For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిని బట్టి ప్రేమలో మీరెందుకు వెనుక పడతారో చూసెయ్యండి...!

|

ప్రేమ అనేది ఎప్పుడు.. ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది అనివార్యం. కొందరికి తొలి ప్రేమ జీవితాంతం నిలిస్తే.. మరికొందరి విషయంలో మాత్రం అనేక సమస్యల కారణంగా ఆ రిలేషన్ మధ్యలోనే ఆగిపోతుంది.

ఇదిలా ఉండగా.. ప్రేమ విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటుంది.. కొన్నిసార్లు మన మనసుకు నచ్చిన వారు.. అవతలి వారికి నచ్చకపోవచ్చు. ఎదుటి వ్యక్తులకు నచ్చినప్పుడు.. మనకు నచ్చకపోవడం వంటివి జరుగుతాయి.

ఒకవేళ మనకు ఎవరైనా నచ్చితే.. వారికి ఆ విషయాన్ని చెప్పేందుకు భయంగా ఉంటుంది. ఏం జరుగుతుందోనని అపొహలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. మీరు జాతకాలు వంటి వాటిని నమ్మటట్టైతే.. మీకు ప్రేమ విషయంలో ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడే తెలుసుకోండి...

Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో మేషరాశి జాతకం ఎలా ఉందంటే...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు ఏ విషయంలో అయినా ఎవ్వరిపై ఆధారపడరు. అయితే వీరు ఎవరినైనా లవ్ చేస్తే మాత్రం ఫ్రీడమ్ కోల్పోతామనే భావనలో ఉంటారు. అందుకే లవ్ విషయంలో వీరు ఎక్కువగా వెనుకపడిపోతుంటారు. ఇదే విషయం అందరికీ తెలిసేలా ప్రవర్తిస్తారు. అయితే ప్రేమ విషయంలో మాత్రం వీరి ఫీలింగ్స్ ను, అపొహలను, అందరితోనూ షేర్ చేసుకుంటారు. అందుకే ఈ రాశి వారు ప్రేమ విషయంలో భయపడుతూ ఉంటారు.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వారు చాలా విషయాల్లో మొండిగా ఉంటారు. వీరు ఎక్కువగా సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేందుకు ఇష్టపడతారు. వీరి లైఫ్ లో ఛేంజ్ అనే మాటలపై అస్సలు ఆసక్తి చూపించరు. ఇక అసలు విషయానికొస్తే.. వీరికి ప్రేమపై మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ.. ఎవరితోనూ మాటలు కలిపేందుకు ప్రయత్నించరు. వీరి బిహేవియర్ చూసి.. ఎవ్వరూ వీరిని కలిసేందుకు అంతగా ఆసక్తి చూపరు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు అందరి కంటే వినూత్నంగా ఆలోచిస్తారు. విభిన్నంగా ప్రవర్తిస్తారు. వీరి ఆలోచనలు సమయం, సందర్భం బట్టి మారిపోతూ ఉంటాయి. వీరి ఎప్పుడూ స్థిరంగా ఉండరు. వీరి రుచులు, అభిరచులు, అలవాట్లు ప్రతిరోజూ మారిపోతుంటాయి. ఇదే ప్రవర్తనను ప్రేమలోనూ కొనసాగించడంతో.. వీరిని ఎవ్వరూ ప్రేమించరు. ఒకవేళ మనసు పడినా.. వారితో కలిసి ఉండలేమనే భ్రమలో ఉండిపోతారు. అందుకే ఈ రాశి వారు ప్రేమ విషయంలో వెనుకబడి ఉంటారు.

ఏప్రిల్ మాసంలో పుట్టిన వారికి ప్రత్యేక లక్షణాలుంటాయని తెలుసా...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రేమ కోసం ప్రాణ త్యాగం కూడా చేసే అవకాశం ఉంది. అయితే ప్రేమ విషయంలో తగిలిన ఎదురు దెబ్బల వల్ల మరోసారి ధైర్యం చేయడానికి ముందడుగు వేయలేరు. ఎందుకంటే వీరు చాలా సున్నిత మనసు కలవారు. మరోసారి ప్రేమలో పడితే, తమకు మళ్లీ ఎక్కడ ఎదురుదెబ్బ తగులుతుందోనని భయపడతారు. దీంతో వీరు ఎవరినైనా ఇష్టపడినా.. మౌనంగానే ఉండిపోతారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి ప్రేమించడం అన్నా.. ప్రేమించబడటం అన్న చాలా మక్కువే. అయితే వీరు ఎక్కువగా తమ లాగా ఆలోచించే వారినే కోరుకుంటారు. దీని కోసం ఎంతకాలమైనా వేచి ఉండేందుకు సిద్ధపడతారు. వీరికి అన్ని రకాలుగా ఇష్టమైతేనే ప్రేమిస్తారు. లేదంటే.. తమ ఫీలింగ్స్ ను ఎక్కడ పట్టించుకోరోనని భయపడుతూ ఉంటారు. అందుకే వీరికి ఇష్టమైన వ్యక్తులను కూడా వదిలేసుకుంటు ఉంటారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు ఏ విషయాన్నైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే అన్ని విషయాలను షేర్ చేసుకోరు. ఎవరిని ఎక్కడుంచాలో.. ఎవరికి ఎంత వరకు చెప్పాలో అన్నట్టుగా వ్యవహరిస్తారు. ప్రతి పనిలో, వ్యక్తిలోనూ అన్ని పనులు పద్ధతిగా జరగాలని కోరుకుంటూ ఉంటారు. రిస్క్ లేకుండానే ఏ పనైనా చేస్తారు. ప్రేమ విషయంలో ఇలానే వ్యవహరించడంతో వీరికి ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి.

Monthly Horoscope: ఏప్రిల్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు అందరి కంటే చాలా భిన్నంగా ఉంటారు. వీరు మాట మీద నిలబడే వ్యక్తులు. ఏ విషయంలో అయినా కమిట్ మెంట్ ఉంటుంది. వీరు ప్రేమ విషయంలో నిజాయితీని కోరుకుంటారు. అదే సమయంలో ఎప్పుడూ క్లోజ్ గా ఉండాలనుకుంటారు. వీరు ఎవరినైనా ఇష్టపడితే.. వెంటనే వెళ్లి లవ్ మ్యాటర్ చెప్పేస్తారు. ప్రేమ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి ప్రేమ, రొమాన్స్ అంటే ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే వీరికి సహజంగా అనుమానించే గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లో ఇదే పద్ధతిని అనుసరిస్తారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే తమను మోసం చేస్తారేమోనని లేనిపోని అపొహలు పెట్టుకుంటారు. అందుకే వీరు ఎక్కువగా సింగిల్ గా మిగిలిపోతుంటారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు చాలా విషయాల్లో బాధ్యతగా ఉంటారు. అయితే ప్రేమ విషయంలో చాలా వెనుకబడి ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే.. ఎప్పుడు, ఏం జరుగుతుందోనని భయపడుతుంటారు. కానీ అనుకోకుండా ఎవరినైనా ప్రేమిస్తే మాత్రం.. ముందుగా ఎదుటి వారి అభిప్రాయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేస్తారు. వారు ఓకే అంటేనే ముందుకెళ్తారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరు రిస్క్ లను బాగా ఇష్టపడతారు. అయితే వీరు ప్రేమ విషయంలో అందరి కంటే భిన్నంగా ఉంటారు. వీరు ప్రేమ కోసం పరితపిస్తుంటారు. ప్రేమను లైఫ్ లో ఒక పార్ట్ గా మాత్రమే చూస్తారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు సింగిల్ కింగుల్లా ఉండేందుకు ఇష్టపడతారు. వీరి ఫ్రీడమ్ కు ఎక్కడ హాని కలుగుతుందనే భయంతో వీరు ప్రేమలో ముందడుగు అనేది వేయరు. ప్రేమలో పడితే తమకు సరిహద్దులు వస్తాయేమోనని భావిస్తుంటారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు నిస్వార్థ స్వభావం కలిగి ఉంటారు. వీరు కొన్ని విషయాల్లో స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. ప్రేమలో పడితే తమ స్వభావాన్ని ఎక్కడ మార్చుకోవాల్సి వస్తుందోనన్న అనుమానంతో వీరు ప్రేమ విషయంలో వెనుకడుగు వేస్తుంటారు.

English summary

Why Are You Afraid of Love, According to Zodiac Sign?

Here we are talking about why are you afraid of love, according to zodiac sign. Read on
Story first published: Monday, April 5, 2021, 19:10 [IST]