Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Neeraj Chopra:‘నీరజ్ నీకిదే మా సలామ్.. వందేళ్ల కలను సాకారం చేశావు’
ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్రా ఎవరు? తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం కోసం భారతావని మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసింది. స్వర్ణ పతకానికి చేరువగా వచ్చి చాలా మంది నిరాశపరిచారు.

అయితే అందరి ఆశలు ఆడియాసలు అయిన వేళ యువ అథ్లెట్ నీరజ్ చోప్రా రూపంలో గోల్డ్ మెడల్ కల నెరవేరింది. జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా పసిడి పతకాన్ని సాధించి భారత అథ్లెట్లు వందేళ్లుగా కలలు కంటున్న కలని సాకారం చేశాడు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువరు సెలబ్రెటీలతో యావత్ భారతదేశం నీరజ్ కు నీరాజనం పలుకుతోంది.
కేవలం కొద్ది నిమిషాల్లో ఈ యువ అథ్లెట్ పేరు ఇంటర్నెట్ ను షేక్ చేసేసింది. ట్విట్టర్లో ట్వీట్ల మోత మోగుతోంది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా ఇలా ఏ సోషల్ మీడియ చూసినా తన పేరు మారు మోగుతోంది. ఇంతకీ ఈ నీరజ్ చోప్రా ఎవరు? వందేళ్ల భారతీయుల కలలు గంటున్న కలను తనెలా సాకారం చేశాడు? ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన నీరజ్ కు స్వర్ణ పతకం ఎలా సాధ్యపడిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పసిడి ప్రయత్నం సక్సెస్..
టోక్యో ఒలింపిక్స్ లో యువ అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త చరితకు నాంది పలికాడు. దాదాపు వందేళ్లుగా భారత ప్రజలు కంటున్న కలని నిజం చేశాడు. తొలిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొన్న నీరజ్ చోప్రా.. జావిలెన్ త్రో విభాగంలో ఫైనల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు.

నేరుగా ఫైనల్ కు..
జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో 86.5 మీటర్ల దూరం విసిరి నేరుగా ఫైనల్ కు అర్హత సాధించాడు. ఇక శనివారం రోజున జరిగిన ఫైనల్ లో కూడా ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు నీరజ్ దరిదాపుల్లోకి రాలేకపోయారు. తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఏకంగా 87.58 మీటర్ల దూరం విసిరాడు. ఇక మూడో ప్రయత్నంలో 76.93 మీటర్ల దూరం విసిరాడు. నాలుగో ప్రయత్నంలో 80 మీటర్ల దూరం వరకు విసిరాడు.

బింద్రా తర్వాత..
తను రెండో రౌండ్ లో సాధించిన 87.58 మీటర్లు ఈ ఒలింపిక్స్ లోనే కొత్త రికార్డు కావడంతో పసిడి పతకం తననే వరించింది. 2008 సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా తర్వాత, వ్యక్తిగత విభాగంలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతేకాదు అథ్లెటిక్స్ విభాగంలో ఇది మన దేశానికి తొలి స్వర్ణం కావడం మరో విశేషం. ఈ సందర్భంగా పలువురు సెలబ్రీటీలు నీరజ్ కు అభినందనలు తెలుపుతున్నారు.

నీరజ్ ఎవరంటే..
ఇంతకీ నీరజ్ చోప్రా ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వాడో చెప్పలేదు కదా.. అక్కడికే వస్తున్నా..నీరజ్ చోప్రాది హర్యానాలోని పానిపట్ సమీపంలోని ఖాంద్రా గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం. 2018 సంవత్సరంలో జరిగిన ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రో 88.06 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించిన ఈ కుర్రాడు ఒక్కసారిగా వెలుగులోకొచ్చాడు.

నీరజ్ ఎవరంటే..
ఇంతకీ నీరజ్ చోప్రా ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వాడో చెప్పలేదు కదా.. అక్కడికే వస్తున్నా..నీరజ్ చోప్రాది హర్యానాలోని పానిపట్ సమీపంలోని ఖాంద్రా గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం. 2018 సంవత్సరంలో జరిగిన ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రో 88.06 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించిన ఈ కుర్రాడు ఒక్కసారిగా వెలుగులోకొచ్చాడు.

కొద్ది రోజులు దూరం..
అయితే ఆ తర్వాత తన మోచేతికి గాయం కావడంతో కొన్ని నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. అయితే పునరాగమనంలో అద్భుతంగా సత్తా చాటాడు. ఇంటర్నేషనల్ గేమ్స్ లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో టెక్నిక్స్ ని యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడం విశేషం.



Click it and Unblock the Notifications
