాలా ఆనందాన్ని పొందుతారు. వీరు ఎంచుకున్న రంగం పట్ల చాలా అంకితభావంతో పని చేస్తారు. అంతేకాదు భవిష్యత్తులో ఇతరుల కంటే మెరుగైన రచనలు సాగిస్తారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు ఎక్కువగా చాలా తెలివిగలవారు. వీరు వినోద రంగంలో ఎక్కువగా పని చేయాలని కోరుకుంటారు. వీరు యాంకర్ గా చేస్తే చాలా మందిని ఆకట్టుకుంటారు. అంతేకాదు వీరికి మంచి సమయస్ఫూర్తి ఉంటుంది. అంతేకాదు, వీరికి ప్రయాణాలు చేసేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటారు. వీరు అనేక రంగాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. వీరు టీచర్ ఫీల్డ్ ను ఎంచుకుంటే, విద్యార్థులను బాగా ఆకట్టుకుంటారు.అంతేకాదు ఫుడ్ ప్రిపేర్ చేయడంలో, ఫొటోగ్రపీ వంటి రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. వీరు కన్సల్టెన్సీ వంటి రంగాలతో పాటు ఇతర రంగాలలో చాలా చక్కగా రాణిస్తారు. అంతేకాదు అడ్వకేట్ గా కూడా బాగా విజయం సాధిస్తారు. వీరిలో పని చేసే వారు వెల్డింగ్ సంబంధించిన పని చేస్తే మంచి ఆదాయం సమకూరుతుంది. అంతేకాదు వీరు ఎవరికైనా ఏదైనా విషయంలో సందేహాలుంటే, వాటిని పటాపంచలు చేయడంలో ముందుంటారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు వీరి తెలివితేటలను ఇతరులకు కూడా పంచగలుగుతారు. వీరు వైద్యరంగంలో అద్భుతంగా రాణిస్తారు. చాలా మంది మహిళలు నర్సులుగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. వీరు నిస్వార్థంగా సేవ చేస్తారు. అలాగే వీరు ఉపాధ్యాయ, జర్నలిజం రంగాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు తాము కోరుకున్న రంగంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. అంతేకాదు వీరు వ్యాపారాలను సైతం మెరుగ్గా నిర్వహించగలరు. వీరు చాలా కష్టపడి పని చేస్తారు. వీరు న్యాయశాస్త్రం, సంగీతం, నటనా రంగం వైపు అడుగులు వేస్తే మంచి గుర్తింపును తెచ్చుకుంటారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ ప్రభావం వల్ల వీరు ఎంతో ఆలోచనాత్మకంగా పని చేస్తారు. అంతేకాదు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. వీరు సంగీతం, వినోద రంగాలతో పాటు చిత్రకారులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇవి మాత్రమే కాదు.. వీరు ఏ రంగంలోనైనా మంచి విజయాన్ని సాధిస్తారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. వీరు ఏ రంగంలో అయినా, తమ వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు. వీరు ప్రొఫెసర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాదు వీరు శాస్త్రవేత్తలు కూడా అవుతారు. దీంతో పాటు వీరు పబ్లిక్ రిలేషన్స్ కు సంబంధించిన రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. వీరు రాజకీయ నాయకుడిగానూ రాణించే అవకాశం ఎక్కువగా ఉంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి శని గ్రహం అధిపతిగా ఉంటాడు. దీని ప్రభావం కారణంగా వీరు ఎల్లప్పుడూ సానుకూల మార్గంలో వెళ్లాలని ఆలోచిస్తారు. వీరు సొంతంగా వ్యాపారం కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు మంచి నాయకులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీరు న్యాయశాస్త్రం, ఫుడ్, మైనింగ్ వంటి రంగాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు అందరికంటే విభిన్నమైన రంగాలను ఎంచుకుంంటారు. అందులో మంచి విజయం సాధిస్తారు. వీరు అందరితోనూ చాలా సఖ్యతగా వ్యవహరిస్తారు. వీరు ఇంజినీరింగ్, సైన్స్ వంటి రంగాలలో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరితో అయినా సులభంగా పరిచయాలు ఏర్పరచుకుంటారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. దీని కారణంగా వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి. వీరు చేసే ఎలాంటి ఉద్యోగంలో అయినా చాలా చక్కగా రాణిస్తారు. వీరు వైద్య రంగం, ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం వంటి విభిన్న రంగాలను ఎంచుకోవచ్చు. అంతేకాదు కథలు చెప్పడం.. కథలు రాయడం వంటివి కూడా చేయొచ్చు.

Desktop Bottom Promotion